“నాంది“ ప్రీ-రిలీజ్ వేడుక !!

“నాంది“ ప్రీ-రిలీజ్ వేడుక !!

“నాంది” ట్రైలర్ చూసి షాక్ అయ్యాను.. అంత అద్భుతంగా ఉంది- నాంది ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ !!* 
 
గమ్యం, నేను, శంభో శివ శంభో, వంటి సీరియస్ క్యారెక్టర్స్ లో నటించి.. నరేష్ కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే కాదు.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కూడా చేయగలడు అని ప్రూవ్ చేసుకొని.. ‘మహర్షి’లో ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి అందరిచేత శభాష్ అనిపించుకుని నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగాడు నరేష్. తాజాగా  కామెడీ స్టార్ అల్లరి నరేష్ “నాంది” అంటూ మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రాక్ లో జయమ్మగా నటించి మంచి పేరు సంపాదించుకొన్న వరలక్ష్మీ శరత్ కుమార్  ఆద్యగా  పవర్ ఫుల్ లాయర్ క్యారెక్టర్ లో నటించింది.   నవమి హీరోయిన్ గా యస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ కనకమేడలని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సతీష్ వేగేశ్న  “నాంది” చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన “నాంది” టీజర్, ట్రైలర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.. నరేష్ 57వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి19న గ్రాండ్ గా విడుదల కాబోతుంది… శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక ఫిబ్రవరి 15న హైదరాబాద్ జేఆర్సీ కన్విక్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు శరత్ కుమార్, రాధిక, సునీల్, దర్శకులు హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, సతీష్ వేగేశ్న, ముఖ్య అతిధులుగా పాల్గొనగా.. హీరో నరేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, హీరోయిన్ నవమి, చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల, నిర్మాత సతీష్ వేగేశ్న, నటులు ప్రవీణ్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ అయ్యర్, దేవీప్రసాద్, రమేష్ రెడ్డి, సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల, ఎడిటర్ చోట.కే ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్, కథారచయిత తూము వెంకట్, పాటల రచయిత చైతన్య ప్రసాద్,  మాటల రచయిత అబ్బూరి రవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండు,   తదితరులు పాల్గొన్నారు.. నాంది ఫస్ట్ టికెట్ ను శరత్ కుమార్, రాధిక కొనుగోలు చేశారు. అనంతరం.. 
 
ప్రముఖ నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ.. ” నాంది ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా పెద్ద హిట్ అని తెలిసిపోతుంది. నరేష్ చాలా కష్టపడి చేశాడు అని విన్నాను. డబ్బింగ్ న్యూ స్టయిల్ లో చెప్పాడు. వెరీ డెడికేటెడ్ యాక్టర్. విజయ్ ఒక సోషల్ మెసేజ్ ఇస్తూ.. నాంది సినిమా తీశాడు. ఇంకా మరిన్ని సినిమాలు విజయ్ చేయాలి. మా అమ్మాయి వరు తనకు తానుగా సినిమాలు ఎంచుకొని మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. నేను ఎవరినీ క్యారెక్టర్స్ ఇవ్వమని రికమండ్ చేయను. చిన్న అమ్మాయి పెద్ద పెద్ద పాత్రలు చేస్తున్నదని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా చిరంజీవి గారు కూడా వరుని మెచ్చుకున్నారు. ఒక ఫాదర్ గా నాకు గర్వాంగా ఉంది. నాందిలో లాయర్ క్యారెక్టర్ చేసింది. తప్పకుండా ఈ చిత్రం మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
 
రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ..  ఇక్కడికి వచ్చేదాకా మాకు తెలియదు.. నాంది ఫంక్షన్ అని. ఎయిర్ పోర్ట్ నుండి రాగానే  మా వరు కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని పిలిచింది. ఇక్కడకు వచ్చాక షాకింగ్ గా అనిపించింది. నాంది టీజర్, ట్రైలర్ చూశాను. చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. టీమ్ అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారని తెలుస్తుంది. తెలుగు పరిశ్రమ  అంటే నాకు చాలా మక్కువ ఎక్కువ. ఇక్కడ ఆడియెన్స్ ఎంతగానో ఓన్ చేసుకొని ప్రేమిస్తారు. అదే నేను వరలక్ష్మీ కి చెప్పాను. తెలుగులో మంచి సినిమాలు చేయమని సలహా ఇచ్చాను. ఇప్పుడు అలాగే మంచి క్యారెక్టర్స్ చూజ్ చేసుకొని చేస్తుంది. మంచి నటిగా వరు పేరు తెచ్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది. డిఫరెంట్ జోనర్ లో వస్తోన్న నాంది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 
 
హీరో నరేష్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 57 సినిమాలు చేశాను. నా ఫస్ట్ ప్రియార్టీ కామెడీనే.. దానిని వదలను. మధ్య మధ్యలో నాంది లాంటి డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ చేస్తాను. టీమ్ అందరూ చాలా కష్టపడి విజయ్ కోసం నాంది సినిమా చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నాంది టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది. చైతన్య ప్రసాద్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. నాంది సినిమా చూశాక హరీష్ శంకర్ చాలా గర్వాంగా ఫీలవుతారు.. అంత బాగా విజయ్ ఈ చిత్రాన్ని తీశాడు. సతీష్ వేగేశ్న గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమా బాగా రావాలని విజయ్ కి సపోర్ట్ చేస్తూ.. ఈ సినిమా నిర్మించారు. డెఫినెట్ గా ఆయనకి ఈ చిత్రం మంచి లాభాలను తీసుకువస్తుంది. శ్రీచరణ్ చాలా ఇంటెన్సివ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆర్ ఆర్ ఎక్స్ లెంట్ గా చేశాడు. మా యూనిట్ అందరికీ ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. ఇందులో నటించిన ప్రతీ ఒక్కరూ వారి పాత్రలకు జీవం పోశారు. అందర్నీ ఒక కొత్త పందాలో ఆడియెన్స్ చూస్తారు. మంచి కంటెంట్ బేస్డ్ సినిమా చేశాం.. అందరూ చూసి మా అందర్నీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.. అన్నారు. 
 
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. క్రాక్ లో జయమ్మ గా అందరూ ఆదరించారు. అంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. చాలా పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. నాంది లో లాయర్ గా  ఆద్య పాత్రలో నటించాను. చాలా ఇంట్రెస్టింగ్ గా  డబ్బింగ్ నేనే చెప్పాను.  విజయ్ ఎక్స్ ట్రార్డినరి గా ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా విజయ్ విజన్. ప్రతీ ఒక్కరూ ఇన్వాల్వ్ అయి చేశారు. నరేష్ వన్డ్రఫుల్, లవ్లీ కో యాక్టర్. ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత సతీష్ బాగా సపోర్ట్ చేసి మంచి సినిమా తీశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. 
 
 ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఇది నా సినిమా ఫంక్షన్ లా ఉంది. నాకు ఇవివి గారంటే చాలా అభిమానం. ప్రతీ సినిమాకి ఆయన దెగ్గర ఎప్పుడూ ఒక పదిమంది రైటర్స్ వర్క్ చేస్తుంటారు. అలా నేనుకూడా ఆపదిమందిలో ఒక రైటర్ ని అవుదామని ఇండస్త్రికి వచ్చాను. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. నరేష్ కూడా ఎంతో మంది కొత్తదర్శకులను ఇండస్త్రీకి పరిచయం చేశారు. నాంది తో మా విజయ్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నరేష్ కి థాంక్స్. విజయ్ కల, కష్టం రెండూ నెరవేరిన రోజు ఇవాళ. విజయ్ నా దెగ్గర ఒక 5 సినిమాలకు వర్క్ చేశాడు. విజయ్ సెట్లో ఉంటే నాకు ఒక ధైర్యం, ధీమా ఉంటుంది. నా ఎన్నో విజయాల వెనుక విజయ్ కాంట్రిబ్యూషన్ ఉంది. తనని చూసి అందరూ హార్డ్ వర్క్ నేర్చుకోవాలి. ఒక డిఫరెంట్ సినిమా టీజర్ తోనే అందర్నీ ఆకట్టుకున్నాడు విజయ్. నాంది టీజర్ చూసి షాక్ అయిపోయాను. జనరల్ గా నా నుంచి వస్తున్నాడంటే ఎంటర్టైన్మెంట్ సినిమా తీశాడేమో అనుకున్నా..  అలా కాకుండా డిఫరెంట్ జోనర్స్ లో నాంది చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. మహర్షి లో మా వంశీ అల్లరి నరేష్ ని ఒక కొత్త యాంగిల్ లో చూపించాడు. అప్పట్నుంచీ అల్లరి నరేష్ అనిపిలవటం మానేసి యాక్టర్ నరేష్ అని పిలుస్తున్నారు.  ఈ చిత్రంలో నెక్స్ట్ లెవెల్ లో విజయ్ నరేష్ ని చూపించాడు. ఇప్పటివరకూ ఒక 56 సినిమాలు చేసి నవ్విస్తూ.. నవ్విస్తూ సడన్ గా ఏడిపించడం చాలా కష్టం. ఈ సినిమా ఒప్పుకొని చేసినందుకు నరేష్ గట్స్ కి హ్యాట్సాప్. ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడమే బెస్ట్ సక్సెస్ అని నమ్ముతున్న. ఈ సినిమా ఓటిటిలో వస్తది అని చాలా మంది కామెంట్స్ చేశారు. అయినా కూడా వెయిట్ చేసి మా విజయ్ ని బిగ్ స్క్రీన్ మీద ఆవిష్కరిస్తున్నందు సతీష్ గారికి చాలా థాంక్స్. ఒక కొత్త డైరెక్టర్ సినిమాని అనుకున్నది అనుకున్నట్టు తీసేలా సపోర్ట్ చేసిన సతీష్ గారికి హ్యూజ్ సక్సెస్ లభిస్తుంది. ఈ సినిమాకి పనిచేసి విజయ్ కి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ నా థాంక్స్.. అన్నారు. 
 
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి వర్క్ చేసిన టీమ్ అంతా నాకు బాగా కావాల్సిన వారు. నరేష్ పెర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి ఆయన్ని కలవడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇవివి గారు చేసిన సినిమా షీల్డ్స్ అన్ని ఉన్నాయి. డిఫరెంట్ జోనర్ లో ఎన్నో సినిమాలు చేశారు ఆయన. నేను కూడా డిఫరెంట్ జోనర్లో సినిమాలు చెయ్యాలని ఇన్స్పైర్ అయ్యాను. నాంది టీజర్ చూశాక కళ్ళలో నీళ్లు తిరిగాయి. బుజ్ బమ్స్ వచ్చాయి. మా జాంబిరెడ్డి బ్లడీ బ్లాక్ బస్టర్ అయింది.. దానికన్నా బిగ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 
 
హీరో సునీల్ మాట్లాడుతూ… యు యస్ లో నరేష్ కి ఫాన్స్ వున్నారు. అందరి ఇళ్లలో నరేష్ ఒక ఫ్యామిలీ మెంబర్. తన కామెడీతో అందర్నీ ఎంటర్టైన్ చేస్తారు. వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో ఒక కొత్త నరేష్ ని చూస్తారు. విజయ్ సింపుల్ గా ఉంటాడు. వెరీ ఎనర్జిటిక్ డైరెక్టర్. తప్పకుండా మంచి డైరెక్టర్ అవుతాడు. ఒక కొత్త సినిమాకి నాంది పలుకుతారు. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. 
 
చిత్ర నిర్మాత సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. నాంది సినిమాకి వర్క్ చేసిన నటీనటులకు, టెక్నీషియన్స్ కి నా ధన్యవాదాలు. మలయాళంలో కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ ఎక్కువ వస్తాయి.. బాగా తీస్తారు అనుకునేవాడ్ని. మన తెలుగులో అలాంటి సినిమాలు ఎందుకురావట్లేదు అనుకునే టైంలో విజయ్ అద్భుతమైన కాన్సెప్టుతో స్టోరీ చెప్పాడు. అదే నాంది సినిమా. ట్రైలర్ రిలీజ్ అవగానే హిందీ, తమిళ్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇంత మంచి సినిమా నాకు చేసిన విజయ్ కి థాంక్స్. ప్రతీ ఒక్కరిని నాంది థ్రిల్ చేస్తుంది. ఫిబ్రవరి 19న సినిమా రిలీజ్ చేస్తున్నాం.. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది అని కాన్ఫిడెంట్ గా చెపుతున్నాను.. అన్నారు. 
 
చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ‘నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి మా తల్లిదండ్రులే కారణం. యు యస్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ చదివి వెంకట్ తూము నాకు లైన్ చెప్పాడు. ఇద్దరం దానిపైన వర్క్ చేసి కథ రెడి చేశాం.  లైన్ అనుకున్నపుడే నరేష్ అని ఫిక్స్ అయ్యాం. కథ విని నరేష్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నారు. ఆరు నెలలు టైమ్ తీసుకొని ఎంతో రీసెర్చ్ చేసి బౌండ్ స్క్రిప్ట్ తో సెట్స్ కి వెళ్ళాం. అలాగే కథ విని వరలక్ష్మీ గారు ఎంతో ఇంప్రెస్ అయి సూపర్బ్ గా ఈ సినిమా చేసింది. లాయర్ ఆద్య పాత్రకు లైఫ్ ఇచ్చింది. టీం అందరూ నాకోసం బాగా కష్టపడి పనిచేశారు. సిద్ విజువల్స్, శ్రీచరణ్ మ్యూజిక్, బ్రహ్మ సెట్స్ వర్క్, చోటా ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. నరేష్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. చాలా మెచ్యూర్డ్ గా ఈ చిత్రంలో పెర్ఫార్మెన్స్ చేసాడు. నిర్మాత సతీష్ గారు నామీద నమ్మకంతో కథకి అవసరమైన వన్నీ ప్రొవైడ్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి టెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. తప్పకుండా ఈ చిత్రం మంచి హిట్ అవుతుందని బావిస్తున్నాం.. అన్నారు.