మా గురువు నవీన్ నూలితో పాటు నా సినిమాకు కూడా నేషనల్ ఫిలిం అవార్డ్ దక్కడం ఆనందంగా ఉంది – యంగ్ ఎడిటర్ బొడ్డు శివకుమార్
మా గురువు నవీన్ నూలితో పాటు నా సినిమాకు కూడా నేషనల్ ఫిలిం అవార్డ్ దక్కడం ఆనందంగా ఉంది – యంగ్ ఎడిటర్ బొడ్డు శివకుమార్
ఇటీవల 67వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ విన్నర్స్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ‘లత భగవాన్ కరె’ అనే మరాఠి చిత్రానికి స్పెషల్ మెన్షన్ విభాగంలో అవార్డ్ దక్కింది. అరవయ్యేళ్ల బామ్మ నిజ జీవిత కథాంశంతో రూపొందిన ఈ చిత్ర దర్శకుడు నవీన్ దేశబోయిన మన కుర్రాడే కావడం విశేషం. అలాగే ఈ మరాఠి చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్ దాదాపు మన తెలుగువారే. అందులో ఈ చిత్రానికి ఎడిటర్‌గా వర్క్ చేసిన బొడ్డు శివ కుమార్ కూడా తెలుగువాడే. తను పని చేసిన తొలి సినిమాకు నేషనల్ షిలిం అవార్డ్ దక్కడంతో తన ఆనందాన్ని బాక్సాఫీస్‌తో పంచుకున్నారు.
ఈ సందర్భంగా యంగ్ ఎడిటర్ బొడ్డు శివ కుమార్ మాట్లాడుతూ…‘‘ నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నర్ నవీన్ నూలి గారి వద్ద పలు చిత్రాలకు అసోసియేట్ ఎడిటర్‌గా పని చేశాను. ఆయనే నా గురువు. ఆ అనుభవంతో ఖాజా పాషా గారి దర్శకత్వంలో ‘తెంగాణ టూరిజం’ పై రూపొందిన డాక్యుమెంటరీకి 2015లో బెస్ట్ డాక్యుమెంటరి అవార్డ్ అందుకున్నాను. ఆ తర్వాత త్రినాథ్ నక్కిన, గోపి గణేష్, టి.సంతోష్, ఖాజా పాషా, ఆదేశ్ రవిలాంటి దర్శకులతో పని చేసిన అనుభవం ఉంది.
ఇలాంటి క్రమంలో ‘లత భగవాన్ కరె’ అనే మరాఠి చిత్రానికి ఓ మిత్రుని ద్వారా ఎడిటర్‌గా పని చేసే అవకాశం లభించింది. పని చేస్తున్నప్పుడే ఈ సినిమా గొప్ప పేరు సాధిస్తుంది అనుకున్నా. అనుకున్నట్టుగానే స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ ఫిలిం అవార్డ్ దక్కడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. మా సినిమాకు అవార్డ్ ప్రకటించిన దగ్గర నుంచి ఎంతో మంది ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలకు ఎడిటర్‌గా అవకాశాలు కూడా వస్తున్నాయి. ‘జెర్సీ’ చిత్రానికి గానూ బెస్ట్ ఎడిటర్‌గా మా గురువు నవీన్ నూలిగారితో పాటు నేను పని చేసిన మరాఠి సినిమాకూ జాతీయ అవార్డ్ దక్కడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి ’’అన్నారు.