“Game Over” Movie Releasing in 1200 Screens

“Game Over” Movie Releasing in 1200 Screens

Game Over” Releasing in 1200 Screens Worldwide in Telugu, Tamil & Hindi on June 14 2019

Hyderabad, 5 June 2019 : Renowned production house YNOT Studios’ latest upcoming feature film – a Telugu-Tamil bilingual genre-bending thriller starring Taapsee Pannu. The film is directed by Ashwin Saravanan and produced by S.Sashikanth of YNOT Studios. Prolific Director Anurag Kashyap joins YNOT Studios in presenting the Hindi version of the Telugu-Tamil bi-lingual film.

Says producers S.Sashikanth & Chakravarthy Ramachandra – “We are very glad to announce that ‘Game Over’ will release in almost 1200 screens worldwide, in 3 languages – Telugu, Tamil & Hindi. This is exactly the sort of appeal this film deserves, because of its concept and novelty. Director Ashwin Saravanan has really pushed the boundaries and made a very exciting film, and Taapsee’s performance will connect with audiences worldwide no matter what language they are watching this film in. We are also glad to see the overwhelming response for the Teaser & Trailer from many celebrities and fans across the world. Taapsee will be soon meeting the Telugu Press & Media as part of our extensive promotional activity across different cities for the different languages.”.

Director: Ashwin Saravanan

Producer: S. Sashikanth

Co-producer: Chakravarthy Ramachandra

Writers : Ashwin Saravanan & Kaavya Ramkumar

Dialogue : Venkatesh Kacharla

DOP : A Vasanth

Art Director : Siva Shankar

Costume Designer : Nandini NK

Stunts : ‘Real’ Satish

Music Director : Ron Ethan Yohann

Editor : Richard Kevin

Sound Designer : Sachin Sudhakaran, Hari Haran (Sync Cinema)

Atmos Mix : M R Rajakrishnan

Still Photographer : M S Anandan

Publicity Designer : Gopi Prasannaa

PRO : Lakshmi Venugopal

Line Producer : Muthuramalingam

Production Executives : Rangaraj, Prasad Somula Reddy

 

ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో తెలుగు,తమిళం,హిందీ భాషలలో ఏక కాలంలో జూన్ 14 న విడుదలవుతున్న ‘తాప్సి’ కథానాయికగా‘గేమ్ ఓవర్’ 
  
‘గేమ్ ఓవర్’ 
ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో 
గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో తెలుగు,తమిళం,హిందీ భాషలలో ఏక కాలంలో జూన్ 14 న విడుదల అవుతోందని చిత్ర నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు. ఇంతకు ముందు విడుదల అయిన చిత్రం టీజర్, కొద్దిరోజుల క్రితం విడుదల అయిన ‘గేమ్ ఓవర్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. మూడు భాషల్లో ని  నటీనటులు, రచయితలు, దర్శకులు చిత్ర ప్రముఖులు ‘గేమ్ ఓవర్’ ట్రైలర్ ను చూసి ప్రశంశలతో ట్వీట్స్ చేయటంతో   ప్రేక్షకులలో ఈ చిత్రం పై అంచనాలు  మరింతగా పెరిగాయి.. ప్రముఖ బాలీవుడ్  రచయిత, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాని కి హిందీలో సమర్పకుడుగా వ్యవహరిస్తూ ఉండటం మరో విశేషం..తాప్సి ప్రధాన పాత్రలో , ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కధాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం. వెన్నులో వణుకు పుట్టించే కథ, కధనాలు ఈ థ్రిల్లర్ మూవీ సొంతం. సినిమా ప్రోమోషన్ లో భాగంగా త్వరలో నాయిక తాప్సి  తెలుగు మీడియాను కలువనున్నారు. తమ సంస్థ  గతంలో నిర్మించిన ‘లవ్ ఫెయిల్యూర్’,‘గురు’ చిత్రాల విజయాల సరసన ఈ ‘గేమ్ ఓవర్’  నిలుస్తుందని అన్నారు నిర్మాత ఎస్.శశికాంత్.  
కథానాయిక ‘తాప్సి’ మాట్లాడుతూ..’గేమ్ ఓవర్’ ప్రేక్షకులకు ఓ సరికొత్త ధ్రిల్లింగ్ ను కలిగిస్తుందని తెలిపారు.దీనికి కారణం దర్శకుడు అశ్విన్ శరవణన్ చిత్ర కథను తెరకెక్కించిన తీరు. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాల సమాహారం అలాగే చిత్ర నేపధ్య సంగీతం కూడా అని తెలిపారు. 
  
ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివశంకర్ , కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: ‘రియల్’ సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పి.ఆర్.ఓ. లక్ష్మి వేణుగోపాల్, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్:  కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్. 
ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్: రంగరాజ్, ప్రసాద్ సోములరెడ్డి.
లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం
 
సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర 
నిర్మాత: ఎస్.శశికాంత్ 

దర్శకత్వం: అశ్విన్ శరవణన్