Brochevarevarura Pre Release Event
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న శ్రీవిష్ణు హీరోగా ‘మెంటల్ మదిలో’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రోచేవారెవరురా’. చలనమే చిత్రము.. చిత్రమే చలనము.. అనేది ట్యాగ్ లైన్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు లెటెస్ట్ సెన్సేషన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటిస్తుండగా సత్యదేవ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. ఈ సినిమా జూన్ న విడుదలవుతుంది. ఈ సందర్బంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో…
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ “`బ్రోచేవారెవరురా` టీమ్‌కి ఆల్ ది బెస్ట్. శ్రీవిష్ణుకి బెస్ట్ విషస్. సినిమా పెద్ద హిట్ కావాలి“ అని చెప్పారు.
సత్యదేవ్ మాట్లాడుతూ “శ్రీవిష్ణు కథ చేస్తున్నాడంటే నేను ఆ కథ వినక్కర్లేదనిపించింది. ఎందుకంటే ఆయన చాలా మంచి కథలను ఎంపిక చేసుకుంటారు. వివేక్ ఆత్రేయగారు చాలా మంచి డైరక్టర్. ఇన్పుట్స్, డీటైలింగ్ అన్నీ ఇస్తాడు. మన్యం ప్రొడక్షన్స్‌కి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి“ అని చెప్పారు.
ప్రియదర్శి మాట్లాడుతూ “`మల్లేశం` సినిమా చాలా బావుంది. మా సినిమాను కూడా తప్పకుండా చూడండి. ఈ నెల 28న `బ్రోచేవారెవరురా` సినిమాను తప్పకుండా చూడండి“ అని అన్నారు.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది. వివేక్ ఆత్రేయ టాలెంటెడ్ పర్సన్. మంచి కథ రాశాడు. తీశాడు. ఇందులో మేం భాగమైనందుకు ఆనందంగా ఉంది“ అని చెప్పారు.
నివేదా థామస్ మాట్లాడుతూ “ఈ సినిమాను అందరూ చూడాలి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ సినిమాను అందరూ చూడాలి. ముఖ్యంగా ఆడవాళ్లు చూడాల్సిన సినిమా ఇది. నాకు ఈ సినిమా కేవలం సినిమా మాత్రమే కాదు. అంతకు మించి“ అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ “డీఓపీ సాయిశ్రీరామ్‌గారు చాలా బాగా చేశారు. విజువల్‌గా ఈ సినిమా రిచ్‌గా ఉంటుంది. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. అనిల్-భాను డిజైనర్స్ ప్రతి పోస్టర్లోనూ డిఫరెన్స్ చూపెట్టి బజ్ క్రియేట్ చేశారు. డిఫరెంట్‌గా వాళ్లు చేసిన డిజైన్స్ చాలా బాగా యూజ్ అయ్యాయి“ అని అన్నారు.
వివేక్ సాగర్ మాట్లాడుతూ “వివేక్ ఆత్రేయ చాలా మంచి స్క్రిప్ట్ రాశారు. మేం చాలా బాగా కష్టపడ్డాం. థియేటర్లో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం“ అని చెప్పారు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ “రామ్‌గారికి, రోహిత్‌గారికి వచ్చినందుకు థాంక్స్. సురేష్‌బాబుగారికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి నేను మాట్లాడటం కన్నా సినిమా చూపిస్తే మంచిది. నా డైరక్షన్ టీమ్ చాలా బాగా చేశారు. వాళ్ల కష్టం గుర్తించాలి. వాళ్లు లేకపోతే ఈ సినిమా ఇలా కంప్లీట్ అయ్యి ఉండేది కాదు. మా నిర్మాతలకు ధన్యవాదాలు. నేను అడిగిన ప్రతిదీ ప్రతి రోజూ ఇచ్చేసేవాళ్లు. మా ఆరుగురు నటీనటులు చాలా బాగా చేశారు. మిక్స్ ఇంజనీర్ కూడా ఆ విషయాన్నే అన్నారు. మా వివేక్ కి ఎవరైనా ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే, నేను దానికి ప్రెసిడెంట్‌గా ఉంటాను. మా శ్రీరామ్‌గారు చాలా మంచి విజువల్స్ చేశారు“ అని అన్నారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ “బ్రోచేవారెవరుగా స్టోరీ వివేక్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. టైటిల్ ఏంటంటే `బ్రోచేవారెవరురా` అని అన్నారు. సరే `బ్రో` అని అనుకునేవాళ్లం. ఈ కథలో `మిత్ర` అనే పాత్ర నచ్చి ఈ సినిమా చేశాను. ఆ కేరక్టర్ ఎవరు చేస్తారా? అని ఎదురుచూశాను. దానికి భరతనాట్యం, కూచిపూడి చేయాలి. `నిన్నుకోరి`లో ఆమె డ్యాన్సులు చూశాం. ఈ సినిమాలో ఆమె డ్యాన్సులు చూసి ఈ చిత్రంలో ఎలా చేస్తారోనని అనుకున్నాం. ఆమె 20 రోజులు అరుణ మేడమ్ దగ్గర డ్యాన్సులు నేర్చుకున్నారు. పొట్టోళ్లు గట్టోళ్లు అని అంటారు కదా…అలా నివేదా చాలా కష్టపడి డ్యాన్సులు నేర్చుకుంది. ఒకరోజు నేను కిటికీ నుంచి చూశాను. ఎగిరెగిరి డ్యాన్సులు చేసింది. సత్య, నివేదా పేతురాజ్ చాలా బాగా చేశారు. సత్య కేరక్టర్లో ఇంకెవరినీ ఊహించుకోలేం. ఈ ప్రాజెక్ట్‌లో నాకు కొత్తగా పరిచయమైంది వివేక్ సాగర్. చాలా టాలెంటెడ్ వ్యక్తి. వివేక్ సాగర్ పాటలు వింటే ఇళయరాజాగారి పాటల్లా అనిపించింది. ఆయనంత టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరక్టర్ వివేక్ సాగర్. మా కెమెరామేన్ మమ్మల్ని చాలా బాగా చూపించారు. మా ప్రొడ్యూసర్లు మూడు సార్లు హైదరాబాద్ వచ్చారు. ఏం కావాలన్నా ఇచ్చేవారు. `బాగా చేయండి సార్` అంటూ ప్రోత్సహించేవారు. డైరక్షన్ డిపార్ట్ మెంట్ టీమ్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు. సినిమా మొత్తం సరదా సరదాగా పూర్తయింది. మంచి సినిమాలు తీయగానే సురేష్బాబుగారిలాంటి వాళ్లు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా హ్యాపీ. నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారికి వీరాభిమానిని. ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్‌గా చేస్తున్నాను. దానికి చాలా ఆనందంగా ఉంది. ప్రియదర్శి, రాహుల్‌తో షూటింగ్లో ఉన్నంత సేపు నవ్వుతూనే ఉంటాం. 28న మా సినిమా వస్తోంది. `బ్రోచేవారెవరురా`ను కేవలం మిత్ర అనే పాత్ర కోసం చేశాను. ప్రతి అమ్మాయీ మిత్రే. నేను కేవలం ఆడపిల్లల కోసం ఈ సినిమా చేశా. ప్రతి అమ్మాయి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. అదేంటన్నది సినిమాలో చూడండి. నవ్వులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏడుపుగొట్టు సినిమా కాదు. వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడితే నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. వివేక్ ఆత్రేయ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఏడిపించగలిగే ఏకైక మగాడు ఉన్నాడంటే ఆయన వివేక్ ఆత్రేయ“ అని అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ “బ్రోచేవారెవరురా టీమ్ చాలా బావుంది. సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ కి దగ్గర్లో టీమ్ అంతా ఆనందంగా ఉన్నారంటే, ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటాను. సురేష్‌బాబుగారికి చాలా థాంక్స్. వివేక్ సాగర్ మంచి సంగీతం ఇచ్చారు. ఈ సినిమాతో ఆయన ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. వివేక్ ఆత్రేయ నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి“ అని అన్నారు.
రామ్ మాట్లాడుతూ “సినిమా రిలీజైన తర్వాత తెలుస్తుంది.. చిన్న సినిమా చేశామో, పెద్ద సినిమా చేశామో. నేను మెంటల్ మదిలో సినిమా చూశాను. వివేక్ చాలా బాగా చేశాడు. ఇలాంటి మంచి డైరక్టర్‌కి మంచి స్టార్ కేస్ట్ దొరికింది. `నిన్నుకోరి`లో ఫస్ట్ షాట్ చూసిన తర్వాత నివేదా మంచి పెర్ఫార్మర్ అని తెలిసింది. నేను దర్శితో `ఉన్నది ఒక్కటే జిందగీ` చేశా. తర్వాత కూడా చాలా సార్లు అనుకున్నా. కానీ ఇంకా కుదరలేదు. రాహుల్ రామకృష్ణతో నాకు పెద్ద పరిచయం లేదు. కానీ కొన్ని కేరక్టర్లు వింటుంటే ఆయనే గుర్తుకొస్తున్నారు. సత్య చాలా ఇన్టెన్స్ పెర్ఫార్మర్. సత్య కళ్లల్లో కనిపిస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌లో సత్య చాలా మంచి పాత్ర చేశారు. వివేక్ మ్యూజిక్ బావుంటుంది. నా ఫేవరేట్ లిరిసిస్ట్ రామజోగయ్యశాస్త్రి. ఎందుకంటే ప్రేమంట సినిమాలో నాకు తదుపరి జన్మకైనా… పాట రాశారు. శ్రీవిష్ణుని ఫస్ట్ టైమ్ నేను ఉన్నది ఒక్కటే జిందగీ టైమ్‌లో కలిశా. ఆ సినిమాలో నా పెర్ఫార్మెన్స్ లో సగం క్రెడిట్ శ్రీవిష్ణుదే. చాలా మంచి పెర్ఫార్మెర్అతను. ఈ నెల 28న విడుదలవుతుంది ఈ సినిమా. నాకు అరుణభిక్షుగారు యాక్టింగ్ నేర్పించారు. ఆవిడ ఈ చిత్రానికి పనిచేయ
డం ఆనందంగా ఉంది“ అని అన్నారు.