‘జీ 5’లో ఈ 26న విడుద‌లవుతున్న ‘రిప‌బ్లిక్‌’ !!

‘జీ 5’లో ఈ 26న విడుద‌లవుతున్న ‘రిప‌బ్లిక్‌’ !!

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్‌టైమ్‌… డైరెక్ట‌ర్ కామెంటరీతో ‘జీ 5’లో ఈ 26న విడుద‌లవుతున్న ‘రిప‌బ్లిక్‌’
 
వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే ఓటీటీ వేదిక ‘జీ 5’. వినోదం పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం ఇస్తూ ఉంది. ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలో మరో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. డైరెక్టర్ కామెంటరీతో ‘రిపబ్లిక్’ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది. దేశంలో ఈ విధంగా విడుదల చేస్తున్న తొలి ఓటీటీ వేదిక ‘జీ 5’, తొలి సినిమా ‘రిపబ్లిక్’ కావడం విశేషం.
 
వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు… ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక ‘జీ 5’. ఒక్క తెలుగులో మాత్రమే కాదు… హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. తెలుగులో గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. థియేటర్లలో ఘన విజయాలు సాధించిన ‘రాజ రాజ చోర’ను విజయదశమికి, ‘శ్రీదేవి సోడా సెంటర్’ను దీపావళికి విడుదల చేసింది. ఇటీవల ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అంతకు ముందు ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ విడుదల చేసింది. ఈ నెల 26న ‘రిపబ్లిక్’ సినిమాను విడుదల చేయనుంది. 
 
సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘రిపబ్లిక్’. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో!
 
సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే… తాను ఏ కోణంలో సదరు సన్నివేశం, సినిమా తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపిస్తే? అటువంటి ప్రయత్నానికి ‘జీ 5’, దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. సినిమా ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్… ముగ్గురితో ‘రిపబ్లిక్’ విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు. ఈ నెల 26 నుంచి ‘జీ 5’ ఓటీటీ వేదికలో ‘రిపబ్లిక్’ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
 
‘Republic’ to stream on ZEE5 from November 26
 
First time in the history of Indian cinema, the director’s commentary to stream along with ‘REPUBLIC’ movie

Hyderabad, 22 November, 2021: ZEE5 has been one streaming platform working constantly to offer new entertainment to its patrons. The popular streaming platform has now heralded a novel idea for the first time in the history of Indian cinema. The OTT streaming of the Telugu film ‘Republic’ will arrive with an incisive commentary by director Deva Katta. ZEE5 is the first OTT platform in the country to do such a thing, while ‘Republic’ is the first film to be coming out with such a commentary.

ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases. It has been dishing out content for the entertainment of worldwide viewership in various languages: from Hindi to Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali to Gujarati. ZEE5 is just a click away on a mobile, tablet, desktop, laptop — be it in a lockdown or otherwise. From last year’s ‘Amrutha Ramam’, ’47 Days’ and ‘Meka Suri’ to this year’s ‘Battala Ramaswamy Biopic, ‘NET’ and the most recent ‘Alanti Sitralu’, ZEE5 has given us a number of direct-to-digital releases. ‘Raja Raja Chora’ was released for Dasara, while ‘Sridevi Soda Center’ was released for Diwali on ZEE5. Recently, the original web series ‘Oka Chinna Family Story’ was out, while ‘Heads And Tales’ was another recent release on ZEE5. On November 26, ‘Republic’ will start streaming.

‘Republic’ stars Sai Tej as the hero. Directed by Deva Katta, it is produced jointly by JB Entertainments and Zee Studios. The film explores the role of government officials, the political executive, and the people in a democratic system. Besides film critics, ‘Republic’ was described as inspiring by the common audience and film personalities. The film will now be streamed on ZEE5 from November 26 with Deva Katta’s commentary.

Usually, the audience watch a movie and the scenes in a film are critiqued by reviewers. How about the director of the movie himself explaining his point of view and how he conceived a particular scene? ZEE5 and director Deva Katta have come out with the commentary keeping this in mind. Deva Katta explains his screenplay in a freewheeling conversation with Editor Praveen KL, screenplay-writer Kiran and Creative Producer Satish BKR. They talk about the visual timeline of ‘Republic’ in a detailed manner. When the film starts streaming, the audience can choose the option to watch the movie along with the director’s insightful commentary. They can alternatively watch the movie without the commentary. 

 
For the first time in Indian Cinema #ZEE5 introduces Director’s commentary.
#WatchRepublicWithDevaKatta #Premieres26thNov exclusively on @ZEE5Telugu.