Rajdooth movei review rating 3.5/5
`రాజ్ దూత్ ` మూవీ రివ్యూ!!
నటీనటులుః మేఘాంశ్ శ్రీహరి, నక్షత్ర, కోట శ్రీనివాసరావు, ఆదిత్య మీనన్, రవివర్మ, మనోబాల, నల్లవేణు, ఏడిద శ్రీరామ్, దేవిప్రసాద్ తదితరులు
సాంకేతిక నిపుణులుః
బేనర్ః లక్ష్య ప్రొడక్షన్స్
సంగీతంః వరుణ్ సునీల్
నేపథ్య సంగీతంః జెబి
నిర్మాతః ఎమ్ ఎల్ వి సత్యనారాయణ
దర్శకత్వంః అర్జున్- కార్తిక్
రేటింగ్ః 3.5/5
విలన్ గా పరిచయమై హీరోగా ఎదిగిన రియల్ హీరో రియల్ స్టార్ లేట్ శ్రీహరి. ఆయన చిన్న కొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతూ రూపొందిన సినిమా `రాజ్ దూత్`. అర్జున్ కార్తిక్ లను దర్శకులుగా పరిచయం చేస్తూ ఎమ్ ఎల్ వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. నక్షత్ర హీరోయిన్ గా నటించింది. మరి రియల్ స్టార్ శ్రీహరి తనయుడు అనగానే మామూలుగానే ఆ సినిమా పై హోప్స్ ఉంటాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ విషయానికొస్తే….
సంజయ్ ( హీరో మేఘాంశ్ శ్రీహరి) అనిష్ కురువిల్లా కూతరు నక్షత్ర ని లవ్ చేస్తాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అనిష్ కురువిల్లా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు సంజయ్ . నీ పట్టుదల నచ్చింది కానీ , విపరీతమైన యాటిట్యూడ్ , ఆవారాగా తిరిగే నీకు మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలంటాడు. అప్పుడు హీరో సరే ఏం చేస్తే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు అంటాడు. చెబితే చేస్తావా అంటాడు, చేస్తానని ఒప్పుకుంటాడు. మా ఫాదర్ కోమాలో ఉన్నారు …ఆయనకు ఆపరేషన్ చేస్తే మామూలు మనిషివుతాడట..కానీ కోమాలోంచి బయటపడ్డాక ఆయకు ఇష్టమైంది కళ్లముందు ఉంచాలట …మా నాన్నకు ఆయన పెళ్లయ్యాక కొన్న రాజ్ దూత్ బైక్ అంటే ప్రాణం ఆ బైక్ తెచ్చి ఇవ్వగలవా అంటాడు. సరే ఈ జీ పనే కదా అని ఓకే అంటాడు హీరో. అసలు ఆ బైక్ ఎక్కడుంది. ఏమైంది? అసలు ఉందా? లేదా? ఆ బైక్ కోసం హీరో ఎన్ని కష్టాల్లో పడ్డాడు? చివరకు ఆ బైక్ తేగలిగాడా? లేదా? ఆ బైక్ హీరోతో అనిష్ ఎందుకు తెప్పించాలనుకున్నాడు? ఆ బైక్ స్టోరి ఏంటన్నది సినిమా.
నటీనటుల పనితీరుః
మేఘాంశ్ శ్రీహరి బద్దకస్తుడుగా, బలాదూర్ గా తిరిగే వాడుగా పర్ఫక్ట్ గా నటించాడు. తనకిది తొలి సినిమా అయినా ఎక్కడా కొత్త కుర్రాడన్న ఫీలింగ్ రాకుండా ఎక్స్ పీరియన్స్ ఆర్టిస్ట్ లా ఎంతో ఈజ్ తో చేసాడు. హీరోగా నిలబడే అవాకాశాలు తనలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే కీర్తి సురేష్ పోలికలతో హీరోయిన్ నక్షత్ర తన పాత్ర కొంచెమే అయినా ఉన్నంత వరకు బాగా చేసింది. ఇక కమెడియన్ సుదర్శన్ తన తనదైన శైలిలో డైలాగ్స్ పలుకుతూ నవ్వించాడు. రాజన్న గా ఆదిత్య మీనన్, అనీష్ కురువిల్లా, రవివర్మ ఏడిదశ్రీరామ్ వారి పాత్రలకు న్యాయం చేసారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇద్దరు దర్శకులు ఓ కొత్త పాయింట్ తో కొత్త కథను తెరకెక్కించారు. తీసుకున్న పాయింట్ బాగుంది డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. స్టోరీ నేరేషన్ ఇంకాస్త ఇంట్రస్టింగ్ గా ఉంటే సినిమా ఓ రేంజ్ లో ఉండేది. కానీ కొత్త దర్శకులైనా ఎక్కడా తడబడకుండా వారు అనుకున్నది చెప్పడానికి ప్రయత్నించిన విధానం ఫలించదనే చెప్పాలి. ఇక నిర్మాత సత్యనారాయణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు.
సినిమాకు ప్లస్ పాయింట్స్
మేఘాంశ్ శ్రీహరి నటన
సంగీతం
సినిమాటోగ్రఫీ
స్టోరి లైన్
సెకండాఫ్
సినిమాకు వీక్ పాయింట్స్
ఫస్టాప్ వీక్ నేరేషన్
మనోబాల ట్రాక్
విశ్లేషణః
ఒక కొత్త పాయింట్ తీసుకుని దర్శకులు దాన్ని జెన్యూన్ గా తెరపై కి ఎక్కించడంలో సక్సెస్ సాధించారు దర్శకులు. రియల్ స్టార్ తనయుడిని పరిచయం చేస్తున్నాం అని ఏదో హంగులు , హడావిడికి పోకుండా ఒక నార్మల్ కుర్రాడు తన ప్రేమను గెవలడానికి పట్టుదలతో ఎంత వరకైనా వెళతాడు అనేది చాలా జెన్యూన్ గా చూపించారు. ఆ క్యారక్టర్ లో మేఘాంశ్ హండ్రెడ్ పర్సెంట్ ఒదిగిపోయి నటించాడు. ఫస్ట్ సినిమా అయినా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ బైక్ చేతులు మారుతూ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరకు వెళ్లడం…చివరకు ఆ బైక్ కడప రాజన్న దగ్గర ఉండటం, ఆయన దాన్ని కన్నకొడుకులా భావించడం, దానికి ఆ గ్రామస్తులు గుడి కట్టి పూజలు చేయడం ఇలా తను బైక్ తీసుకెళ్లకుండా అన్ని దారులు మూసేసిన విధానం బావుంది. ఎప్పుడైతే నక్షత్ర తన ఫాదర్ ని ఎందుకు సంజుని రిస్క్ లో పడేసారు అని నిలదీయడంతో …అసలు ట్విస్ట్ బయటకు వస్తుంది. ఆ బైక్ ఎవరిదో కాదు తన సంజు సొంత తాతది అని తెలియడంతో సినిమా రూపే మారిపోతుంది. ఇలా వరుస ట్విస్ట్ లతో సినిమాను ఆద్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు దర్శకులు. చక్కటి సంగీతం, సుదర్శన్ కామెడీ, సెకండాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ , మేఘాంశ్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను హాయిగా ఎక్కడా బోర్ లేకుండా చూసేయవచ్చు. యూత్ , ఫ్యామిలీ, పిలల్లు ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం `రాజ్ దూత్`.
సూటిగా చెప్పాలంటేః డోంట్ మిస్