100% తెలుగు ఓటీటీ ‘ఆహా’లో 52 ప్రీమియం ఒరిజినల్స్ తో 2021 దీపావళి వరకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్
100% తెలుగు ఓటీటీ ‘ఆహా’లో 52 ప్రీమియం ఒరిజినల్స్ తో 2021 దీపావళి వరకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘ఆహా’ ఈ ఏడాది నవంబర్‌లో దీపావళి రోజున గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ ఏడాది దీపావళి నుండి 2021 దీపావళి వరకు 52 ఒరిజినల్స్‌తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ను అందించడానికి సిద్ధమవుతుంది. ఈ ఒరిజినల్స్‌ను తెలుగు ఇండస్ట్రీలోని టాప్ ఫిలిం మేకర్స్ రూపొందిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మూవీ, వెబ్ సిరీస్, టాక్ షోస్, డ్రామాస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జోనర్స్ తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకోనున్నారు. హ్యూజ్ కంటెంట్‌తో దేశంలోని అత్యంత వినూత్నమైన, విభిన్నమైన తెలుగు కంటెంట్ లైబ్రరీలలో ఒకదానిగా ఉండటానికి ఆహా ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం 7 mn యాప్ డౌన్లోడ్లతో ఉన్న ఆహా ఇప్పుడు 20 మిలియన్లకు పైగా ఉన్నతన బలమైన వినియోగదారులకు సేవలు అందిస్తుంది.
తమ కంటెంట్ విస్తృతిని పెంచుకోవడానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఆహా ప్రతినిధులు అనౌన్స్ చేశారు. తిరుగులేని కంటెంట్ కోసం ప్రముఖ దర్శకులైన సుకుమార్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, వంశి పైడిపల్లి, నందిని రెడ్డి, ప్రవీణ సత్తారు, డాక్టర్ సైలేష్, పవన్ కుమార్, వేణు ఉడుగుల, సుధీర్ వర్మ, సాగర్ చంద్ర రంగా యాలి, విద్యా సాగర్, ఉదయ్ గుర్రాలా, ప్రణవ్ పింగిల్ రెడ్డి, పల్లవి గంగిరెడ్డి తదితరులతో పాటు అద్భుతమైన యాక్టర్స్‌తో కలిసి పని చేస్తున్నారు. రీసెంట్గా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేనితో వ్యాఖ్యాతగా సామ్ జామ్ అనే టాక్‌షోను ప్రారంభించారు. వెబ్ సిరీస్ పర్మనెంట్ రూమ్మేట్స్తో పాటు కమిట్‌మెంటల్, మావింతగాధవినుమా, అనగనగా ఓ అతిథిలతో ఆహా ప్రేక్షకులను ఈ ఎంటర్టైన్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.
మరో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా నటించిన లెవన్త్ అవర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని ద్వారా తమన్నా ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. అలాగే స్వప్న దత్ రూపొందిస్తున్న కంబలపల్లి కథలు, బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియావారి అన్య ట్యుటోరియల్, సూపర్ ఓవర్, మైదానం, మేజ్, బియాండ్ టెక్స్ట్ బుక్, కుడి యేడమైతే, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, తోడేలు, రుద్రవీణ మరియు కుబూల్ హై వంటివి ఈ లిస్టులో ఉన్నాయి.
ఈ సందర్భంగా ఆహా ప్రమోటర్ జూపల్లి రామురావ్ మాట్లాడుతూ “ఈ రోజు ఓటీటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి. పీడబ్ల్యుసీ నివేదిక ప్రకారం వచ్చే నాలుగేళ్ళలో 28.6 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 50 మిలియన్లకు పైగా తెలుగు కంటెంట్ వినియోగదారులతో, మార్కెట్ సామర్థ్యం భారీగా ఉందని మేము నమ్ముతున్నాం. ఈ నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే ఆహా మాధ్యమం తెలుగు వినోద పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా గుర్తింపు పొందింది. ఇంకా ప్రముఖ దర్శకులు, ఆర్టిస్టులు కాంబినేషన్లో మరింత ఎంటర్టైన్మెంట్ను అందించడానికి ఆహా చేసే ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటుందని మేం నమ్ముతున్నాం” అన్నారు.
ఓటీటీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ఆహా ఇండియాలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రానున్న ఏడాది మరింత ఎంటర్టైన్మెంట్తో ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచుతుంది ఆహా.
aha, the 100% Telugu OTT platform, announces its content slate for 2021 with the unveiling of 52 premium originals
After a grand Diwali event with Allu Arjun in November, aha, the 100% Telugu OTT platform continues with its orange wave of entertainment by bringing forth a stellar Diwali 2020-2021 programming line-up featuring 52 originals. Helmed by the finest filmmakers from the Telugu industry, the content slate will range from blockbuster movies, original web shows, movies, talk shows, and docudramas covering multiple genres, targeting global Telugu-speaking audience across age groups and genders. The width of content seeks to bring one of the most innovative and diverse Telugu content libraries in the country. Through this, aha, currently with 7 mn app downloads, will serve its strong user base of over 20 million in the Telugu entertainment genre.
Extending its objective of being the go-to destination for premium Telugu content; the platform brought in superstar Allu Arjun on board as its brand ambassador, along with esteemed directors Sukumar, Harish Shankar, Surender Reddy, Vamshi Paidipally, Nandini Reddy, Praveen Sattaru, Dr Sailesh, Pawan Kumar, Venu Udugula, Sudheer Varma, Sagar Chandra, Ranga Yali, Vidya Sagar, Uday Gurrala, Pranav Pingle Reddy and Pallavi Gangireddy amongst others, to team up with eminent actors from the industry. Furthermore, the platform also recently launched the massive talk show Sam Jam hosted by star actor Samantha Akkineni, The Viral Fever (TVF)’s original web series Permanent Roommates’ Telugu remake Commit Mental, Maa Vintha Gaadha Vinuma, Anaganaga O Athidhi as its festive offering, this Diwali, which opened to a huge response from audience and critics alike.
Coming soon are some of the most-awaited projects like 11th Hour which features actress Tamannaah Bhatia, who’s making her debut in the OTT space with the show, well-known producer Swapna Dutt’s Kambalapalli Kathalu, Baahubali producers Arka Media’s Anya’s Tutorial, Sooper Over, Maidanam, Maze, Beyond Textbook, Kudi Yedamaithe, In the Name of God, Thodelu, Rudraveena and Qubool Hai amongst others.
Sharing his thoughts, Ramu Rao Jupally, Promoter, aha, said, “In a short span of time, aha has grown to be recognized as a game changer in the Telugu entertainment industry. Today, the OTT industry is one of the fastest-growing markets which is expected to grow at a CAGR of 28.6 percent for the next four years as per the PwC report. With over 50 million Telugu content consumers across both Telugu states, we believe the market potential is huge. We are confident that the line-up featuring the biggest names in the industry will offer our audiences to enjoy through relatable and entertaining content.”
Growing from strength to strength, aha has become one amongst the fastest-growing OTT platform in India. On the back of offerings that can be enjoyed by one and all, aha will ensure that its content over 12 terrific months will keep the viewers entertained.
About aha
Launched in 2020, aha is an Indian video-on-demand streaming service based out of Hyderabad offering premium digital content for Telugu speaking audiences across the world. One of the fastest growing OTT platforms in India, it is owned by Arha Media & Broadcasting Private Limited, a joint venture by Geetha Arts and My Home Group. Aha creates original Telugu content across various formats that include movies, web-series, and non-fiction shows. The annual subscription for aha is available for audiences at an affordable price of ₹365 which is ₹1 per day.