EK MOVIE REVIEW Rating 3/5
చిత్రం : ఏక్ మూవీ
నటీనటులు : బిష్ణు అధికారి , అపర్ణ శర్మ , హిమాన్షి ఖురానా
సంగీతం : మంత్ర ఆనంద్ ,
నిర్మాత : హరి ,
దర్శకత్వం : సంపత్ రుద్రారపు ,
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 14 జూన్ 2019
టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింగా తెరకెక్కింది `ఏక్` చిత్రం. బిష్ణు అధికారి, అపర్ణ శర్మ హీరో హీరోయిన్లుగా సుమన్ ఇంపార్టెంట్ పాత్రలో నటించాడు. ట్రైలర్, పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి థియేటర్స్ లో ప్రేక్షకులను ఈ చిత్రం ఏ విధంగా అలరిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
స్టోరి విషయానికొస్తే…
ఇంటిలిజెంట్ విద్యార్థి అయిన సిద్ధు (బిష్ణు అధికారి) , అపర్ణ శర్మ ని లవ్ చేస్తుంటాడు. ఆమె కూడా సిద్ధు ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడిలో అపర్ణ శర్మ చనిపోతుంది. దీంతో రగిలిపోయిన హీరో ఉగ్రవాదులను మట్టు పెట్టెలాని కంకణం కట్టుకుంటాడు హీరో సిద్ధు. ఈ నేపథ్యంలో ఏ మార్గంలో సిద్ధు ఉగ్రవాదులను అంతం చేసాడు? తన పంతం నెరవేర్చుకున్నాడా? దేశం కోసం ఎలాంటి త్యాగం చేసాడు అన్నది స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిందే.
పాజిటివ్ పాయింట్స్ః
స్టోరి
హీరో యాక్టింగ్
డైరక్షన్, స్క్రీన్ ప్లే
నిర్మాణ విలువలు
మెసేజ్
మైనస్ పాయింట్స్
ఎడిటింగ్
సెకండాఫ్ లో కొన్ని లెంగ్తీ సీన్స్
నటీనటుల పనితీరుః
దేశభక్తి తన నరనరాన నింపుకుని దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతూ…ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపే పాత్రలో అద్బుతంగా రాణించాడు హీరో భిష్ణు అధికారి. తన నటనతో ఫిజిక్ తో తెరపై మ్యాజిక్ చేసాడు. ఇక అందం, అభనయం గలో పాత్రలో అపర్ణ శర్మ రాణించింది. అందాల ఒలకపోస్తూ హిమాన్షి ఖురానా కుర్రకారుకు వెర్రిత్తించే పాత్రలో నటించింది. సుమన్ ఎప్పటిలాగే తన పాత్రకు జెస్టిఫై చేసారు. బెనర్జీ, శ్రవణ్‌చ 30 ఇయర్స్ పృథ్తీ పాత్రలు సినిమాకు కీలకం.
సాంకేతిక నిపుణుల పనితీరుః
సినిమాకు మెయిన్ ఎస్సెట్ మంత్ర ఆనంద్ సంగీం. అలాగే విజువల్స్ కూడా ఆకట్టుకునేలా బావున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా, ఏ విషయంలో రాజీ పడకుండా నిర్మాతలు సినిమాను క్వాలిటీతో నిర్మించారు. ఇక దర్శకుడు సంపత్ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అంశానికి కమర్షియల్ అంశాలు జోడించి ఒక చక్కటి సందేశాత్మక చిత్రంగా మలిచారు అనడంలో సందేహం లేదు. ఇందులో ప్రతి పాయింట్ యూత్ ని ఆలోచింపజేసేలా ఉంది.
ప్రస్తుతం హర్రర్ సినిమాలు, అడల్ట్ కంటెంట్ తో సినిమాలు వస్తూ బోర్ కొట్టించాయి. ఇలాంటి తరునంలో ఒక జెన్యూన్ కాన్సెప్ట్ తో జెన్యూన్ గా కథని నమ్మి అద్భుతమైన ఆర్టిస్ట్ లను, సాంకేతిక నిపుణులను తీసుకుని ప్రతి ఒక్కరూ చూసే విధంగా `ఏక్ ` చిత్ర నిర్మించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిత్రాల అవసరం చాలా ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఫిలిం. గో అండ్ వాచ్.
ఫైనల్ గాః చూడాల్సిన సినిమా ఏక్