డాక్టర్ డి. రామానాయుడు వర్ధంతి సంధర్భంగా ఘన నివాళి
డాక్టర్ డి. రామానాయుడు వర్ధంతి సంధర్భంగా ఘన నివాళి
గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ శ్రీ రామానాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు నిర్మాత సురేష్ బాబు గారు అండ్ పలువురు రామానాయుడు గారికి ఘన నివాళులు అందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నిర్మాతగా అడుగుబెట్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న అన్ని భాషలలో సినిమాలు నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన నిర్మాత మన రామానాయుడు గారు. అయితే ఫ్రిబ్రవరి 18 న రామానాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఫిల్మ్ నగర్ లో రామానాయుడు గారి విగ్రహానికి ఆయన కుమారుడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సత్యనారాయణ, సంతోషం పత్రిక అధినేత నిర్మాత సురేష్ కొండేటి ఘనమైన నివాళులు ఘటించారు.
ఈ సంధర్భంగా కాజా సత్య నారాయణ గారు మాట్లాడుతూ “ఈ రోజు ఫిల్మ్ నగర్ ఇలా ఉంది అంటే దానికి ముఖ్య కారణం రామానాయుడు గారే, అయన చేసిన సేవలు వలన ఈరోజు మన ఫిల్మ్ నగర్ ఇంతమందికి జీవన అధారంగా నిలిచింది అని కొనియాడారు. కాబట్టే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు ప్రతిరోజు స్మరించుకుంటున్నాం. మాకు రామానాయడు గారు జన్మదినాన్ని అలాగే వర్ధంతిని కూడా ఒక పండగలా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.