“Lots Of Love” Movie Review
విభిన్న కథనాల సమ్మేళనం Lots Of Love!!
ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. వైవిధ్యమైన కథ.. చక్కటి కథనంతో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకొని.. ప్రేక్షకులనే థియేటర్ల వైపు నడిపిస్తుస్తున్నాయి. కొత్త దర్శకులు కొత్త స్టోరీలతో సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు. లవ్ సబ్టెక్ట్తో వచ్చిన ఎన్నో చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో మైళురాళ్లుగా నిలిచిపోయాయి. అలాంటి ప్రేమ కథనంతో వచ్చిన `లాట్స్ ఆఫ్ లవ్` చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం…
కథః ప్రజలకు మంచి చేయాలనుకునే డాక్టర్.. ప్రేమించిన అమ్మయి ప్రేమను ఒప్పకోని పెద్దలు.. ఉద్యోగం సంపాధించి.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లీ చేసుకోవాలనుకునే ఒక ఉద్యోగి.. ప్రపంచం గురించి భోదించే గురూజీ.. ఎవరిక ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే ఎన్జీవో.. పొగరుబోతు జమీందారు కొడుకు.. ఆయన కొడుకు చేసే అరాచకాలు.. ఇలా విభిన్న కథనాల సమ్మెళం `లాట్స్ ఆఫ్ లవ్`.
కరోనా గురించి అందరికీ తెలిసిందే.. కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆస్ప్రతుల్లో, బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, మందులు దొరకక జనాలు ఇబ్బందులు పడుతుంటే… ఆ దృశ్యాలను చూని డాక్టర్ మనోహర్ (విశ్వానంద్ పటార్) ప్రజలకు ఏమైనా చేయాలని అనుకుంటాడు. కానీ ఆ డాక్టర్ వద్ద డబ్బు ఉండదు. నామమాత్రపు ఫీజుతో చికిత్స చేస్తూ.. జనాలకు సేవ చేసే మనోహర్ అప్పులలో కూరుకుపోతాడు. మరి అతని తపన ఎలా తీరింది? అతనికి, స్కూల్ టీచర్ సరిత (ఆద్య)కు మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్లింది?.
కాలేజ్‌కి వెళ్లే కుర్రాడు రాకేష్ (నిహాంత్).. తనతో కలసి బస్సులో ప్రయాణం చేసే మనోజ(దివ్య)కు మధ్య ప్రేమా ఎలా చిగురించింది.. రాకేష్‌ను దివ్య ప్రేమించిందా… ప్రేమిస్తే.. ఆ తర్వాత ఏం జరిగింది..?
ప్రస్తుత ప్రపంచ తీరు గురించి, దేవుడి గురించి తత్వం బోధించే స్వామిజీ (కిరణ్)కి, ఎవరు కష్టంలో ఉన్నా.. నేనున్నానంటూ చేయూతనందించే ఎన్జిఓ సంయుక్త (మాధవి)కి ఉన్న సంబంధం ఏమిటి?
ఒక అనాథ అయిన రాజు (రాజేష్) ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాధించి.. తను ఉద్యోగం పొందడానికి సహకరించిన అమ్మయి రజిని (భావన)ను ప్రేమించి.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ రజినీ కుటుంబ సభ్యులు రాజు అనాథ అని పెళ్లికి ఒప్పుకోరు. మరి వారి పెళ్లి ఎలా జరిగింది? .. ఇంతకి రాజు అనాథ అవ్వడానికి కారణం ఏమిటి..?
పొగరబోతు జమీందారు యాదగిరి (తెనాలి పంతులు).. పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి… డబ్బుతో, రౌడీయిజంతో.. అతని కొడుకులు చేసే అరాచకం… యాదగిరి ఆయన కొడుకులను సరిగా పెంచకపోవడంతో వారు చేసే అరాచకాలు… అనర్థాలు… ఏమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: హీరో విశ్వానంద్ పటార్ హీరోగా నటిస్తూ ఈ సినిమాకి కథ, స్రీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలన్నింటినీ ఈ చిత్రఒక్కడే నిర్వర్తించడం అనేది చాలా గొప్ప విషయం. సినిమాకు సంబంధించి క్యాస్టింగ్‌ని సమకూర్చుకున్న తీరు, సినిమాలోని వివిధ పాత్రలను తెరకెక్కించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. జమీందారు ఫ్యామిలీకి పై కథలను లింక్ చేసిన విధానం, చివరికి ఆ జమీందార్ మారిపోయిన విధానంతో ఒక మంచి మెసేజ్‌ను కూడా ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. నేటి ప్రపంచంలో జరుగుతున్నదే. సాటి వారికి సాయం చేయని వాడు, దేవుడిని కూడా లెక్క చేయకుండా ధూషించేవాడు.. చివరికి అన్నీ పోగొట్టుకుంటాడనే మెసేజ్.. డబ్బున్న ధనవంతులకు ఇచ్చినట్లుగా ఉంది. స్వామిజీతో చెప్పించిన ‘పైకి ఎన్ని కారణాలు ఉన్నా.. చివరికి గమ్యస్థానం చేరుకోవడమే ముఖ్యం. మన జీవితంలో ఎప్పుడూ మన గమ్యాన్ని, గమ్యస్థానాన్ని గుర్తించుకుంటూనే ఉండాలి’, ‘వృత్తి ధర్మంతో పాటు స్వధర్మం కూడా పాటించాలి’, ‘యవ్వనం వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉండి.. వారి అభిప్రాయాల్సి మన్నించాలి. అప్పుడే పిల్లలు గౌరవిస్తారు. వారిని లాలించాలి తప్ప.. శాసించకూడదు’ వంటి డైలాగులు ఆలోచనను రేకెత్తిస్తాయి. అలాగే డాక్టర్‌గా మనోహర్ ‘విద్య, వైద్యం సరైన దిశలో అందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకు టీచర్, డాక్టర్ మార్గదర్శనం చేయాలి’ అంటూ సమాజం బాగుండాలంటే ఏం చేయాలో చెప్పిన తీరు.. ‘సెల్ఫ్ లవ్, ఫ్యామిలీ లవ్, రొమాంటిక్ లవ్, ఫ్రెండ్షిప్ లవ్, డివైన్ లవ్, ప్రొఫెషనల్ లవ్’ అంటూ.. వాటి అర్థాన్ని వివరించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా మెడికల్ మాఫియా బయట ఎలా ఉందో కూడా ఈ సినిమాలో చూపించారు. ఇంకా జమీందార్ యాదగిరి మారిన తీరు కూడా ఒక గుణపాఠంలా అనిపిస్తుంది. అయితే అక్కడక్కడా లాజిక్ లేని కొన్ని సీన్లు, ఫస్టాఫ్‌లో కథ నడిచిన విధానం, అలాగే నటీనటులంతా కొత్తవారు కావడం కూడా.. ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్కి గురి చేస్తాయి. ఎమోషన్స్ పండించే సీన్లను ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించాల్సింది.
నటీనటుల పనితీరు:
విశ్వానంద్ పటార్ హీరోగా మరియు దర్శకుడిగా అదరిని ఆకట్టుకున్నాడు. కరోనా రోగులకు సేవ చేయాలనే తపన కలిగిన డాక్టర్‌గా, తల్లి కోరికను తీర్చాలనుకునే కొడుకుగా, ప్రేమికుడిగా.. ఇలా వైవిధ్యభరితంగా ఉండే మనోహర్ పాత్రలో విశ్వానంద్ ఆకట్టుకుంటాడు. ఆయన ప్రియురాలిగా చేసిన సరిత.. కాలేజ్ స్టూడెంట్స్‌గా చేసిన నిహాంత్, దివ్య.. అనాథగా చేసిన రాజేష్, అతనికి సపోర్ట్‌గా చేసిన భావన వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. వీరితో పాటు ఎన్జీవోగా చేసిన మాధవి, స్వామిజీ పాత్రలో కిరణ్ హుందాగా కనిపించారు. ఇక విలన్‌గా జమీందార్ పాత్రలో చేసిన తెనాలి పంతులు, ఆయన కొడుకులుగా చేసిన ప్రవీణ్, శ్రీను, రాఘవేంద్రలు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. మంచి పాత్రలు పడితే.. విలన్లుగా వారు కొంతకాలం అలరించే అవకాశం ఉంది. ఇంకా మిగతా పాత్రలలో నటించిన వారు కూడా ఓకే. సాంకేతికంగా.. సినిమాకు తగినట్లుగా సంగీతం, ఎడిటింగ్, కెమెరా వర్క్ ఉంది. డైలాగ్స్ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. రెండు పాటలు బాగున్నాయి. దర్శకుడు విశ్వానంద్ పటార్.. ఆయన నటించడమే కాకుండా.. భారీ తారాగణంతో.. ఓ నాలుగైదు కథలను మిక్స్ చేసి.. అందులోనూ ఓ మెసేజ్‌ని చొప్పించి.. తన మల్టీ టాలెంట్‌ను ప్రదర్శించాడు. ఓవరాల్‌గా అయితే.. ప్రేమ పేరుతో ఓ మంచి మెసేజ్ అయితే ఈ చిత్రం ప్రేక్షకులకు ఇస్తుంది. తప్పకుండా చూడాల్సిన చిత్రం.
రేటింగ్ః 3/5