`బ్యాక్ డోర్` సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన పాకశాస్త్ర ప్రవీణుడు ‘వాహ్-చెఫ్’ సంజయ్ తుమ్మ
“నోరే ఊరేలా… కూరే కావాలా” బ్యాక్ డోర్’ సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన ప్రపంచ ప్రఖ్యాత పాకశాస్త్ర ప్రవీణుడు ‘వాహ్-చెఫ్’ సంజయ్ తుమ్మ
పాకశాస్త్ర ప్రవీణుడిగా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగువారందరికీ సుపరిచితులు- సుప్రసిద్ధులు అయిన వాహ్-చెఫ్ సంజయ్ తుమ్మ… ‘బ్యాక్ డోర్’ లోని సెకండ్ సాంగ్ లాంచ్ చేశారు.
ఈ చిత్రంలోని మొదటి పాటను దర్శక సంచలనం పూరి జగన్నాధ్ ఆవిష్కరించడం తెలిసిందే.
“నోరే ఊరేలా… కూరే కావాలా” అనే పల్లవితో.. వంట నేపథ్యంలో సాగే పాటను తనతో విడుదల చేయించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు సంజయ్ తుమ్మ. ఈ పాట విన్నాక, చూశాక… ఈ పాటకు కవర్ సాంగ్ చేయాలనిపిస్తోందని సంజయ్ తెలిపారు. “బ్యాక్ డోర్” చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకున్నారు.
ప్రణవ్ సంగీత సారధ్యం వహిస్తున్న “బ్యాక్ డోర్” చిత్రంలోని ఈ గీతానికి చాందిని సాహిత్యం అందించారు. ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రం ఆడియోను సొంతం చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భోజన ప్రియుల ఆదరాభిమానాలు కలిగిన సంజయ్ తుమ్మ… వంట బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాటను రిలీజ్ చేయడం, కవర్ సాంగ్ చేసేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు నంది అవార్డు గ్రహీత-చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ. ఈ కార్యక్రమంలో ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన రవి శంకర్, కర్రి బాలాజీ దర్శకత్వంలో తదుపరి చిత్రం ‘ఆనంద భైరవి’ నిర్మిస్తున్న బీరం తిరుపతిరెడ్డి, ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ విజయ.ఎల్.కోట పాల్గొన్నారు.
పూర్ణ ప్రధాన పాత్రలో ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వం.. ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్ సమర్పణలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ‘బ్యాక్ డోర్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, సమర్పణ: ‘సెవెన్ హిల్స్’ సతీష్ కుమార్, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!