త్వరలో వైభవంగా “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ -ఎపి” ఫిలిమ్ అవార్డ్స్
– తెలుగు రాష్ట్రాల ప్రజలే న్యాయనిర్ణేతలు
– భారీగా ఏర్పాట్లు చేస్తున్న మా – ఎపి
మా -ఎపి సర్వ సభ్యసమావేశం ఇటీవలె తెనాలిలో జరిగింది.తొలుత ఈ కార్యక్రమం లో స్వర్గీయ శ్రీమతి విజయ నిర్మల కు నివాళులు అర్పించారు .అనంతరం మా -ఎపి 2018లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మా సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్‌రాజా, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సినీ నటి కవిత తెలిపారు. ఎలాంటి జ్యూరీని నియమించకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలే న్యాయమూర్తులుగా తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ప్రజల తీర్పును కవర్లో మా ఎపి కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి-522201, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు పంపవలసిందిగా కోరారు. తమపేరు, చిరునామా, ఆధార్ కార్డులుతో ప్రజలు తమ నిర్ణయాన్ని పంపవలసిందిగా దిలీప్‌రాజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ప్రజలు జులై 1 నుంచి ఆగస్టు 15, 2019 వరకు ఎంట్రీలను పంపవచ్చని అన్నారు. ఇందులో ఎలాంటి సిఫారసులకు తావులేకుండా ప్రజలే నిజమైన తీర్పును ఇవ్వవలసిందిగా కోరారు.ప్రజా నిర్ణయాల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని మా.ఎపి ఫిలిమ్ అవార్డులకు ఎంపిక చేస్తామని తెలిపారు .
అలాగే స్వర్గీయ విజయనిర్మల స్మారక అవార్డును ప్రముఖ దర్శకులకుగాని, ప్రముఖ మహిళా నటీమణికిగాని ఇవ్వడం జరుగుతుంది.
ఈ అవార్డు ఫంక్షన్ త్వరలో తెనాలిలో వైభవంగా జరగనుందని తెలిపారు. ప్రజాతీర్పు అనంతరం తెలంగాణా, ఆంధ్ర్రపదేశ్ రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నట్లుగా దర్శకుడు దిలీప్‌రాజా, మా ఎపి అధ్యక్షులు కవిత చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులు, మా అసోసియేషన్ ప్రధానకార్యదర్శి నర్సింహరాజు, జయశీల, మా అసోసియేషన్ నిర్వహణ కమిటీ ఛైర్మన్ బాసింశెట్టివీరబాబు తదితరులు పాల్గొన్నారు.
మా-ఎపినామినేషన్లు వీరే…
ఉత్తమ చిత్రం ః భరత్ అనునేను, రంగస్థలం, గీత గోవిందం, మహానటి, అరవిందసమేత
ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంః అంతరిక్షం, నీదినాది ఒకేకథ, ఆర్ ఎక్స్ 100, కంచర్ల పాలెం.
ఉత్తమ నిర్మాతః దిల్‌రాజు, డి.దానయ్య, మైత్రిమూవీస్, అశ్వినిదత్, బన్నీవాసు.
ఉత్తమ దర్శకుడుః కొరటాలశివ(భరత్ అను నేను) సుకుమార్(రంగస్థలం) త్రివిక్రమ్‌శ్రీనివాస్(అరవిందసమేత) నాగఅశ్విన్(మహానటి) సంకల్పరెడ్డి (అంతరిక్షం) అజయ్ భూపతి (ఆర్ ఎక్స్ 100)
ఉత్తమ హీరోః మహేష్‌బాబు,(భరత్ అను నేను) రామ్‌చరణ్ (రంగస్థలం) జూనియర్ ఎన్టీఆర్ (అరవింద్ సమేత) విజయ్‌దేవరకొండ (గీతగోవిందం) వరుణ్‌తేజ్ (తొలిప్రేమ)
ఉత్తమ హీరోయిన్ః సమంత (రంగస్థలం) కీర్తిసురేష్(మహానటి) రాశిఖన్నా (తొలిప్రేమ), రష్మిక (గీత గోవిందం) పాయల్‌రాజ్‌పుత్ (ఆర్ ఎక్స్ 100)
ఉత్తమ విలన్ః జగపతిబాబు (రంగస్థలం) ప్రకాష్‌రాజ్ (భరత్ అను నేను) దుల్కర్సల్మాన్ (మహానటి) విజయవర్మ (ఎంసిఎ) ఎస్.జె.సూర్య (స్పైడర్)
ఉత్తమక్యారెక్టర్ నటుడుః ఆది పినిశెట్టి (రంగస్థలం) రాజేంద్రప్రసాద్ (శ్రీనివాస కళ్యాణం) రాకీ (ఆర్ ఎక్స్ 100) నరేష్ (శతమానం భవతి)
ఉత్తమ క్యారెక్టర్ నటిః సుహాసిని (తొలిప్రేమ), నిత్యామీనన్ (ఆర్ ఎక్స్ 100) అనసూయ(రంగస్థలం) నందిత (శ్రీనివాస కళ్యాణం)
ఉత్తమ హాస్యనటుడుః వెన్నెల కిషోర్, ప్రియదర్శి, మహేష్, రాహుల్‌రామకృష్ణ.
ఉత్తమ హాస్య నటిః విద్యులేఖారమణ్(బుజ్జమ్మ)
ఉత్తమ సంగీత దర్శకుడుః దేవిశ్రీప్రసాద్, విక్కిజెమేయర్, తమన్, గోపిసుందరం, చేతన్ భరద్వాజ్.