Romantic Criminals Movie Release on May 17th
అందరినీ మెప్పించే యూత్ ఫుల్ రొమాంటిక్ క్రిమినల్స్ఈనెల 17న విడుల చేస్తున్నాం – దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి
ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ లాంటి సందేశాత్మక, కమర్షియల్ హిట్ చిత్రాలు అందించడమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాలకు పెద్ద బడ్జెట్ అవసరం లేదని నిరూపించి టాలీవుడ్ లో ట్రెండ్ ని క్రియేట్ చేసిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం రొమాంటిక్ క్రిమినల్స్. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఏ సర్టిఫికెట్ తో ఈ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందింది. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ పిక్చర్స్, శ్రావ్యా ఫిలింస్ బ్యానర్ల పై సంయుక్తంగా ఎక్కలి రవింద్రబాబు, బి.బాపిరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యెక్క పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లో తొలిసారిగా నిర్మించిన పోస్ట్ ప్రోడక్షన్ స్టూడియో రిసాలి స్టూడియో లో జరిగాయి. విచ్చలవిడితనం, దిగజారుతున్న మానవ విలువలు, ఒంటరి తనాన్ని పెంచుతూ మత్తు వైపు మళ్లిస్తున్న పరిస్థితులు, దళారుల కథనాల్ని, ఇంటర్నెట్ అశ్లీలతను చూపించారు. అలాగే వినోదం ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇందులో మనోజ్ నందం ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గా నటించాడు. అతిన్ని ఇష్టపడే సీనియర్ స్టూడెంట్ గా అవంతిక, డ్రగ్ పెల్లర్ గా వినయ్, 9వ తరగతి విద్యార్థిగా మౌనిక, కొత్తగా పెళ్లైన గృహినిగా దివ్య బాగా నటించారు. సున్నితమైన అంశాల్ని బోల్డ్ గా చూపించారు. ముసుగులు వేసుకున్న అమ్మాయిల కథ. మితిమీరిన వ్యసనాల్ని ఈ చిత్రంలో సున్నితంగా చర్చించారు. ఈనెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా
చిత్ర దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….. నా దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాల కంటే ఈ సినిమాలో కంటెంట్ కోసం చాలా ఎక్కువగా రీసెర్చ్ చేశాం. సినిమా కూడా అంతకంటే చాలా రెట్టు చాలా బాగా వచ్చింది. బాపిరాజు గారు స్థాపించిన శ్రీ లక్ష్మీ పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా తొలిసారిగా… మా బ్యానర్ శ్రావ్య ఫిలింస్ తో కలిసి నిర్మించాం. ముసుగు అనే కాన్పెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాం. సమాజంలో ముసుగు చాటున చాలా జరుగుతున్నాయి. వాటిలో వ్యసనం అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ముఖ్యంగా మత్తు బానిసల గురించి చెబుతున్నాం. యూత్ కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. ఇందులో మనోజ్ నందం హీరోగా నటించాడు. నెగెటివ్ పాత్రలో వినయ్ మహాదేవ్ నటించారు. మౌనిక, అవంతిక మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈనెల 17న మీ ముందుకు వస్తున్నాం. అని అన్నారు.
మనోజ్ నందం మాట్లాడుతూ…. రిలీజ్ అయ్యేవరకు ఈ ముసుగులుంటాయి. ఈ సినిమా గురించి
చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. భిన్నమైన కథని విభిన్నంగా చెబుతున్నాం. చాలా మంది మత్తుకు బానిసలు అవుతున్నారు. బర్నింగ్ ఇష్యూ ని యంగ్ స్టర్స్ ని ఉద్దేశించి చేసిన సినిమా ఇది. అందరికీ బాగా నచ్చే సినిమా ఇది. అని అన్నారు.
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ… రొమాంటిక్ క్రిమినల్స్ చాలా మంచి చిత్రం … చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎలాంటి తప్పులు చేయకూడదో చూపించారు డైరెక్టర్ గారు. ముసుగు వెనక దాగి ఉన్న ఆడపిల్ల రహస్యం ఇందులో చూపించారు. నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు అందరికీ థాంక్స్ అని అన్నారు.
వినయ్ మాట్లాడుతూ….. నేను థియేటర్ ఆర్టిస్ట్ ని. సపోర్టింగ్ యాక్టర్ గా థియేటర్ లో నంది అవార్డ్ వచ్చింది. సమాజంలో వ్యసనాలు చాలా ఉన్నాయి. సోషల్ అవేర్ నెస్ క్రియేట్ చేసేందుకు ఈసినిమా చేశారు. ఇందులో నేను నెగెటివ్ లీడ్ రోల్ ప్లే చేశా. ఫ్యామిలీ తో కలిసి చూడాల్సిన సినిమా.
రిసాలి ఇనిస్టిట్యూట్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికి అల్ ద బెస్ట్. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని ఎంటర్ టైనింగ్ గా చెప్పారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్.
నిర్మాత రవీంద్రబాబు మాట్లాడుతూ… సునీల్ కుమార్ రెడ్డి నుంచి గతంలో వచ్చిన చిత్రాల కంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసి చేశారు ఈ సినిమా. తప్పకుండా అందరినీ మెప్పిస్తుందనే నమ్మకముంది. అని అన్నారు.
మౌనిక…. ఇందులో నేను 9వ తరగతి చదివే డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్ చేసాను. నా ఏజ్ కు తగ్గ పాత్ర. ఈ సినిమా నాకు చాలా మంది పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అని అన్నారు.
నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ……. నేను ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నానంటే కారణం సునీల్ కుమార్ రెడ్డి, రవీంద్ర బాబు వల్లే. రొమాంటిక్ క్రిమినల్స్ కథను చాలా మంది అడిగారు. కానీ నా మీద అభిమానంతో నన్ను నిర్మాతగా పెట్టి తీశారు. అనుకున్నట్టుగానే సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. అని అన్నారు.
నటీనటులు… మనోజ్ నందన్, వినోద్, అవంతిక, దివ్య, మౌనిక , ఎఫ్.ఎమ్ బాబాయ్, బుగతా, సముద్రమ్ వెంకటేష్ తదితరులు..
సాంకేతిక వర్గం..
పాటలు ..బాల వర్దన్
సంగీతం.. సుధాకర్ మారియో
కెమెరా.. ఎస్.వి. శివరామ్
ఎడిటింగ్.. శామ్యుల్ కళ్యాణ్
పి అర్ ఓ .. ఏలూరు శ్రీను
సహనిర్మాతలు.. వైద్యశ్రీ డాక్టర్ ఎల్ ఎన్ రావు,
డాక్టర్ కె.శ్రీనివాస్,
నిర్మాతలు.. బి.బాపిరాజు, ఎక్కలి రవింద్రబాబు
కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం…. పి.సునీల్ కుమార్ రెడ్డి