STOPWATCH movie review rating 3.25/5

STOPWATCH  movie review rating 3.25/5

 

`స్టాప్ వాచ్` మూవీ రివ్యూ !!

 

`స్టాప్ వాచ్` మూవీ రివ్యూ !!

న‌టీన‌టులుః
స్వ‌ర్ణ‌కాంత్ , జై చంద్ర‌, రేఖా నిరోష

సాంకేతిక నిపుణులుః
డైరెక్ట‌ర్ః భ‌ర‌త్ వ‌ర్మ కాక‌ర్ల‌పూడి
నిర్మాణంః మారుతి ల‌క్ష్మ‌ణ్‌
రైట‌ర్ః నాగార్జున మాన‌పాక‌
డిఓపిః ఏసు
ఎడిట‌ర్ః ప్రేమ్ కుమార్ ఇ
సౌండ్ డిజైన్ః సురేష్ సోమి రెడ్డి

Rating:3.25/5

ఇటీవ‌ల కాలంలో స‌స్పెన్స్ , థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ కోవ‌లో మ‌రో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘స్టాప్ వాచ్’ చిత్రం ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌లైంది. మారుతి లక్ష్మణ్ నిర్మాణంలో భరత్ వర్మ కాకర్లపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ పోస్ట‌ర్, టీజ‌ర్, ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకుంంది. ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈచిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు మెప్పిస్తుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

స్టోరి విష‌యంలోకి వెళితే…
జై చంద్ర ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అతని భార్య (హారిక) రహస్యంగా తప్పిపోతుంది. ఆ కుటుంబం యోగి అనే న్యాయవాదిని నియ‌మించుకుంటుంది. జైని అనుమానించేలా ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఆధారాలు ల‌భిస్తాయి. నిజాన్ని విప్పేందుకు జైని విచారిస్తారు. ఈ క్ర‌మంలో యోగి లోతుగా విచారించే స‌మ‌యంలో అనేక ట్విస్టులు బ‌య‌ట‌ప‌డ‌తాయి. ఇంత‌కీ హారిక రహస్యంగా తప్పిపోవ‌డం వెనుక కార‌ణం ఎవ‌రు? అస‌లేం జ‌రిగింది? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

న‌టీన‌టుల హావ‌భావాలుః
న‌టీన‌టుల ప‌ర్మామెన్స్ విషయానికి వ‌స్తే… యోగి పాత్రలో స్వర్ణకాంత్ న‌టించాడు. సినిమాకు ప్ర‌ధాన‌మైన అడ్వ‌కేట్ పాత్ర‌లో ప‌ర్‌ఫెక్టుగా సూట‌య్యాడు. ఇక జై విశ్వనాథ్‌గా జై చంద్ర న‌టించాడు. బిజినెస్‌మెన్‌గా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. ఇక అతని భార్య‌ హారికగా రేఖ నిరోషా న‌టించింది. ఈమె న‌ట‌న కూడా బాగుంది. ఈ సినిమాకు ఇవే మూడు ప్ర‌ధాన పాత్ర‌ల‌ని చెప్పుకొవ‌చ్చు. న‌టీన‌టులు అంతా కొత్త వాళ్లే క‌నిపిస్తారు. అయినా త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు అన‌డంలో సందేహం లేదు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
ఈ థ్రిల్ల‌ర్ స్టోరీని తెర‌కెక్కించ‌డంలో డైరెక్ట‌ర్ భరత్ వర్మ కాకర్లపూడికి మంచి ప‌ట్టు సాధించాడ‌నే చెప్పొచ్చు. స‌స్పెన్స్‌ను లాగ‌డంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. ఈ స‌బ్జెక్టును నీట్‌గా రూపొందించ‌డంలో ఆయ‌న శైలి ఆక‌ట్టుకుంది. ఇక ఫోటోగ్ర‌ఫి విష‌యంలో యేసు త‌న టాలెంట్ చూపించాడు. ఇలాంటి థ్రిల్ల‌ర్ స్టోరీల‌ను ఎలా చూపించాలో ఆయ‌న‌కు ప‌ట్టు ఉంద‌నే విష‌యం రుజువు చేశాడు. ఇక ప్రేమ్ కుమార్ చేసిన‌ ఎడిటింగ్ ప‌ర‌వాలేదనిపిస్తుంది. అజయ్ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా చెప్పుకొవ‌చ్చు. హాలీవుడ్ రేంజ్ లుక్ అద్దిన‌ ఈ సినిమాకు నిర్మాత ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌నే చెప్పాలి.

విశ్లేష‌ణః
ఎక్క‌డా పెద్ద‌గా బోర్ కొట్ట‌కుండా ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అనేక ట్విస్టుల‌తో ముందుకు సాగుతుంది. చాలాకాలం త‌ర్వాత థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో వ‌చ్చిన‌ ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి రెస్పాన్స్ అందుకుంటుంద‌ని చెప్పొచ్చు. ఫైన‌ల్‌గా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కోరుకునే ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఖ‌చ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో డోంట్ మిస్ దిస్ మూవీ. గో అండ్ వాచ్.