Rakshasudu Director Ramesh Varma interview
– రమేష్ వర్మ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన జంటగా రమేష్ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో ఎ హవీష్ ప్రొడక్షన బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ తెరకెక్కించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళ ‘రాట్చసన’ చిత్రానికి రీమేక్ ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి రమేష్ వర్మ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు…
‘ ఈ సినిమా చేయడం ఎలా అనిపించింది?
– సినిమా ఎంత థ్రిల్లింగ్‌గా ఉందో, నా ఎగ్జయిట్మెంట్ కూడా అంతే థ్రిల్లింగ్‌గా ఉంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది రమేష్ వర్మ అంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
‘ మామూలుగా ప్రతి దర్శకుడికీ తమ క్రియేటివిటీ గురించి అనుకున్నప్పుడు ఆనందం ఉంటుంది. ఈ సినిమా విషయంలో మీరు చాలా వరకు కాపీ పేస్ట్ చేశారు. ఇప్పుడు ఏమనిపిస్తోంది?
– కాపీ పేస్ట్ అంటే… నా చిన్నప్పటి నుంచీ నేను సూపర్‌గుడ్ ఫిలిమ్స్‌లో చాలా రీమేక్‌లు చూశా. అవన్నీ సక్సెస్‌లే. నా కెరీర్లో ఇది నా ఐదో సినిమా. నేనెప్పుడూ రీమేక్ సినిమా చేయాలని అనుకోలేదు. కానీ, ఈ సినిమాలో కంటెంట్ చూసిన తర్వాత నాకు బాగా నచ్చింది. అక్కడున్న టెంపోని ఇక్కడ నేను మళ్లీ తీసుకొచ్చా. ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం అంటే అంత మామూలు విషయం కాదు. అలాగే రీమేక్ చేయడం ఈజీ కాదు. ఇండియా లెవల్లో ఎన్నో సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అవన్నీ హిట్ అయ్యాయా? కాకపోతే నేను సక్సెస్ అయ్యాను. ఒరిజినల్ డైరక్టర్ ఎంతలా హార్ట్ పెట్టి చేశాడో, నేనూ అంతే చేశా. నిజానికి ఒరిజినల్ డైరక్టర్ రెండేళ్లు ఈ సినిమా చేశాడు. నేను ఇక్కడ మూడు నెలల్లో తీశా. ఒరిజినల్ సినిమాలో హార్ట్ ఎంత ఉందో, ఇందులోనూ అంత ఉంది. కత్తిమీద సాము అది. అయినా చేసి సక్సెస్ అయ్యా.
‘ మళ్లీ అదే బొమ్మ వేయడం… ప్రెజర్ ఫీలయ్యారా?
– ప్రెజరే మరి. నిజానికి దీనికన్నా పెద్ద అవకాశాన్ని బెల్లంకొండ సురేష్‌గారు ఇచ్చారు. వాళ్లబ్బాయిని నా చేతిలో పెట్టినప్పుడు నేను ఈ సినిమాను ఎంపిక చేసుకున్నా. దీనికన్నా ముందు ఆయన ఓ లవ్ స్టోరీతో డబుల్ బడ్జెట్ ఉన్న సినిమా ఇచ్చారు. ఇద్దరు హీరోయిన్లు, దేవీ మ్యూజిక్, లండనలో సినిమా… ఇలా చాలా బెటర్ అవకాశం ఇచ్చారు. కానీ డెస్టినీ నన్ను ఇలా తీసుకెళ్లింది.
‘ రిలీజ్‌కి ముందు టెన్షన ఎలా అనిపించింది?
– ఈ సినిమా కోసమనే కాదు. ప్రతి సినిమా కోసం టెన్షన పడతాం. ఏ శుక్రవారం ఎవరిదో టెన్షన ఉంటుంది. ఈ సినిమా రైట్స్ కోసం నేను చెన్నైలో రెండు నెలలు కూర్చున్నా. 11 మంది నిర్మాతలు అక్కడ ఈ సినిమా కోసం వెయిటింగ్. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరూ వదులుకోరు కదా. నాకు మంచి నిర్మాత దొరికారు కనుక, నేను డబ్బు ఇచ్చి ఒప్పించి ఈ సినిమా చేశా. ‘కవచం’ సినిమా పూర్తవగానే నేను సాయిశ్రీనివాస్‌కి ఈ కథ చెబితే. ‘మళ్లీ పోలీస్ చేయను’ అని అన్నాడు. అప్పుడు హవీష్కైతే బావుంటుందనిపించి, వాళ్ల ఫాదర్‌కి ఈ సినిమా చూపించా. అప్పుడు వాళ్ల ఫాదర్ ‘చాలా బావుంది. అయినా హవీష్ ఆల్రెడీ థ్రిల్లర్ చేస్తున్నాడు కదా, ఇంకో థ్రిల్లర్ వద్దు’ అని అన్నారు. మరోవైపు నన్ను ఈ సినిమా హాంట్ చేస్తా ఉంది. నిజానికి నేను థ్రిల్లర్లు పెద్ద ప్రిఫర్ చేయను. లవ్ స్టోరీలు, ఎంటర్టైనింగ్ స్టోరీలనే ఇష్టపడతా. అయినా ఈ సినిమా విషయంలో మాత్రం నా అభిప్రాయం మారలేదు. అందుకే మళ్లీ ఒకసారి బెల్లంకొండ సురేష్గారి దగ్గరకు వెళ్లి ‘నా మాట విని ఈ సినిమా ఒక సారి చూడండి’ అని అన్నా. వాళ్ల ఫ్యామిలీ మొత్తం చూశారు. నేను వాళ్లని ఎన్నిసార్లు అడిగానో, దానికి డబుల్ టైమ్ వాళ్లు నన్ను చేజ్ చేశారు. బెల్లంకొండ సురేష్గారయితే ప్రతిరోజూ మూడు సార్లు ఫోన చేసేవారు. ఫైనల్‌గా ఇది ఓకే అయింది.
‘ అంత అడిగిన ఆయన ఈ సినిమాను నిర్మించలేదా?
– స్పాట్లో డబ్బులు కట్టి హక్కులు కొన్న కోనేరు సత్యనారాయణగారిలాంటి వండర్ఫుల్ నిర్మాత చేస్తానంటే ఆయనెందుకు వద్దంటారు.
‘ ఈ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘రెండేళ్ల తర్వాత హిట్ పడింది’ అని అన్నారు. అంటే అంతకు ముందు అతను ప్లాపుల్లో ఉన్నట్టేగా? ఆ సైకలాజికల్ ఫీలింగ్‌ని మీరెలా ఓవర్‌కమ్ అయ్యారు?
– చాలా క్రైసిస్‌లో ఉన్నప్పుడే నేను బెల్లంకొండ సురేష్ ప్రొడక్షనలో ‘రైడ్’ సినిమా చేశా. వాళ్ల బ్యానర్లో ఆ టైమ్‌లో రైడ్ చాలా మంచి హిట్. ఆ టైమ్‌లో నన్ను గోల్డెన హ్యాండ్ అని అనేవాడు సురేష్‌గారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా మా హీరో ‘రమేష్‌గారు… మా బ్యానర్‌కి మంచి హిట్ ఇచ్చారు. ఇప్పుడు నాక్కూడా మంచి హిట్ ఇస్తారు కదా’ అని అంటుండేవాడు. ‘ష్యూర్‌షాట్‌గా సినిమా మీకిస్తాను నేను’ అని అన్నా. ఈ సినిమాకు ఫస్ట్ హీరో కథ రాసిన రామ్‌కుమార్, సెకండ్ హీరో జిబ్రన. ఆ తర్వాతే నేను. ఇంకో విషయం ఏంటంటే తమిళంలో విష్ణు విశాల్ పెద్ద హీరో కాదు. అలాంటిది కాస్త డౌన ఫేస్‌లో సాయికి ఈ సినిమా బావుంటుంది అని నమ్మాను. బోయ్ నెక్స్ట్ డోర్ కేరక్టర్ మెప్పిస్తుందని అనుకున్నా. ఇప్పటిదాకా డ్యాన్సులు, ఫైట్లు చేశాడు. అందుకే ఈ సినిమా అతనికి కొత్తగా ఉంటుందని కన్విన్స చేశా. ఫైట్స్ పెట్టాలని కాస్త ప్రెజర్ చేశారు కానీ, నేను తలొంచలేదు. వీటన్నిటికన్నా నాకు అసలైన ప్రెజర్ మా ప్రొడ్యూసర్గారి గురించి అనుకున్నప్పుడు వచ్చేది. ఎందుకంటే ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రంగంలో అడుగుపెడుతున్నప్పుడు నాతో సినిమా మొదలుపెట్టారు. దాంతో చాలా మంది ‘ఏంటి వీడు డైరక్టరా? వీడు డిజైనరు. ఏదో వాడికి ఓ ‘రైడ్’ సినిమా వచ్చింది’ అని అనుకున్నారు. అంతే కాదు, మా నిర్మాతగారితోనూ ఆ విషయాన్ని చెప్పారు. ‘ఎందుకండీ ఇతనితో రిస్క్. మీ అబ్బాయితో చేసుకుని, వేరే పెద్ద డైరక్టర్ని పెడితే, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను, సత్యనారాయణగారు, బెల్లంకొండ మాత్రమే నమ్మాం.
‘ ఒరిజినల్‌కు చేంజెస్ చేయవద్దు అనేది మీ నిర్ణయమా? నిర్మాత నిర్ణయమా?
– తమిళ్లో సెన్సార్ వెర్షన 3 గంటలు చేశారు. అలాగే విడుదల చేయాలని డైరక్టర్ పట్టుబడితే, పెద్ద గొడవలయ్యాయట. అప్పుడు అందరూ అక్కడ డైరక్టర్ని కన్విన్స చేసి 2.32గంటల్లో సినిమాను విడుదల చేశారు. నేను ఆ విడుదలైన వెర్షననే చూశా. జిరాక్స్ చేయడం కూడా ఈజీ కాదు. ఇండియాలో టాప్ గ్రాసర్ సినిమాను ఓ సౌత ఇండియన డైరక్టర్ తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఐఎండీబీలో టాప్ సెకండ్ సినిమాను మేం చేశాం. ప్రూవ్ చేసుకున్నాం.
‘ తమిళ్లో ఉన్న కొన్ని సన్నివేశాలను యథావిధిగా వాడారని…
– అవునండీ. అవి నాకు నచ్చాయి. తెలుగులోనే కాదు, ఎన్ని భాషల్లోకి ఈ సినిమాను రీమేక్ చేసినా వాటిని అలాగే ఉంచేయవచ్చు అని అనిపించింది. కేరక్టర్ల విషయానికి వస్తే నాకు ఆ టీచర్ కేరక్టర్ చేసిన వ్యక్తి బాగా నచ్చాడు. ఎవరా? అని వెళ్లి కలిస్తే ఆయన ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని తెలిసింది. ఏసీపీ కేరక్టర్ చేసిన ఆవిడను కలిశా. ఆవిడ గుంటూరావిడ. తెలుగావిడ. చాలా బాగా సరిపోయింది. సిరి పాత్ర చేసిన అమ్మాయి కళ్లు నచ్చి సెలక్ట్ చేసుకున్నా.
‘ ఈ సినిమా చూసిన వాళ్లలో మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన వారు ఎవరు?
– ఎవరో కాంప్లిమెంట్ ఇస్తారని నేను చేయలేదండీ. నాకు ఆత్మసంతృప్తి కలిగింది. ఇంకో విషయం ఏంటంటే సినిమా చూసి బెల్లంకొండ శ్రీనివాస్ ఫాదర్ నాకు మెసేజ్ చేశారు. ‘మా అబ్బాయికి కెరీర్లో బ్లాక్ బస్టర్ ఇచ్చావు’ అని. సినిమా చూసిన పది నిమిషాల్లో హీరో పాదర్ అలా మెసేజ్ పెట్టడం ఆనందాన్ని కలిగించింది.
‘ నితినతో మీ సినిమా ఒకటి అనౌన్స అయింది..?
– అవును. ఈ కథ జరుగుతున్నప్పుడు నేను నితిన వాళ్ల నాన్నగారిని కలిసి కథ చెప్పా. మీడియాలో ఆ విషయం రావడం వల్ల డిస్టర్బెన్స జరిగింది. యాక్చువల్‌గా వాళ్లకి కూడా నచ్చింది. ఇప్పుడు కూడా ఆ కథను, ఆ లవ్‌స్టోరీని నితినతో చేయాలని ఉంది.
‘ ఇప్పుడు మీ ప్లానింగ్స్ ఏంటి?
– ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేసుకోవాలని ఉంది. రైడ్ హిట్ అయ్యాక రెండేళ్లకు వీర చేశా. ఆ తర్వాత మూడేళ్లకు అబ్బాయితో అమ్మాయి చేశా. ఇప్పుడు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది.
‘ ఈ రీమేక్ వర్కవుట్ కావడానికి కారణాలు ఏమనుకుంటారు?
– టోటల్ హిట్ కావడానికి ఎప్పుడూ ఒక్కరే కారణం కాదు. ఆ సినిమాకు పనిచేసేవారందరూ ఆ సినిమాను ప్రేమించాలి. మా సినిమాను హీరోగారు ప్రేమించారు. అందుకే బాగా చేశారు. నడిచి వచ్చే సన్నివేశాల్లోనూ నేను చెప్పినట్టే చేశాడు. ఏం చెప్పినా వచ్చి చేశాడు. నన్ను అంత నమ్మాడు. అందరి కో ఆపరేషనతోనే అంత జరిగింది.
‘ సాగర్‌తో డైలాగులు రాయించడం గురించి?
– సాగర్ని నా లవ్ స్టోరీకి డైలాగు రైటర్‌గా పెట్టుకున్నా. ఆ సినిమా ఆపేశాను. అతనికి అడ్వాన్స ఇచ్చి అలా ఆపేయడం నాకు నచ్చలేదు. అందుకే ఈ సినిమాకు కంటిన్యూ చేశా. ఎందుకంటే అతనికి తమిళ్ తెలుసు.
‘ జిబ్రానగారిని పెట్టుకోవడానికి కారణం ఏంటి?
– జిబ్రన లేకుంటే ఈ సినిమా లేదు. బీజీఎం వల్లనే ఈ సినిమా ఎలివేట్ అయింది. అందుకే అతన్నే పెట్టుకున్నా. పైగా అతను ‘సాహో’తో చాలా బిజీగా ఉన్నాడు. అయినా నాకు చాలా హెల్ప్ చేశాడు.
‘ మీ దగ్గర పనిచేసిన వాళ్లు ఇప్పుడు సెటిల్ అయ్యారు..
– నిజమే. రాక్షసుడికి నా దగ్గర మొత్తం కొత్త టీమ్ వచ్చింది. ఇంతకు ముందు నా దగ్గర పనిచేసిన వాళ్లందరూ డైరక్టర్లు అయిపోయారు. అందరూ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. నా దగ్గర పనిచేసిన వాళ్ల దగ్గర నేను ఏదైనా సరే వింటా. వాళ్లు నా దగ్గర స్వేచ్ఛగా ఉంటారు. విరించి,సప్తగిరి, మంజునాథ్.. ఇలా అందరూ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన వాళ్లలో ప్యాషన నచ్చితే నేను వెంటనే వాళ్లను అసిస్టెంట్లుగా తీసుకుంటా.
‘ ప్రొడక్షన టీమ్ ఎలా సపోర్ట్ చేసింది?
– కోనేరు సత్యనారాయణగారికి నా మీద నమ్మకం ఉంది. ‘నీకు ఇష్టం వచ్చినట్టు తీయి’ అని అన్నారు. ప్రొడక్షన టీమ్ మొత్తం నేనే సెట్ చేసుకున్నా. అందుకే అనుకున్న సక్సెస్ వచ్చింది.