‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’లో ఫాదర్-సన్ రిలేషన్షిప్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది – హీరో రామ్ కార్తీక్
‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’లో ఫాదర్-సన్ రిలేషన్షిప్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది
– హీరో రామ్ కార్తీక్ !!
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’ చిత్రం ఫిబ్రవరి 12న, శుక్రవారం విడుదలవుతోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్‌గా యంగ్ హీరో క్యారెక్టర్‌ను రామ్ కార్తీక్ పోషించారు. సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మీడియా ప్రతినిధులతో రామ్ కార్తీక్ సంభాషించారు. ఆ విశేషాలు…
ఈ సినిమాలో మీకు ఎలా అవకాశం వచ్చింది?
మా సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం హ్యాపీ. డైరెక్టర్ విద్యాసాగర్ రాజుగారి మునుపటి సినిమా ‘రచయిత’ చూశాను. అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో కార్తీక్ క్యారెక్టర్‌కు ర్యాండమ్‌గా కాకుండా, చాలా మంది ప్రొఫైల్స్ చూసి నన్ను ఎంచుకున్నారని తెలిసింది. సాగర్‌గారు చాలా టాలెంటెడ్ డైరెక్టర్. నటుడిగా నాలో నాకు తెలీని యాంగిల్‌ను ఈ సినిమాతో ఆయన బయటకు తెచ్చారు. ఇంటర్నల్‌గా వేసిన ఓ షోలో నా పర్ఫార్మెర్స్ను అందరూ మెచ్చుకోవడం మరింత హ్యాపీ.
మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
టైటిల్లోని కార్తీక్ పాత్రను చేశాను. పక్కింటబ్బాయి తరహాలో ఉంటుంది. నా ఫాదర్‌గా చేసిన జగపతిబాబుగారిది చిలిపిగా ఉండే క్యారెక్టర్. లైక్ ఫాదర్ లైక్ సన్ తరహాలో నా క్యారెక్టర్ ఉంటుంది. అయితే నిజ జీవితంలో దానికి పూర్తి ఆపోజిట్‌గా ఉంటాననుకోండి.
జగపతిబాబు గారి లాంటి పేరుపొందిన యాక్టర్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
జగపతిబాబు గారు ఓ లెజెండరీ యాక్టర్. ఆయనతో తెర పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. మా ఇద్దరి మధ్యా వచ్చే చాలా సీన్లలో ఓ ఎమోషనల్ సీన్ నాకు చాలా నచ్చింది. అది ఛాలెంజింగ్ సీన్. ఆ సీన్లో ఆయన మీద నేను కోపాన్ని ప్రదర్శించాలి. మొదట నెర్వస్‌గా అనిపించినా, ఆయన ఇచ్చిన సపోర్ట్‌తో దాన్ని చేశాను. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం ఫన్‌గానే కాకుండా ఎమోషనల్గానూ ఉంటుంది. అది ఆడియెన్స్‌కు బాగా రీచ్ అవుతుంది.
అసలు ఈ సినిమా కథేమిటి?
కార్తీక్, ఉమ మధ్య ప్రేమకథలో సడన్‌గా చిట్టి అనే చిన్నపాప ఎంటరైతే వచ్చే అపార్థాలు దేనికి దారి తీస్తాయి? ఆ పాప ఎవరు? మా లవ్ స్టోరీని ఆమె ఎలా గట్టెక్కించిందనేది? అనే పాయింట్ ఇంటరెస్టింగ్‌గా, కామిక్ వేలో ఉంటుంది. అంటే పాత్రల మధ్య ఉండే కన్ఫ్యూజన్.. మంచి ఫన్ను అందిస్తుంది. డైరెక్టర్ సాగర్‌గారు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ను కామిక్ వేలో చెప్పారు.
చిన్నపాపతో వర్క్ చేయడం కష్టమనిపించలేదా?
లేదండీ. ఆమెతో కలిసి సీన్లు చేసేటప్పుడు మేమేం కష్టపడలేదు. చిట్టి పాత్రను బేబి సహశ్రిత చాలా బాగా చేసింది. తను బార్న్ ఆర్టిస్ట్. తన నుంచి ఎలాంటి ఎక్స్ప్రెషన్ కావాలంటే అది ఇచ్చేసేది.
హీరోయిన్ అమ్ము అభిరామి గురించి ఏం చెబుతారు?
అమ్ము అభిరామితో మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. ఆమెది మామూలు మెమరీ కాదు. వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. తనకు సరిగా తెలుగు తెలీదు. డైలాగ్ బట్టీపెట్టేసి, పర్ఫెక్టుగా చెప్పేసేది.
సినిమాలో మీకు పర్సనల్‌గా ఏ పాట ఇష్టం?
పాటల్లో నాకు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ రాసి, పాడిన “పూవల్లే” బాగా ఇష్టం. అది ఎమోషనల్‌గా ఉంటుంది. పాప, జగపతిగారు, నా మీద ఆ పాట ఉంటుంది. తన కూతుర్ని దృష్టిలో పెట్టుకొని ఆ పాటను భీమ్స్ రాశారు. నిజానికి ఆల్బమ్ మొత్తం బాగా ఉందనే టాక్ వచ్చింది.
శ్రీ రంజిత్ మూవీస్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో పనిచేయడంపై ఏం చెబుతారు?
నిజంగా శ్రీ రంజిత్ మూవీస్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో నటించే అవకాశం రావడం వెరీ హ్యాపీ. స్క్రిప్ట్ విషయంలో నిర్మాత దాము గారు చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. కేస్టింగ్ విషయంలోనూ అంతే. ఆ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే.. హిట్ అయినట్లే అనే అభిప్రాయం ఉంది. ప్రొడక్ట్ విషయంలో ఆయన అంత శ్రద్ధ చూపిస్తారు. ఈ సినిమాకు నలుగురు పిల్లర్లు. దాముగారు, సాగర్‌గారు, జగపతిబాబు గారు, లైన్ ప్రొడ్యూసర్ వాసు పరిమి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వాళ్లు ప్రధాన కారణం.
Audience will connect with Father-Son Relationship in ‘FCUK (Father-Chitti-Umaa-Kaarthik)’ – Hero Ram Karthik
Father Chitti Umaa Kaarthik popularly known by acronym FCUK which has created high expectations with its teaser is set to hit the theaters on February 12th. The movie directed by Vidyasagar Raju presents Raam Kaarthik and Jagapathi Babu in a unique son and father relationship. This was revealed in the media interaction of Ram Kaarthik today details of which are below.
…
How did you get the opportunity in this film?
Our film is happy to be trending on social media, on the digital platform. I saw director Vidyasagar Rajugari’s previous film ‘Racheyta’. That impressed me a lot. Karthik’s character was given to me after a lot of study of actors profiles by the production house. Sagar is a very talented director. As an actor, he brought an angle unknown to even me with this film. I am happy with the immense appreciation being showered on me for my performance in the film.
How is your character?
I did the role of Karthik in the title. Its a boy next door kind of character. The prankster character that Jagapathibabu enacted is as my father. Our characters not ‘Like Father – Like Son’ but very opposite.
How did it feel to work with a well-known actor like Jagapathi babu Garu?
Jagapathi Babu is a legendary actor. I feel lucky to share the screen with him. One of the many scenes that happens between the two of us is an emotional scene that I really like. That was a challenging scene. I have to show anger at him in that scene. Although I seemed nervous at first, I did it with the support he gave me. That scene came out very well. The relationship between father and son in this film is not only fun but also emotional. It will reach the audience well.
What exactly is this movie about?
It is about how a love story of Kaarthik and Umaa is interrupted by entry of Chitti and how it is resolved. Director Vidyasagar has presented this narrative with lot of fun and humour.
Isn’t it hard to work with a small baby?
None. We did not have any problems working with her. In Fact she was the one who made it very stress free. The character of Chitti was very well done by Baby Sahasritha. She is a Born Artist. She gave whatever expression we needed.
What about the heroine Ammu Abirami?
Have a good working experience with Ammu Abhirami. She has no ordinary memory. She is a very Talented Artist.
What song do you personally like in the movie?
I really like “Poovalle” written and sung by music director Bhims among the songs. It is very emotional. Bhims wrote the song with his daughter in mind. We are delighted that the album as a whole has been rated as very good.
What about working on a prestigious banner like Sri Ranjith Movies?
Really very happy to have the opportunity to star in a prestigious banner like Sri Ranjith Movies. Producer Damu is very particular about the script. The same is true of casting. The movie is coming from a banner which gives a foregone conclusion from the beginning that it is a hit. He pays so much attention to the product. There are four pillars in this movie. Damugaru, Sagar garu, Jagapati babu Garu, Line Producer Vasu Parim Garui. They are the main reason why this film came out so well.