యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం “చేతిలో చెయ్యేసి చెప్పు బావ”
యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం “చేతిలో చెయ్యేసి చెప్పు బావ”
మేరీ కృపావతి ప్రభుదాస్ సమర్పణలో కొమరపు ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్య ఓం ,అరుణ్ రాహుల్, అంజనా శ్రీనివాస్ , రోహిణి ముంజల్, సుమన్ , జయప్రకాష్ రెడ్డి ,పోసాని కృష్ణ మురళి, చలపతి రాజు, కవిత నటీ నటులుగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో కే జోషఫ్ నిర్మించిన “చేతిలో చెయ్యేసి చెప్పు బావ” చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సుమన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.. అనంతరం
నటుడు సుమన్ మాట్లాడుతూ… ఈ సంవత్సరం లో వచ్చిన చిన్న సినిమాల సక్సెస్ లో ఈ సినిమా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.పెద్ద క్యాస్టింగ్ లేకపోయినా మంచి కథ ఉంటే ప్రేక్షకుల ఎప్పుడు ఆదరిస్తారని ఈ మూవీ ప్రూవ్ చేసింది.దర్శకుడు ప్రసాద్ వచ్చి నాకు కథ చెప్పినపుడు డిఫ్రెంట్ గా ఉందని ఒప్పుకున్నాను నాకు దర్శకుడు ప్రసాద్ డ్యాన్సర్ గా,డ్యాన్స్ అసిస్టెంట్ గా,డ్యాన్స్ డైరెక్టర్ గా ,ఒక డైరెక్టర్ గా అప్పటినుండి తెలుసు ఆయన లైఫ్ లో ఎన్నో కష్టాలు పడ్డాడు.ప్రసాద్ నిర్మాతలకు ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు.అలా నిర్మాత ఇచ్చిన కథను మార్పులు చేసి ఈ రోజు డైరెక్టర్ గా మంచి సినిమా తీసి సక్సెస్ సాధించాడు.ఇలాగే ప్రసాద్ ముందు ముందు పెద్ద హీరోలతో సినిమాలు తీసి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిర్మాత జోషఫ్ తను తీసిన మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించాడు.ఇలాంటి మంచి నిర్మాతలు ఇండస్ట్రీ కి కావాలి.ముందు ముందు మీరే దర్శకులకు మంచి కథలు ఇచ్చి ఎన్నో సినిమాలు తియ్యాలని కోరుకుంటున్నాను.ఈ సినిమా విషయం లో మీ బాధ నాకు అర్థమయ్యింది.జనరల్ గా పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు విడుదలైనపుడు థియేటర్ల సమస్య వస్తుంది.సినిమా బాగున్నా.. థియేటర్స్ దొరక్క సినిమాలో నటించిన అరిస్టులకు తగిన గుర్తింపు రాకపోవడంతో పాటు దర్శక, నిర్మాత లు ఎంతో నష్టపోతారు.ఈ విషయంపై నేను మన ముఖ్యమంత్రులు కె. సి.ఆర్ ,జగన్ గార్లకు చెప్పడం జరిగింది.చిన్న సినిమాలు ,చిన్న నిర్మాతలు చాలా సఫర్ అవుతున్నారని, చిన్న సినిమాలకు మంచి టాక్ వచ్చి సెట్ అయ్యే టైంలో పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకొని చిన్న సినిమాలను మూడు రోజుల్లోనే తీసి వేస్తున్నారని అలా కాకుండా ఫైనాన్స్ పరంగా టాక్స్ పరంగా చిన్న సినిమాలకు కొత్త సిస్టం ను ఫామ్ చేసి ఒక వారం ఉండేలా చూసి చిన్న సినిమాలను,చిన్న నిర్మాతలను కాపాడాలని వారికి చెప్పడం జరిగింది. త్వరలో దీనికి తగిన పరిస్కారం లభించాలని ఆశిస్తున్నాను. అలాగే ఇండస్ట్రీ లో ఏదైనా విజయం సాధించాలంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేము.ఇండస్ట్రీ లో కస్టపడే వారికి ఎప్పటికైనా మంచి విజయం లభిస్తుంది. నేను ఇండస్ట్రీ కు ఎలాంటి బ్యాగ్రౌండ్ తో రాలేదు.ఇండస్ట్రీ లో నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు.నేను ఇండస్ట్రీ కు వచ్చి 43 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు నేను 9 భాషలో 500 సినిమాల పైనే చేశాను.నేనెప్పుడూ నిర్మాతకు కష్టం కలిగించే పని చేయను, నాకిచ్చిన షెడ్యూల్ ను పూర్తి చేరుకొని వెళతాను. సినిమా హిట్ అయినా,ఫెయిల్ అయినా ఒకేలా ఉండాలి. ఒక నిర్మాతకు,దర్శకుడికి,నటుడికి సినిమా హిట్ అయితే వచ్చే సంతోషమే వేరు అలాంటి మంచి సినిమా తో మన ముందుకు వచ్చిన దర్శక,నిర్మాతలను ప్రేక్షకులు ఆదరించి “చేతిలో చెయ్యేసి చెప్పు బావ” చిత్రాన్ని ఇంకా పెద్ద విజయం సాధించేలా చెయ్యాలని అన్నారు.
విలన్ పాత్ర పోషించిన చలపతి రాజు మాట్లాడుతూ … కొమరం పొడక్షన్ లో నిర్మించిన చేతిలో చెయ్యేసి చెప్పు బావా సినిమా విడుదలై నాలుగవ రోజు సినిమా విడుదలైన నాలుగవ రోజు విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది సుమన్ గారు సినిమా హిట్ అయింది ప్రెస్ మీట్ పెట్టుకోమని డేట్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది రెండు సంవత్సరాల నుండి ఈ సినిమా కోసం రాత్రి పగలు నిద్ర పోకుండా దర్శక నిర్మాతలు చాలా కష్టపడ్డారు సినిమా చూసిన ప్రేక్షకులు దేవుళ్ళు దేవుళ్ళు బాగుందని ప్రశంసించారు ప్రశంసించడంతో ఇన్నాళ్లు మేం పడిన కష్టమంతా వారి మాటలకు మా కష్టం తెలియకుండా పోయింది ఈ సినిమా ప్రతి ఒక్కరికి తప్పక నచ్చుతుంది అందరూ మా సినిమాను చూసి మా టీమ్ ని ఆదరించాలని మనవి చేసుకొంటానని
అన్నారు ..
జాన్ దేవ దాసు గారు మాట్లాడుతూ .. దర్శక, నిర్మాతలు ఈ మూవీ కోసం చాలా చాలా కష్టపడ్డారు సుమన్ గారు ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నటన మా సినిమాకి ప్లస్ అవుతుంది . ఈ చిత్రాన్ని అందరూ ఆదరించి పెద్ద విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు
డ్యాన్సర్ అరుంధతి మాట్లాడుతూ.. ఈ సినిమా నా కెంతో నచ్చింది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
ఆర్టిస్ట్ ఇమ్మార్బల్ మాట్లాడుతూ… ఈ చిత్రానికి సుమన్,జోసఫ్ , చలపతి గార్లే ఈ సినిమాకు బ్యాక్ అలాంటి వారి దగ్గర నటించినందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాకు డైరెక్టర్ మా డాడీ అయినా సెట్లో నేనెప్పుడూ డైరెక్టర్ గానే చూశాను. మా ఫ్రెండ్స్ కు మా డాడీ డైరెక్టర్ అంటే అందరూ ఎగతాళి చేశారు, మీ డాడీ డైరెక్టర్ అవ్వడం ఏంది? మీ డాడీ డైరెక్టర్ అయితే ఒక్క పోస్టర్ కూడా కనపడదని ఎగతాళి చేసేవారు, మా డాడీ ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు .మాకు ఎన్నో కష్టాలు వచ్చి ఆఖరికి రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేసిన ఒకే ఒక్కరు సుమన్ గారు.. మా ఫాదర్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయినా, డైరెక్టర్ గా కూడా సక్సెస్ అవ్వాలని కథలు రాసుకుని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి కథలు చెప్పిన అవకాశం కల్పించలేదు, కానీ తను ఒక మంచి కథ తయారు చేసుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత జోషఫ్ గారి సపోర్ట్ తో సినిమాను కంప్లీట్ చేసి విడుదల చేయాలనుకున్న సందర్భంలో కరొనా రావడం ఆ తర్వాత నిర్మాత జోషఫ్ గారు ఓ.టి.టి లలో వద్దని బిగ్ స్క్రీన్ లలో విడుద చేయాలని వెయిట్ చేసి ఇప్పుడు బిగ్ స్క్రీన్లలో విడుదల చేసి మంచి విజయం సాదించాము. ఇంతకాలం మా డాడీ గురించి చులకనగా చూసిన వారికి ఈ సినిమా విజయంతో “చేతిలో చెయ్యేసి చెప్పు బావ” సినిమా డైరెక్టర్ మా డాడీ అని గొప్పగా చెప్పుకుంటాను.మా సినిమాకు థియేటర్స్ లలో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నా కూడా మాకు మరిన్ని థియేటర్ లు ఇవ్వకుండా పెద్ద సినిమాలకోసం మా సినిమాను థియేటర్ల నుండి తొలగిస్తుస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ పెద్దలకు చెప్పేది ఏమిటంటే మా సినిమాను ఒకసారి చూడండి బాగుంది అంటేనే థియేటర్లు ఇవ్వండి.అలా ఇచ్చి చిన్న సినిమాలను బతికించాలని సినీ పెద్దలను,డిస్ట్రిబ్యూటర్లను వేడుకొంటున్నాను.అలాగే.మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.
చిత్ర నిర్మాత కోమరపు జోషఫ్ మాట్లాడుతూ. .. బిజినెస్ చేస్తున్న నాకు సినిమా చేయమని మా ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో కొంతమంది డైరెక్టర్లతో కథలు వినడం జరిగింది కానీ ఆ కథలు నచ్చక చివరికి నేనే కథ రాసుకొని “చెయ్యేసి చెప్పు బావా” టైటిల్ కూడా పెట్టుకున్నాను. అయితే నేను రాసిన కథకు లిరిక్స్, పాటలు కావాలని మంచి డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో మా ఫ్రెండు ద్వారా కట్ల రాజేంద్రప్రసాద్ ను పరిచయం చేయడం జరిగింది. సీనియర్ పర్సన్ దగ్గర మనం సినిమా తీయాలంటే బడ్జెట్ సరిపోదని చెప్పడంతో అదేం లేదు ఆయన ఆల్ రౌండర్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ , ఫైటర్, కెమెరామెన్ ఇలా అన్ని చేయగలుగుతారని చెప్పడంతో మేము కథ కోసం డిస్కషన్ చేసుకున్నా క్రమంలో నా కథ చెప్పడంతో ఆ కథకు మాటలు పాటలు చేయమని చెప్పడం జరిగింది దాంతో డైరెక్టర్ వన్ మంత్ టైమ్ తీసుకుని డైలాగ్స్ లిరిక్స్ రెడీ చేసుకుని వచ్చి మూవీని షూట్ చేద్దామని అనుకున్నాం అయితే నా బర్త్ డే జనవరి 26 రోజున ఉన్నందున నా బర్త్డే రోజు అన్నపూర్ణ స్టూడియో ఓపెన్ చేయడం సినిమా ఓపెనింగ్ చేయడం జరిగింది .ఆ తరువాత మంచి ప్యాడ్ ఇన్ రెడీ చేసుకొని మా ఫ్రెండు ఊరు చేగుంటలో సూట్ స్టార్ట్ చేసుకుని సుమారు 52 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మార్చి 25 కు ఈ మూవీని విడుదల చేద్దాం అనుకున్న టైంకు కోవిడ్ రావడంతో సినిమా విడుదల ఆగిపోయింది. తర్వాత ఓ.టి.టి. ఫ్లాట్ ఫామ్స్ లలో విడుదల చేయమని చాలామంది అడిగినా ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తానని చెప్పడం జరిగింది..గత నెల జనవరి 26 నా బర్త్ డే రోజు ఫిబ్రవరి 5 న సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది.చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 5 న సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్లలో విజయవంతంగా నడుస్తుంది. చిన్న సినిమాలకు కూడా గవర్నమెంటు రాయితీ ఇచ్చి మరిన్ని థియేటర్స్ లలో అవకాశం కల్పిస్తే చిన్న సినిమాలను ఆదుకున్న వారవుతారు.మా చిత్రానికి అన్ని చోట్లా నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా టైటిల్ వలన నాకు చాలా మంచి పేరు వచ్చింది అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.
చిత్ర దర్శకుడు కట్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి డైరెక్షన్ చేయడానికి ముఖ్య కారణం చలపతి రాజుగారు,ఇంత మంచి బ్యానర్ ను నిర్మాతను ,ఫ్యామిలిని కల్పించారు. అలాంటి వారి ఋణం ఎలా తీర్చుకోవాలని ఆలోచించి జోషఫ్ గారు ఇచ్చిన కథలో చిన్న మార్పు చేసి ఈ సినిమాలో విలన్ పాత్ర ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న దాని కంటే బాగా నటించాడు. తెలుగు ఇండస్ట్రీ లో విలన్ కొరత ఉంది ఈ సినిమాతో మనకు మంచి విలన్ దొరికాడు. అలాగే నిర్మాత గారు నేను ఏ అరిస్టు కావాలంటే ఆ ఆర్టిస్ట్ ను ఇచ్చారు ఇలా ఈ సినిమాలో 18 మంది పెద్ద ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. నాకు ఎక్కడ షూటింగ్ కావాలంటే అక్కడ ఖర్చుకు వెనకడకుండా ఏర్పాటు చేశారు.నేను ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు డైరెక్టర్ గా పని చేశాను. నేను చేసిన ప్రొడ్యూసర్ లందరి కంటే జోషఫ్ గారు ది బెస్ట్ ప్రొడ్యూసర్. ఎందుకంటే చాలామంది మేము చేస్తున్న డైరెక్షన్ లో మార్పులు చేయమంటారు కానీ జోషఫ్ గారు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం తో ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది. మా సినిమాలో పెద్ద హీరో అయ్యి ఉంటే సూపర్ హిట్ మూవీ అయ్యివుండేది. చిన్న హీరో కాబట్టి హిట్ మూవీ గా నిలిచింది.ఈ సినిమాను నేను ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.సినిమా విడుదల సమయంలో నిర్మాత చాలా కష్టపడ్డాడు.ఈ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.ఈ సినిమా చాలా బాగుంది
దయచేసి మా సినిమాను ఒక్కసారి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
సాంకేతిక నిపుణులు
సమర్పణ :-మేరీ కృపావతి ప్రభుదాస్
బ్యానర్ :-కొమురం ప్రొడక్షన్స్
సారధ్యం :-జాన్ దేవదాస్
టైటిల్ :-చేతిలో చెయ్యేసి చెప్పు బావా
ఎడిటింగ్ :-వెంకటేశ్వరరావు
సంగీతం :-పార్థు
డి ఓ పి :-వేణు మురళీధర్
పి.ఆర్.ఓ:- మధు విఆర్
కో-డైరెక్టర్ :-జి ఎం రాధాకృష్ణ
కో ప్రొడ్యూసర్ :-ఎస్తేరు రాణి
కథ , ప్రొడ్యూసర్ :- కె జోషఫ్
డైలాగ్స్ స్క్రీన్ ప్లే కొరియోగ్రఫీ డైరెక్షన్ :-కట్ల రాజేంద్ర ప్రసాద్
నటీనటులు
ఆదిత్య ఓం, అరుణ్ రాహుల్ ,అంజనా శ్రీనివాస్, రోహిణి ముంజల్, చలపతి రాజు, సుమన్, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, కవిత, అనంత్ ,చిత్రం శీను, సుమన్ శెట్టి ,అప్పారావు, జయవాణి, ఇమ్మార్బల్ ,అరుంధతి మొదలగువారు