నా పెర్ఫామెన్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడ్డం చాలా గర్వంగా ఉంది – కృతి శెట్టి !!
నా పెర్ఫామెన్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడ్డం చాలా గర్వంగా ఉంది – కృతి శెట్టి !!
మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న “ఉప్పెన“ తోనే తెలుగులో తాను కూడా మొదటగా అడుగు పెట్టి విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న యువ హీరోయిన్ కృతి శెట్టి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా సిల్వర్ స్క్రీన్ ను హిట్ చెయ్యడానికి రెడీగా ఉన్న ఈ బ్యూటీ నుంచి లేటెస్ట్ ఇంటర్వ్యూ . మరి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం….
మొదటి ప్రశ్నకు వెళ్లే ముందు ఒకటి..గూగుల్ లో అద్వైత అనేది మీ పేరేనా.?
లేదు అది నా పేరు కాదు. నా లాంటి పేరుతోనే కృతి శెట్టి అనే అమ్మాయి మరొకరు ఉన్నారు. ఆమె తర్వాత అద్వైత అని మార్చుకుంది. వికీపీడియాలో అలా లింక్ అయ్యిపోయింది ఆ పేరు నాది కాదు.
అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది? ఈ సినిమా ఎలా వచ్చింది?
నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ కెరీర్ అనుకోలేదు. నేనెప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను. కానీ ఈ ఆఫర్ వచ్చినప్పుడు బాగుంది అనిపించింది స్టోరీ విన్నాక చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా చేశాను.
హీరోకు మీకు ఇదే ఫస్ట్ సినిమా ఈ విషయం ఎప్పుడైనా మాట్లాడుకున్నారా?
లేదు మేమెప్పుడూ మాట్లాడుకోలేదు. ఇంటర్వ్యూస్ లోనే మాట్లాడుకున్నాం నాకు కూడా వైష్ణవ్ కు ఫస్ట్ సినిమా అనే ఈ విషయం తెలీదు.
నిజంగా ఫస్ట్ సినిమాకే తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు,ఎవరు నేర్పించారు?
ఈ విషయంలో డైరెక్టర్ గారు చాలా హెల్ప్ చేశారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ వివేక్, రాహుల్ అనే ఒకాయన చాలా బాగా హెల్ప్ చేశారు. హీరో కూడా నాకు నేర్పించారు. అందుకే వచ్చేసింది.
షూటింగ్ లో మీ బెస్ట్ మెమొరీ ఏంటి?
ఈ సినిమా షూట్ లో బెస్ట్ మెమొరీ ఏంటంటే ఒక ఎమోషనల్ సీన్ చేసాక డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ మానిటర్
వెనుక ఉన్నవారు అంతా చూసి ఏడ్చేశారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. విజయ్ సేతుపతి గారితో యాక్ట్ చెయ్యడం కూడా.
విజయ్ సేతుపతి గారితో యాక్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది?
విజయ్ సేతుపతి గారు సెట్స్ లో చాలా కామ్ గా క్యూట్ గా ఉంటారు. కానీ యాక్షన్ అండ్ కట్ చెప్పే టైం లో మాత్రం టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇస్తారు. మా ఇద్దరి మధ్య ఒక పెద్ద సీన్ ఉంటుంది అది చేయగలనా లేదా అన్నపుడు సేతుపతి గారు కొన్ని టిప్స్ కూడా ఇచ్చారు. ఆ సీన్ చాలా బాగుంటుంది.
ఈ సినిమా ఒప్పుకున్నపుడు వైష్ణవ్ కోసం కానీ డైరెక్టర్ కోసం కానీ బ్యాక్గ్రౌండ్ తెలుసా?
నాకు చిరంజీవి గారు తెలుసు కానీ మిగతా వారు ఎవరు కూడా తెలీదు. కానీ సుకుమార్ గారు చాలా కాన్పిడెన్స్ ఇచ్చారు నాకు అదే ఈ సినిమా చెయ్యడానికి నాకు చాలాహెల్ప్ అయ్యింది.
వైష్ణవ్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది?
నిజానికి వైష్ణవ్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. నాకు చాలా హెల్ప్ ఫుల్ గా ఉండేవాడు. అలాగే తానొక బ్రిలియెంట్ యాక్టర్ అది ఈ 12న చూస్తారు. అలాగే తన ఫస్ట్ మూవీలోనే ఇలా యాక్ట్ చెయ్యడం మామూలు విషయం కాదు తన దగ్గర నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను.
ఇంతకు ముందు ఫుల్ టైం యాక్టింగ్ చేయలేదు మరి ఈ సినిమా ఎలా హ్యాండిల్ చేశారు?
నేను యాక్టింగ్ నేర్చుకోలేదు అలాగే ప్రొఫెషినల్స్ హెల్స్ కూడా తీసుకోలేదు కొన్ని సీన్స్ కాస్త డిఫికల్ట్ అనిపించాయి ఆ టైం డైరెక్టర్ బుచ్చిబాబు గారు అస్టిస్టెంట్ డైరెక్టర్ నన్ను మోటివేట్ చేసి చేయించారు.
ఈ సినిమాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది?
సినిమా చూసిన సుకుమార్ గారు కొరటాల శివ గారు మా ప్రొడ్యూసర్ సవీన్ గారు అయితే ఫోన్ చేసి
నా పెర్పామెన్స్ కోసం షివర్ అవుతూ చెప్పారు. కానీ మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నా పెర్పామెన్స్ కోసం
మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడ్డం ఓ మై గాడ్ అనిపించింది.అంత గొప్ప యాక్టర్ నా కోసం మాట్లాడ్డం నాకు చాలా గర్వంగా అనిపించింది.