Abhinetri 2 Movie Trailer Released
`అభినేత్రి 2` ట్రైలర్ విడుదల … మే 31న గ్రాండ్ రిలీజ్
ప్రభుదేవా, తమన్నా జంటగా, నందితాశ్వేత, సోనూసూద్, సప్తరిగి, కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `అభినేత్రి 2`. విజయ్ దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్, ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకాలపై అభిషేక్ నామా, రవీంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 31న సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. శనివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా
నిర్మాతలు మాట్లాడుతూ “ విజయ్ దర్శకత్వంలో రూపొందిన `అభినేత్రి` సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే `అభినేత్రి 2`.రెడీ రెడీ.. చక్కని పిల్లా చక్కెరబిల్లా పాటలకు, టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా తప్పకుండా హారర్ ఎంటర్ టైనర్‌గా మెప్పిస్తుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 31న విడుదల చేస్తున్నాం“ అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆయంక బోస్, సంగీతం: శామ్ సి.ఎస్., ఎడిటింగ్: ఆంటోని.