జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్-అమ్ము అభిరామి యువ జంటగా, మరో కీలక పాత్రలో బేబి సహశ్రిత నటించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)‘ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు ముస్తాబవుతోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించారు.
కాగా, ఈ నెల 6న, శనివారం ఈ సినిమా బారసాల వేడుక జరగనున్నది. ఈ విషయం తెలియజేస్తూ, “ఎఫ్‌సీయూకే బారసాల వేడుక ఫిబ్రవరి 6న” అంటూ చిత్ర బృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి బారసాల వేడుక ఏమిటి!.. అంటూ అందరిలోనూ ఆశ్చర్యం, కుతూహలం వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌కే ఆ పేరు పెట్టినట్లు అర్థం చేసుకొన్నారు. ఆ రోజు ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకులు చూడనున్నారు.
ఇప్పటివరకూ ఈ చిత్రంలోని నాలుగు ప్రధాన పాత్రధారులకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, వారి క్యారెక్టర్లను పరిచయం చేస్తూ టీజర్‌ను రిలీజ్ చేశారు. వీటన్నింటికీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్లో జగపతిబాబు కనిపించిన తీరు అందరిలోనూ క్యూరియాసిటీని రేకెత్తించి, సినిమాపై అంచనాలను అనూహ్యంగా పెంచేసింది.
రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాదర్‌గా టైటిల్ రోల్ చేసిన జగపతిబాబు క్యారెక్టర్‌లోని రొమాంటిక్ యాంగిల్, ఆ యాంగిల్‌ను ఆయన పండించిన తీరు ప్రేక్షకుల్ని అమితంగా అలరించనున్నాయి. ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన ఆయన చాలా కాలం తర్వాత ఈ తరహా పాత్రను పోషించడం గమనార్హం.
భీమ్స్ సెసిరోలియో సుమధుర సంగీత బాణీలు అందించిన పాటలు ఇటీవల వరుసగా వైద్య-ఆరోగ్య, మునిసిపల్, పోలీస్, మీడియా సిబ్బంది లాంటి కొవిడ్ హీరోల చేతుల మీదుగా విడుదలై సంగీత ప్రియుల ఆదరాభిమానాలను పొందుతున్నాయి.
సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూసర్: వాసు పరిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీకాంత్‌రెడ్డి పాతూరి
సహనిర్మాత: యలమంచిలి రామకోటేశ్వరరావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ రంజిత్ మూవీస్.
Barasalla Function of FCUK (Father Chitti Uma Karthik) announced
Sri Ranjith Movies today announced that this Saturday which is the 6th of February FCUK (Father Chitti Uma Karthik) movie Barasala Function will be held. The announcement is creating lot of intrigue as to what is Barasala Function will be. Finally Telugu audiences may get to see the first visuals of the much awaited FCUK (Father Chitti Uma Karthik)movie as A poster was released today announcing the date of this ‘pre-release’ event as 6th February 2021. Until now the only visuals of the movie released have been the teaser and AV’s about each of the character. However these visuals took the telugu audiences by storm and much expectation has been created about the film which Stars Jagapathi Babu, Ram Karthik and Ammu Abhirami. The movie is scheduled to be released on February 12th.
‘FCUK’ (Father Chitti Uma Karthik) has become the popular acronym for the actual title of the movie, ’Father Chitti Umaa Kaarthik’. Projected as a Romantic Comedy the movie presents Jagapathi Babu in a titular role after a long gap and this is bringing back memories of Jagapathi Babu stellar performances as a Romantic performer. The music of the movie has been composed by Bheems Ceciroleo and the songs have been released by various Covid heroes like Health, Muncipal, Police and Media Personnel which has brought a lot of appreciation to the movie team. FCUK (Father Chitti Uma Karthik) has been produced by K L Damodar Prasad and directed by Vidyasagar Raju.