విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన ‘ఉప్పెనలోని జల జల జలపాతం నువ్వు’ పాట
విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన ‘ఉప్పెనలోని జల జల జలపాతం నువ్వు’ పాట
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 12న థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.
దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా ఇప్పటికే విడుదలైన “నీ కన్ను నీలి సముద్రం”, “ధక్ ధక్”, “రంగులద్దుకున్న” పాటలు సంగీత ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి.
లేటెస్ట్గా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ చిత్రంలోని “జల జల జలపాతం నువ్వు..” అంటూ సాగే పాటను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, “ఇప్పుడే పాట విన్నాను, లాంచ్ చేశాను. దేవి శ్రీప్రసాద్ గారు మరోసారి మ్యాజిక్ చేశారు. సాంగ్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ మూవీతో ముగ్గురు పరిచయమవుతున్నారు.. డైరెక్టర్ బుచ్చిబాబుగారు, హీరోయిన్ కృతి, హీరో వైష్ణవ్ తేజ్. ఈ ముగ్గురికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఈ సినిమా వారికి హ్యాపీనెస్‌ను, సక్సెస్‌ను తీసుకొస్తుందని ఆశిస్తున్నా. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ అవుతోంది. థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ అంటున్నారు. అందరూ థియేటర్లలో ఈ సినిమా చూసి, ఎంజాయ్ చేయండి” అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన వై. రవిశంకర్ మాట్లాడుతూ, “ఈ ఆల్బమ్‌లోనే మా అందరి ఫేవరేట్ సాంగ్ ‘జల జల జలపాతం నువ్వు’. విజయ్ దేవరకొండగారు ఈ సాంగ్‌ను లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. దేవిగారు ఈ సినిమాకు ఆల్‌టైమ్ బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. ఒక మంచి లవ్ స్టోరీకి ఆత్మ లాంటి సంగీతాన్నిచ్చారు.”అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా పాల్గొన్నారు.
“జల జల జలపాతం నువ్వు.. సెల సెల సెలయేరుని నేను” అంటూ సాగే ఈ పాటను చిత్రంలో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిపై డ్యూయెట్గా చిత్రీకరించారు. దేవి శ్రీప్రసాద్ సమకూర్చిన సుమధుర బాణీలకు తగ్గట్లు అందమైన పదాలతో పాటను అల్లారు గేయరచయిత శ్రీమణి. జస్ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ గాత్రంలో ఈ మెలోడీ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనేట్లు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తన మ్యూజిక్ టేస్ట్‌తో, పాటలను ప్రెజెంట్ చేసిన విధానంతో అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను అందిస్తున్నారు.
తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్ర చేస్తున్న ‘ఉప్పెనలో సాయిచంద్, బ్రహ్మాజీ కీలక పాత్రధారులు.
తారాగణం:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సీఈవో: చెర్రీ
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి.
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి.
‘Uppena’ which introduces Panja Vaishnav Tej and Krithi Shetty to Telugu Film Industry is one of the most-awaited films of the season. First timer Buchi Babu Sana is directing the film set for release in theaters on February 12.
Devi Sri Prasad has composed the music for the film. The songs “Nee Kannu Neeli Samudram”, “Dhak Dhak” and “Ranguladhukkunna” stuck a chord with music lovers.
Sensational star Vijay Devarakonda released the latest song of the movie “Jala Jala Jalapaatham Nuvvu ..” on Sunday. It is a duet song shot on Vaishnav Tej and Krithi Shetty. Shree Mani pemned excellent lyrics for the wonderful tune composed by Devi Sri Prasad. The melodious song with the vocals of Jasprith Jasz and Shreya Ghoshal will enthrall the audience for sure. It will be pleasing to see the song on screen with the visuals of sizzling chemistry between the lead pair.
Speaking on the occasion, Vijay said, “I have just listened to the song and launched it. Devi Sri Prasad has done magic once again. The song is beautiful. Three people are getting introduced (Vaishnav Tej, Krithi Shetty, and Buchi Babu Sana) with this movie. Hope it brings happiness and success to them. The movie is set for release on February 12. Theaters will have 100 percent occupancy. Everyone watch this movie in theaters and enjoy.”
One of the producers, Y. Ravi Shankar said, “‘Jala Jala Jalapaatham Nuvvu’ is the favorite song for all of us. We are happy that Vijay Devarakonda launched this song. We are releasing the movie on February 12. We are very confident about this movie. Devi Sri Prasad’s songs are like soul for this love story”.
Hero heroines Panja Vaishnav Tej, Kriti Shetty, and director Buchi Babu Sana were also present on the occasion.
Director Buchibabu, who grabbed everyone’s attention to himself with his music taste and the way he presented the songs, is providing the story, screenplay, and dialogues for the film.
Tamil Star Actor Vijay Sethupathi is playing a crucial role in the film which has Saichand and Brahmaji as the key characters.
The movie is being produced by Mythri Movie Makers and Sukumar Writings.
Cast:
Panja Vaishnav Tej, Vijay Sethupathi, Kriti Shetty, Saichand, Brahmaji
Technical team:
Story, Screenplay, Dialogues, Direction: Buchi Babu Sana
Producers: Naveen Yerneni, Y. Ravishankar
Banners: Mythri Movie Makers, Sukumar Writings
CEO: Cherry
Music: Devi Sri Prasad
Cinematography: Shamdath Sainuddin
Editing: Naveen Nooli
Art: Mounika Ramakrishna
Executive Producers: Anil Y, Ashok B.
PRO: Vamsi-Shekar, Madhu Maduri.