ధలమ్… లకుల్… మరోసారి!
ధలమ్… లకుల్… మరోసారి!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సారీ… ఇకపై సాయిధరమ్ తేజ్ అనకూడదు ఏమో? సాయితేజ్ అని అనాలేమో! ఎందుకంటే… మెగా మేనల్లుడు పేరు మార్చుకున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘చిత్రలహరి’ టైటిల్ కార్డ్స్ లో అతడి పేరు సాయితేజ్ అని పడుతుంది. ఆల్రెడీ విడుదల చేసిన తొలి పాట ‘పరుగు పరుగు’లో అలాగే ఉంది. బహుశా… సెంటిమెంట్ కావొచ్చు. ‘చిత్రలహరి’, పేరు మార్పు విషయాలు పక్కన పెడితే… మారుతి దర్శకత్వంలో ధలమ్-లకుల్ జోడీ మరోసారి సందడి చేయనుందని టాక్.
ఇంతకీ ధలమ్ ఎవరు? లకుల్ ఎవరు? అనుకుంటున్నారా? ధలమ్ అంటే సాయిధరమ్ తేజ్. అతణ్ణి రకుల్ అలాగే పిలుస్తుంది. లకుల్ అంటే రకుల్ ప్రీత్ సింగ్. ఆమెను సాయిధరమ్ తేజ్ అలాగే పిలుస్తాడు. వీరిద్దరిదీ ‘ల’ భాష. ఆల్రెడీ ‘విన్నర్’లో జంటగా నటించారు. మరోసారి ఈ జంటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మారుతి అనుకుంటున్నారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారని సమాచారం. సాయిధరమ్ తేజ్ కు ‘సుప్రీమ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి హిట్స్ ఆయన ఇచ్చారు.