గురి తప్పని బరి మూవీ రివ్యూ!!రేటింగ్: 3 .25/ 5
`బరి` మూవీ రివ్యూ!!
నటీనటులుః రాజు, సహాన
సాంకేతిక నిపుణులుః సంగీతంః మహవీర్
సినిమాటోగ్రఫీః వారి అనిల్ కుమార్ రెడ్డి
ఎడిటర్ః శ్రీకృష్ణ అత్తలూరి
కొరియోగ్రఫీః బాల నరసింహా
రచన సహకారంః వేణు కె నాని, వెంకట్ చల్లగుండ్ల
పీఆర్వోః చందు రమేష్
నిర్మాతలుః మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ
కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వంః సురేష్ రెడ్డి.
`బరి ` చిత్రం టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్, టీజర్ , ట్రైలర్, సాంగ్స్ తో విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకుంది. కోడిపందేల నేపథ్యంలో వచ్చిన ప్రతి సినిమా తెలుగులో ఇప్పటి వరకు సక్సెస్ సాధించిందే. ఆ కోవలో వచ్చిన బరి చిత్రం ఈ నెల 8న విడదులైంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
స్టోరి విషయానికొస్తే…
గ్రామీణ కథ ఇది. కోడి పందెల చుట్టు కీలక పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఆ గ్రామంలో ఉండే ఓ యువకునికి కోడిపందేల పిచ్చి. ఆ విషయంలో ఇంట్లో వాళ్లు అతడ్ని తిడుతుంటారు. ఒక రోజు అనుకోకుండా అతని దగ్గరికి ఒక పుంజు వస్తుంది. దాని విలువ ఐదు లక్షల రూపాయలు. అదృష్టం వచ్చిందని అనుకుంటుండగానే, హఠత్తుగా ఆ పుంజు మిస్ అవుతుంది. ఇక అతని ఫ్యామిలీకి సమస్యలు మొదలవుతాయి. అతని చెల్లి మ్యారేజ్ రిస్క్‌లో పడుతుంది. మరి ఆ పుంజు దొరుకుతుందా? అతని ఫ్యామిలీ సమస్యలు ఎలా తీరాయి? అన్నది చిత్ర కథాంశం.
నటీనటులు ఫర్మార్మెన్స్:
ఇందులో నటించిన రాజు, సహాన ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్నవారిలా నటించారు. హీరో రాజు ఫస్ట్ మూవీ అనే ఫీలింగ్ ఎక్కడా రాకుండా చాలా బాగా పర్మార్మెన్స్ ఇచ్చాడు. ఇక హీరోయిన్ సహాన తులసి అనే పాత్రలో నటించి మెప్పించింది. నటుడు నాగమహేష్ కోడికత్తి శీను పాత్రలో నటించాడు. నెగిటివ్ రోల్లో కనిపిస్తాడు. ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
ఈ సినిమా కోసం టెక్నికల్‌గా హైస్టాండెడ్లో ఉంది. ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారని అర్థమవుతుంది. ఇందులో 4 పాటలున్నాయి. మహవీర్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక అనిల్ కుమార్ రెడ్డి సినిమాటోగ్రఫీకి ఫుల్ మార్కులు వేయవచ్చు. శ్రీకృష్ణ అత్తలూరి చేసిన ఎడిటింగ్ పర్వాలేదు. బాల నరసింహా కొరియోగ్రఫీ బాగుంది. దర్శకుడు సురేష్ రెడ్డికి ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా సినిమా తీసే ప్రయత్నం చేశాడు. నిర్మాతలు మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ రాజీ పడకుండా సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టారు.
విశ్లేషణలోకి వెళితే…
బరి అనే టైటిల్‌తోనే సినిమా ఎంత ఫవర్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టైటిల్‌కు తగ్గట్టే సినిమా కథనం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాలో పలు సీన్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. గ్రామీణ నేపథ్యంలో కోడి పుంజులు, కోడి పందేలు ప్రధానాశంగా ఇంతకు ముందెప్పుడూ తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి కథాంశంతో సినిమా రాలేదు. మొట్టమొదటి సారిగా అచ్చతెలుగు పల్లెటూరి లోకెషన్లలో డైరెక్టర్ సురేష్ రెడ్డి తెరకెక్కించిన విధానం సూపర్ అనే చెప్పాలి. షూటింగ్ జరిపిన రేపల్లె, బాపట్ల, తెనాలి ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రతి పాత్రను ఎంతో సహజంగా చిత్రీకరించారు. ప్రతి ప్రేమ్‌లో దర్శకుడి హార్డ్ వర్క్ కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని చెప్పొచ్చు. ఈ వారం ఫ్యామిలీ అంతా వెళ్లి హ్యాపీగా చూసే సినిమా బరి. సో డోంట్ మిస్ …గో అండ్ వాచ్.
సూటిగా చెప్పాలంటేః గురి తప్పని బరి
రేటింగ్: 3 .25/ 5