“పాయిజన్“ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్
“పాయిజన్“ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్
సుప్రసిద్ధ నిర్మాత మరియు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన సి.కళ్యాణ్ సార్ గారి చేతుల మీదుగా సి ఎల్ ఎన్ మీడియా నిర్మించిన “పాయిజన్” మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది .ఈ “పాయిజన్” మూవీ తెలుగు ,హిందీ ,తమిళ్, కన్నడ, అండ్ మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేయబడును. ఈ చిత్ర నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిఫరెంట్ లొకేషన్లలో ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్ గా ఎంతో ప్యాషనేట్ గా నిర్మించిన చిత్రం “పాయిజన్” .ఈ చిత్రాన్ని ముంబై ,పూణే ,లోనావాలా, హైదరాబాద్ వంటి డిఫరెంట్ సిటీలలో డిఫరెంటు లొకేషన్లలో భారీగా చిత్రీకరించడం జరిగింది
డైరెక్షర్ శ్రీ రవిచంద్రన్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తో చాలా స్టైలిష్ గా ట్రెండీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఒక ఫ్యాషన్ అండ్ గ్లామర్ ఇండస్ట్రీ బేస్డ్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ .ఈ చిత్రానికి ఐదు గురు ప్రసిద్ధి చెందిన మోడల్స్ తో ప్రత్యేకంగా చిత్రీకరించిన చిత్రం. షఫీ గారు ఈ చిత్రంలోని ఏ.సి.పి క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుంది. కమల్ గారు డిఫెన్స్ లాయర్ పాత్రలో జీవించారు .హీరో రమణ తనదైన మేనరిజంతో యాటిట్యూడ్ గల పాత్రలో స్టైలిష్ గా చేశారు. అమిత్ విక్రమ్ అండ్ ఫాజల్ తమ తమ పాత్రలో చక్కగా నటించారు. డిఓపి ముత్తు కుమరన్ గారు తన కెమెరా వర్క్ తో ఒక మ్యాజిక్ సృష్టించారు. తను ఉపయోగించిన లైటింగ్ అండ్ యాంగిల్స్ ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నిహాల్ వరల్డ్ లో గేమింగ్ మ్యూజిక్ కి 636 ప్లేస్ లో వున్నవాడు. ఆతను ఇచ్చిన అతను ఒక డి జె.మ్యూజిక్ నిహాల్ డి.జె ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది.ఎడిటర్ సర్తాజ్ చేసిన ఎడిటింగ్ చాలా బాగుంది. ప్రసాద్ ల్యాబ్ వారు ఈ చిత్రానికి అందించిన సహకారం ఎన్నటికీ మరువలేనిది ప్రత్యేకించి వాళ్లు ఎక్స్పీరియన్స్ , డి ఐ విజువలైజ్ చేయగలరు .ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేషన్ తో వర్క్ చేశారు ఇది ఒక ట్రెండ్ సెట్ మూవీ అవుతుందని నిర్మాతలు అభిప్రాయం ఎంతటి చిత్రానికైనా మీడియా అండ్ డిజిటల్ ప్రమోషన్స్ ఎంతో ముఖ్యమైనది. మీడియా ఈజ్ ప్రేక్షకులకు నిర్మాతలకు వారధి లాంటిది మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీ హృదయానికి ఎత్తుకొని ప్రమోషన్ చేస్తారని ఆశిస్తూ …
మీ… సి.యల్.యన్ మీడియా
నిర్మాత సి. కళ్యాణ్ గారు మాట్లాడుతూ .. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నాకు బాగా తెలిసిన వాళ్ళు మూవీస్ అంటే చాలా ప్యాషనేట్ వాళ్లకు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ మా ఫ్యామిలీ ఈవెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ రవిచంద్రన్ మా కాంపౌండ్ లో నుంచి వచ్చిన వాడు టెక్నికల్ గా చాలా సౌండ్ పర్సన్ ప్రొడ్యూసర్, డైరెక్టరు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఈ మూవీ తీశాడు మోషన్ పోస్టర్ ఎంతో డిఫరెంట్ గా ఉంది. ప్రొడ్యూసర్ శిల్పిక ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టాలి హీరో రమణకు ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ మూవీ కావాలి ఆల్ ద బెస్ట్ ఎంటర్ టీంకు అన్నారు.
డైరెక్టర్ రవిచంద్రన్ మాట్లాడుతూ ..నా గురువు సి కళ్యాణ్ గారు విడుదల చేసిన నా మొదటి పిక్చర్ పాయిజన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీస్ జోనర్లో నడుస్తుంది. మూవీ చాలా బాగా వచ్చింది అన్నారు
నేమ్ అఫ్ ద మూవీ : పాయిజన్
బ్యానర్ : సి.యల్.యన్ మీడియా
లాంగ్వేజెస్ : తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం
ఆర్టిస్ట్స్ : రమణ, షఫీ ,కమల్, అమిత్ విక్రమ్
మోడల్స్ : సిమ్రాన్ ,శివన్య,, సారిక ,అర్చన ,
ప్రతీక్ష , తదితరులు
డీఒపి : ముత్తు కుమరన్
మ్యూజిక్ : డి.జె.నిహాల్
ఎడిటర్ : సర్తాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సిరాజ్
ప్రొడ్యూసర్ : శిల్పిక .కె
స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ : రవిచంద్రన్
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్, వంశీ శేఖర్