Seven’ will be a visual feast of sorts: Nizar Shafi
Nizar Shafi’s debut film as director is ‘Seven’, which is releasing on June 5 in both Telugu and Tamil. In this interview, the cinematographer-turned-director talks about the biggest strengths of ‘Seven’, what the audience can expect from it and more.
Starring Havish, Rehman, Regina Cassandra, Anisha Ambrose, Pujitha Ponnada, Aditi Arya, Nandita Swetha and Tridha Choudhary, the film has music by Chaitan Bharadwaj and cinematography by Shafi himself.
Take us through your background and when the idea of turning a director sprouted in your mind.
Even during my days at a film institute in Chennai, I did have the wish. When I came across the storyline of ‘Seven’, I was thoroughly impressed with it. The offer to do direction came to me suddenly. I didn’t want to lose the opportunity. I have been associated with the Telugu film industry right since ‘Bhale Bhale Mogadivoy’. Director Maruthi garu contacted me for the movie after he watched a 2012 Tamil film of mine. I was doing ‘Sailaja Reddy Alludu’ during the making of ‘Seven’. For many days, I had to work in two shifts on these movies. I was busy travelling between Chennai and Hyderabad and couldn’t even get time to sleep. Even though I was brought up in Chennai, language has never been a difficulty for me while doing Telugu movies.
‘Seven’ has been touted as a romantic thriller. What are its biggest highlights in your opinion?
It’s a romantic thriller that is also a visual treat. The night-effect shots will be a highlight. Since this one is a thriller, there was always a lot of chance to explore through cinematography.
A major strength of the film is the story itself. Once producer Ramesh Varma garu gave me his storyline, a team, including me, developed it into a full-fledged story. Once he gave the storyline, he didn’t interfere. It became my product. ‘Seven’ is an investigative thriller, too. Rehman has played an ACP through whose perspective the story starts unfolding. We are releasing the film simultaneously in both Telugu and Tamil.
You have been a technician. As an experienced cinematographer, what did you bring to the table as a debutant director?
Since I have been a cinematographer, I have hands-on experience with shot visualization. Shot division became easy while doing ‘Seven’. Moreover, since I am both its director and cinematographer, nothing was lost in communication. I knew what I was visualizing and what I was getting. There would be no mismatch.
There are not two or three but six heroines here. And romantic scenes aplenty. Tell us about the difficulties involved in terms of writing and execution.
Everything was clearly written in the pre-production stage. A new heroine enters the screen every 20 minutes. Each of the girls is important and relevant to the story. Everybody of us is totally happy with the output.
Yes, there are many lip-locks and they are a part of the love scenes in the movie. It was my plan to have such moments. Six girls plus the hero (Havish) make it seven. These are the seven characters from the eyes of Rehman, who is the ACP investigating a crime.
Chaitan Bharadwaj’s music has been praised by Havish. Three songs are going to be a part of the movie. Can you tell us about the BGM?
Apart from being a visual treat, ‘Seven’ has also got excellent background music. You know, when it comes to thrillers, BGM plays a very crucial role.
Now that you are a director, what will happen to your cinematography career? What are your immediate plans on the filmmaking front?
I have committed myself to do cinematography for a few projects. Even though I have turned a director, I don’t see any issues with me continuing to do cinematography. There won’t be any ego clashes with any director because I always have healthy creative discussions with my directors.
As for direction, I have 2-3 ideas in mind. One of them is a love story. Another one is a thriller. As a director, I also love horrors.
————————————————–
‘సెవెన్’ ఒక విజువల్ ట్రీట్: నిజార్ షఫీ ఇంటర్వ్యూ
తెలుగులో ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’తో సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ పేరు తెచ్చుకున్నారు. ఆయన ‘సెవెన్’తో దర్శకుడిగా మారుతున్నారు. హవీష్ కథానాయకుడిగా కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. ఈ సినిమా ప్రీమియర్ షోలు బుధవారం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిజార్ షఫీతో ఇంటర్వ్యూ
మీ గురించి చెప్పండి?
మాది చెన్నై. ఎంజిఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశా. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్‌కి డైరెక్షన్ కూడా చేశాను. కోర్స్ పూర్తయిన తర్వాత శక్తి శరవణన్ గారి దగ్గర ‘సరోజ’, తెలుగులో ‘గ్యాంబ్లర్’గా విడుదలైన అజిత్ సినిమాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా. రజనీకాంత్ గారి ‘రోబో’కి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్ గా చేశా. తర్వాత తమిళంలో మూడు సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశా. అందులో సత్యరాజ్ గారు నిర్మించిన సినిమా ‘నాయిగల్ జాకిరతై’ ఒకటి. వాళ్లబ్బాయి శిబిరాజ్ హీరోగా నటించారు. ఆ సినిమా కెమెరా వర్క్ మారుతిగారికి నచ్చింది. ‘భలే భలే మగాడివోయ్’కి వర్క్ చేద్దామని పిలిచారు. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశాను. ‘సెవెన్’తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను.
‘సెవెన్’ ఎలా ప్రారంభమైంది?
ఒక రోజు హవీష్ ఫోన్ చేశారు. ‘మంచి లైన్ విన్నాను. డైరెక్షన్ చేస్తారా?’ అని అడిగారు. నాకు స్టోరీ లైన్ నచ్చింది. రమేష్ వర్మగారితో కలిసి డెవలప్ చేశాం. మంచి స్టోరీ లైన్, ఎందుకు ఈ సినిమా మిస్ చేసుకోవాలని ఓకే చెప్పేశా.
మీరు దర్శకుడిగా మారాలని ఎదురు చూస్తున్న సమయంలో ఈ అవకాశం వచ్చిందా?
లేదు. దర్శకుడిగా మారాలనే ఆలోచన నాలో ఉంది. అయితే, ఇంత త్వరగా దర్శకుణ్ణి అవుదామని అనుకోలేదు. కొన్నేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకోవాలని అనుకున్నా. అయితే ముందు చెప్పినట్టు మంచి స్టోరీ నా దగ్గరకు వచ్చింది. ఎందుకు మిస్ చేసుకోవాలని ఓకే చెప్పేశా. సినిమాటోగ్రఫీ పరంగానూ మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. నైట్ ఎఫెక్ట్స్, థ్రిల్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్.
‘సెవెన్’ కథ ఏంటి?
ఒక రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రెహమాన్ గారు ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఆయన దగ్గరకు ఒక కేసు వస్తుంది. కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తులు కీలకంగా ఉంటారు. హీరో కార్తీక్, ఆరుగురు హీరోయిన్లు. రెహమాన్ దృష్టిలో ఏడుగురు. అదే ‘సెవెన్’.
కార్తీక్, కృష్ణమూర్తి ఒక్కరేనా? ట్రైలర్‌లో ఆ పాయింట్ ప్రేక్షకులను ఆలోచింపజేసింది!
రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది. మరికొన్ని గంటలు ఎదురుచూడండి. ఈ సస్పెన్స్ కి తెర పడుతుంది.
కార్తీక్ గా హవీష్ ఎలా నటించాడు?
చాలా బాగా చేశాడు. ఇప్పటివరకు తను ఇటువంటి సినిమా చేయలేదు. ‘సెవెన్’లో కొత్తగా కనిపిస్తాడు.
లిప్ లాక్స్ ఐడియా మీదేనట… హవీష్‌కి ముద్దుల గురించి చెప్పలేదట?
లిప్ కిస్సుల ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. ప్రేమకథలో లిప్ కిస్సులు కూడా భాగమే. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్ కొంచెం అలోచించి ఉండొచ్చు. కానీ, దర్శకుడిగా సెట్ లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. రొమాన్స్, థ్రిల్ సీన్స్… సినిమాలో రెండూ ఉంటాయి.
ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. అంతమందితో పని చేయడం?
సినిమాను ఆరు రీళ్ళుగా విభజిస్తే… రీలుకు ఒక హీరోయిన్ చొప్పున వస్తారు. ప్రతి ఒక్కరికీ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి కథ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. అందరూ తమ తమ పాత్రల్లో బాగా చేశారు.
పాటలకు మంచి పేరొచ్చింది. హవీష్ కూడా సంగీతం గురించి చాలా చెప్పారు!
సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. మూడూ హిట్టయ్యాయి. థ్రిల్లర్ సినిమాలకు పాటలతో పాటు నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. చైతన్ భరద్వాజ్ మంచి నేపథ్య సంగీతం అందించారు.
రమేష్ వర్మ దర్శకుడు కూడా. ‘సెవెన్’లో ఆయన ఇన్వాల్వమెంట్ ఎంతవరకు ఉంది?
ఆయన కథ చెప్పారు. తర్వాత టీమ్ అంతా కలిసి డెవలప్ చేశాం. సెట్‌కి వెళ్ళిన తర్వాత నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన జోక్యం చేసుకోలేదు.
సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే అడ్వాంటేజ్ ఏంటి?
సినిమాటోగ్రాఫర్ అనుకున్నది అనుకున్నట్టుగా 95 శాతం వరకూ తీయవచ్చు. సినిమాటోగ్రఫీ మాత్రమే చేసిన సినిమాలకు కూడా దర్శకులతో హెల్తీ డిస్కషన్ ఉండేది. షాట్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం.
‘సెవెన్’కి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ చేశారు. ఇబ్బంది పడిన సందర్భాలు?
ఏమీ లేవు. ఆపరేటివ్ కెమెరామేన్ ఒకరిని పెట్టుకున్నాను. కాకపోతే… పది రోజులు ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే… ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘సెవెన్’ షెడ్యూల్స్ క్లాష్ అయ్యాయి. పగలు ‘శైలజారెడ్డి అల్లుడు’, రాత్రి ‘సెవెన్’ షూటింగ్ చేసేవాణ్ణి. ఒక సినిమాకు నేను సినిమాటోగ్రాఫర్. మరో సినిమాకు నేను డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. ‘సెవెన్’ షెడ్యూల్ వాయిదా వేద్దామంటే ఆర్టిస్టుల డేట్స్ తో ఇబ్బంది. అందుకని, పది రోజులు నిద్రపోకుండా పని చేశా.
రత్నవేలుగారు చాలా సంతోషపడ్డారు. ట్రైలర్లు, పాటలు పంపించాను. బావున్నాయని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ చేస్తున్నారు. అది పూర్తయిన తరవాత సినిమా చూస్తానని చెప్పారు. మారుతి కూడా ఎంతో సంతోషించారు. ట్రైలర్లు, పాటల గురించి చాటింగ్ చేసేవారు.
సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను. దర్శకుడిగా మారినందువల్ల సమస్యలు ఏవీ రావు. దర్శకుడిగా రెండు ఐడియాలు ఉన్నాయి. ఒకటి లవ్ స్టోరీ. మరొకటి థ్రిల్లర్. దర్శకుడిగా ఈ రెండు జానర్లు నాకిష్టమే. అవి డెవలప్ చేశాక, ఏదో ఒకటి చేస్తా.