5 భాషల్లో విడుదలవుతున్న మడ్ రేస్ మూవీ ‘మడ్డీ’
5 భాషల్లో విడుదలవుతున్న మడ్ రేస్ మూవీ ‘మడ్డీ’
భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. ప్రేక్షకులకు 4×4 వినూత్నసినిమా అనుభవాన్ని అందించే ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదలవుతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదలయ్యింది. రియలిస్టిక్ విజువల్స్‌తో ఎంతో గ్రాండియర్‌గా ఉన్న ఈ మోషన్ పోస్టర్ 2 మిలయన్స్‌కి పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ను ఈ నెల 26న విడుదల చేయనున్నారు. రియలిస్టిక్ యాక్షన్ రేసింగ్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ‘మడ్డీ’ చిత్రం రూపొందింది.
మోషన్ పోస్టర్ లోని విజువల్స్ ఎంతో గ్రాండ్ గా, రియలిస్టిక్ గా ఉండి చిత్రం పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా కోసం రియల్ మడ్ రేసర్స్ పని చేశారు. ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమా పరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు డాక్టర్ ప్రగభల్. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిటర్. హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. పాపులర్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ మడ్ రేసింగ్ యాక్షన్ ఫిల్మ్ ఇండియన్ స్క్రీన్ మీద ఒక సరికొత్త అటెంప్ట్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
The visuals from the motion poster look grand and realistic. Several real mud racing players worked for the movie and Muddy is shot in realistic locations. Muddy is directed by Dr. Pragabhal and it features Yuvan and Ridhaan Krishna in the lead roles. Prema Krishnadas bankrolled the film on PK7 Creations banner. The film is being made on a high budget will have a pan-Indian release in 5 languages Telugu, Hindi, Tamil, Kannada and Malayalam languages. KGF fame Ravi Basrur is the music director and KG Ratheesh handled the cinematography work. Several renowned actors and technicians worked for this mud racing drama which is the first attempt of its kind on the Indian screen.
‘
#Muddy