”లవ్ స్టోరి” చిత్రంలో ‘సారంగ దరియా’ పాట రిలీజ్ చేసిన హీరోయిన్ సమంత
”లవ్ స్టోరి” చిత్రంలో ‘సారంగ దరియా’ పాట రిలీజ్ చేసిన స్టార్ హీరోయిన్ సమంత !!
ఆణిముత్యాల్లాంటి ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమా మీద అంతకంతకూ అంచనాలు
పెంచుకుంటూ వెళ్తోంది ”లవ్ స్టోరి” మూవీ టీమ్. అందమైన జంట నాగ చైతన్య,
సాయి పల్లవి నటించిన ఈ చిత్రాన్ని అభిరుచి, ప్రతిభ, ప్రేక్షకుల నాడి
తెలిసిన దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. ”లవ్ స్టోరి” చిత్రంలో
రెండు పాటలు ‘ఏయ్ పిల్లా’, ‘నీ చిత్రం’ చూసి
ఇప్పటికే రిలీజ్ అయ్యి రికార్డ్ వ్యూస్ సాధించగా…తాజాగా మూడో పాట
‘సారంగ దరియా’ విడుదల చేశారు. ఈ పాట స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా
ఇవాళ (ఆదివారం) ఉదయం 10.08 నిమిషాలకు రిలీజ్ అయ్యింది.
వినగానే గుర్తుండిపోయే, తెలియకుండానే పాడుకునే మాయాజాలం జానపద గీతం
సొంతం. అలాంటి జానపద గీతం దర్శకుడు శేఖర్ కమ్ముల గారి ఆలోచనల్లో
రూపుదిద్దుకుంటే అది మరింత అద్భుతంగా ఉంటుంది. ఆ పాటకు ఎవరు అవసరమో, ఎవరి
ప్రతిభను ఎంత తీసుకోవాలని ఈ దర్శకుడికి బాగా తెలుసు. ‘సారంగ దరియా’ కు
ప్రసిద్ధ గీత రచయిత సుద్ధాల అశోక్ తేజ పువ్వుల్లాంటి పదాలతో దండలాంటి పాట
రాయగా..ఆ పాటకు యువ సంగీత ప్రతిభాశాలి పవన్ సీహెచ్ తో మాంచి ఫోక్ బీట్
వేశారు. సూపర్ హిట్ కాంబినేషన్ శేఖర్ మాస్టర్, సాయి పల్లవి మరోసారి
డాన్స్ లతో చూపు తిప్పుకోకుండా చేసేశారు. ‘పిల్లా మెల్లగ’ వచ్చిండే అంటూ
ఫిదా చిత్రంలో ఫిదా చేసిన శేఖర్ మాస్టర్, అంతకంటే అదిరిపోయే క్రియేటివ్
స్టెప్పులు సాయి పల్లవితో ‘సారంగ దరియా’ లో వేయించారు. ఈ పాటను ఫోక్
క్వీన్ మంగ్లీ ..ఫుల్ జోష్ లో పాడి ఖుషి చేసింది.
‘సారంగ దరియా’ పాట విడుదల సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందిస్తూ…
తెలంగాణ జానపద గీతం ‘సారంగ దరియా’ కి సరికొత్త సొగసులు అద్ది, తనదైన
ముద్రతో మనకు అందించిన సుద్దాల గారికి ‘వేలదండాలు’..మీరు సూపర్ సార్..
‘కాళ్లకు ఎండి గజ్జెల్ లేకున్నా నడిస్తే ఘల్ ఘల్’..
దాని సెంపల్ ఎన్నిల కురియా..
దాని సెవులకు దుద్దుల్ మెరియా..
అది రమ్మంటే రాదురా సెలియా..
దాని పేరే సారంగ దరియా..
కిర్రాక్ సంగీతం అందించిన పవన్ కి, అద్భుతంగా డాన్స్ చేసిన సాయి
పల్లవికి, చేయించిన శేఖర్ మాస్టర్ కి, పాడిన మంగ్లీకి థాంక్యూ,
థాంక్యూ….ఇదంతా సాధ్యం చేసిన మా టీమ్ కు వేల థాంక్స్, ఈ పాటను మొదట
సేకరించి మనకి అందించిన రేలారే ‘కోమల’ కు థాంక్స్. అని ట్వీట్ చేశారు.*
ఏప్రిల్ 16న ”లవ్ స్టోరి” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్
సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.
రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ
రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్
కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,
పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర
రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు,
రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.