తేజ బ్లాక్‌బస్ట‌ర్‌ ‘చిత్రం’కు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’

తేజ బ్లాక్‌బస్ట‌ర్‌ ‘చిత్రం’కు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’

తేజ బ్లాక్‌బస్ట‌ర్‌ ‘చిత్రం’కు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’

డైరెక్ట‌ర్ తేజ ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను రూపొందించారు. అయితే, ఆయ‌న ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మైన ‘చిత్రం’ ఆయ‌న కెరీర్‌లోనే ఒక ప్ర‌త్యేక‌మైన చిత్రంగా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తేజ తీర్చిదిద్దిన ఆ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఆ ఫిల్మ్‌తోటే దివంగ‌త ఉద‌య్ కిర‌ణ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ చిత్రానికి ఆర్పీ ప‌ట్నాయ‌క్ స‌మ‌కూర్చిన సంగీతం ఒక హైలైట్‌గా నిలవ‌డ‌మే కాకుండా, పాట‌ల‌న్నీ ఒక సెన్సేష‌న్‌ను సృష్టించాయి.

నేడు తేజ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘చిత్రం’కు సీక్వెల్‌ను ప్ర‌క‌టించారు. అంతా కొత్త తార‌లు న‌టించే ఆ మూవీకి ‘చిత్రం 1.1’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. మ్యూజికల్ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ సినిమా ద్వారా 45 మంది కొత్త‌వారిని తేజ ప‌రిచ‌యం చేస్తున్నారు.

‘చిత్రం 1.1’తో తేజ‌, ఆర్పీ ప‌ట్నాయ‌క్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ మ‌ళ్లీ వ‌స్తోంది. ‘చిత్రం’ త‌ర‌హాలోనే ఈ సీక్వెల్ సైతం మ్యూజిక‌ల్ హిట్ట‌వ‌డం ఖాయం. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు ఎడిట‌ర్‌గా, శంక‌ర్ కొరియోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

చిత్రం మూవీస్ బ్యాన‌ర్‌పై తేజ స్వ‌యంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌కు ఎస్ స్టూడియోస్ నిర్మాణ భాగ‌స్వామి.

మార్చిలో ‘చిత్రం 1.1’ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంది. త్వ‌ర‌లో ఇత‌ర వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు.

సాంకేతిక బృందం:
నిర్మాత‌-ద‌ర్శ‌కుడు: తేజ‌
బ్యాన‌ర్స్‌: చిత్రం మూవీస్‌, ఎస్ స్టూడియోస్‌
మ్యూజిక్‌: ఆర్పీ ప‌ట్నాయ‌క్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ రెడ్డి
ఎడిటింగ్‌‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
కొరియోగ్ర‌ఫీ: శ‌ంక‌ర్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్.

 
Teja’s Chitram Sequel Chitram 1.1 Commences From March

Director Teja delivered many blockbusters in his long career. But, his debut directorial Chitram will remain to be a special film from the director. The youthful entertainer was a sensational hit and it marked the debut of late actor Uday Kiran. RP Patnaik scored music for the film and songs became sensation then.

Teja celebrates his birthday today. On the occasion, he proclaimed to make sequel for Chitram titled Chitram 1.1 with all new faces. He will be introducing 45 new faces with the film tipped to be a musical youthful romantic comedy.

The blockbuster combination of Teja and RP Patnaik is back for Chitram 1.1 and this is going to be a musical hit again for sure. Sameer Reddy is the cinematographer while Kotagiri Venkateswara Rao is the editor.

Teja’s Chitram Movies will produce the film in association with S Studios.

Chitram 1.1 regular shoot commences from March. Other details will be revealed soon.

Technical Crew:

Director, Producer: Teja
Banners: Chitram Movies, S Studios
Music Director: RP Patnaik
Cinematography: Sameer Reddy
Editor: Kotagiri Venkateswara Rao
Choreographer: Shankar
PRO: Vamsi-Shekar