‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల
అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్
యం.ఎన్.ఆర్ ఫిలిమ్స్ పతాకంపై నర్రా శివనాగేశ్వర్ రావు (శివనాగు) దర్శకత్వంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. యం.ఎన్.ఆర్ చౌదరి నిర్మాతగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. సీనియర్ నటి జమున కీలక పాత్రలో కనిపించనున్నారు.. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈరోజు ప్రసాద్ లాబ్స్ లో ప్రముఖ నిర్మాత, సి. కళ్యాణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో….
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ – “అన్నపూర్ణమ్మ గారి మనవడు’ టైటిల్ చాలా బాగుంది. మంచి పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన్న మూవీ. శివనాగు నాకు చాలా కాలంగా పరిచయం. అందమైన కథలను సినిమాలుగా తీస్తుంటాడు. ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ గారు నటించడం మంచి విషయం. అలాగే జమునగారు మరో పాత్రలో కనిపిస్తారు. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. సినిమా తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది’అన్నారు.
నిర్మాత యమ్.ఎన్ ఆర్ చౌదరి మాట్లాడుతూ – ” ఒక మంచి సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు శివనాగు ఈ సినిమాను ఎంతో అందంగా తెరకెక్కించారు. అలాగే మాస్టర్ రవితేజ మంచిపెర్ఫామెన్స్ఇచ్చాడు.నేనునిర్మాతగావ్యవహరిస్తున్న తోలి సినిమాలో అన్నపూర్ణమ్మ, జమున లాంటి లెజెండరీ యాక్టర్స్ నటించడం నిజంగా నా అదృష్టం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ లో ఆడియో విడుదల చేసి అక్టోబర్ లో సినిమా విడుదల చేస్తాం” అన్నారు.
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ – ” చాలా కాలం తరువాత మళ్ళీఒక మంచి పాత్రలో మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. దర్శకుడు శివ నాగు నాకు చాలా కాలంగా తెలుసు. ఎన్నో మంచి సినిమాలను రూపొందించాడు. చాలా డిసిప్లేన్డ్ డైరెక్టర్. అలాగే నా మనవడిగా యాక్ట్ చేసిన మాస్టర్ రవితేజ ఒక చిచ్చర పిడుగు. పుట్టుకతోనే నటన నేర్చుకొని వచ్చాడు. మంచి భవిష్యత్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో నాతో పాటు జమున, రఘబాబు ఇలాఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు నటించారు” అన్నారు.
హీరో తారక రత్న మాట్లాడుతూ – ” శివ నాగు గారి దర్శకత్వంలో దేవినేని సినిమా చేస్తున్నాను. సినిమా మీద ఎంతో ఇష్టంతో పని చేస్తారు. అలాగే అన్నపూర్ణమ్మ గారితో ఒక సినిమా చేశాను. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈ సినిమా ద్వారా యూనిట్ అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను”అన్నారు.
సీనియర్ పాత్రికేయులు వినాయక రావు మాట్లాడుతూ – ” మంచి గ్రామీణ నేపథ్యంలో రూపొందిన సినిమా. ఈ సినిమా ద్వారా అన్నపూర్ణమ్మ గారు తెరపై మళ్ళీ జన్మించారు. నా మిత్రుడు శివ నాగు తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మాస్టర్ రవితేజ కి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా” అన్నారు.
చిత్ర దర్శకుడు శివనాగేశ్వర రావు ( శివ నాగు ) మాట్లాడుతూ – ” మంచి కంటెంట్ ఉన్న స్టోరీ. నా సినిమా కథ చెప్పగానే ఈ సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్ననిర్మాత చౌదరి గారికి థాంక్స్. ఆయన ఈ సినిమాలో ఎస్పీ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అలాగే అన్నపూర్ణమ్మ గారి సోదరి క్యారెక్టర్ లో సీనియర్ మహానటి జమున గారు నటించారు. బెనర్జీ, రగుబాబు, ఇంకా ఎంతో మంది సీనియర్స్ ఈ సినిమాలో నటించారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. త్వరలోనే 200 లకు పైగా థియేటర్స్ లో సినిమాను విడుదల చేయనున్నాం ” అన్నారు.
అన్నపూర్ణమ్మ, జమున, అర్చన, బలదిత్యా, మాస్టర్ రవితేజ, సుధ, శ్రీ లక్ష్మి, బెనర్జీ, జీవా, రఘుబాబు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, శ్రీ హర్ష, సాయి, , ప్రభ, జయవాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమటోగ్రాఫర్: గిరికుమర్(గిరి), ఎడిటర్: కె. ఎస్. వాసు, సంగీతం: రాజ్ కిరణ్, మాటలు సహాకారం:జి.వి. అమరేశ్వర రావు, లిరిక్స్ : ఎస్.వి రఘుబాబు,మౌన శ్రీ మల్లిక్, ఆమని శర్మ, నిర్మాత : యం.ఎన్.ఆర్ చౌదరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నర్రా శివ నాగేశ్వర్ రావు (శివ నాగు).