Vasishta Simha’s Look As Tirupati From ‘Odela Railwaystation’ Is Out

Vasishta Simha’s Look As Tirupati From ‘Odela Railwaystation’ Is Out

‘ఓదెల రైల్వేస్టేషన్’ నుండి తిరుపతి గా హీరో వశిష్ట సింహ లుక్ విడుదల

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో హిట్ చిత్రాల  నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్నడిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందిస్తున్న ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. కన్నడలో ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8MM బుల్లెట్, ఇండియా vs ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016, వంటి హిట్ చిత్రాల‌తో పాటు 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట ఎన్. సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ప‌ల్లెటూరి అమ్మాయి ‘రాధ’ గా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది. ఇటీవల విడుదల చేసిన హెభా ప‌టేల్ లుక్ కి విశేష స్పందన లభించింది.   ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను వాస్తవికతకు దగ్గిరగా రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కించారు.  తిరుపతి పాత్రలో నటిస్తున్న హీరో వ‌శిష్ట సింహ లుక్ ను టీం విడుదల చేసింది. బట్టలు ఐరన్ చేస్తూ పక్కా పల్లెటూరి యువకుడి లుక్ తో ఉన్న వ‌శిష్ట సింహ పోస్టర్ ను విడుదల చేశారు. సాధారణ యువకుడిగా అందరికీ సహాయపడే క్యారెక్టర్ లో ఆయన కనిపిస్తారు.   ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహ‌న్ మాట్లాడుతూ – “ ఓదెల రైల్వేస్టేషన్ నుండి హీరో వ‌శిష్ట సింహ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశాము. మృదు స్వభావిగా హెల్పింగ్ నేచర్ ఉండే తిరుపతి  పాత్రలో వ‌శిష్ట సింహ కనిపిస్తారు.  చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. “ అన్నారు.

సంప‌త్‌నంది మాట్లాడుతూ, ” ఓదెల రైల్వేస్టేషన్ లో హీరో వ‌శిష్ట సింహ తిరుపతి పాత్రలో నటిస్తున్నారు.  నాకెంతో ఇష్టమైన ఈ పాత్ర మీక్కూడా నచ్చుతుంది. కన్నడ లో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న వ‌శిష్ట సింహ కు తెలుగు లో ఓదెల రైల్వేస్టేషన్ గొప్ప ప్రారంభాన్ని ఇస్తుందని ఆశిస్తూ అల్ ది బెస్ట్.” అన్నారు.        

హీరో వ‌శిష్ట‌ సింహ‌ మాట్లాడుతూ, ” రాధామోహ‌న్ గారి బ్యానర్ లో సంపత్ నంది గారి క్రియేషన్ లో అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఓదెల రైల్వేస్టేషన్ లాంటి ప్రత్యేకమైన చిత్రం ద్వారా తెలుగు లో హీరోగా పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది. తిరుపతి పాత్రలో పక్కా పల్లెటూరి కుర్రాడిగా కనిపిస్తాను. నా కెరీర్ కు ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. నాచురాలిటీ కి దగ్గరగా డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది.” అన్నారు      
 
వ‌శిష్ట‌సింహ‌, హెబా ప‌టేల్, సాయిరోన‌క్, పూజితా పొన్నాడ‌, నాగ‌మ‌హేష్‌(రంగ‌స్థ‌లం ఫేమ్‌), భూపాల్‌, శ్రీ‌గ‌గ‌న్, దివ్య సైర‌స్‌, సురేంద‌ర్ రెడ్డి, ప్రియా హెగ్దె త‌దిత‌రులు న‌టిస్తోన్నఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫి: ఎస్. సౌంద‌ర్ రాజ‌న్‌,
సంగీతం: అనూప్ రూబెన్స్,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
స‌మ‌ర్ఫ‌ణ‌: శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్,
నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్,
క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే: స‌ంప‌త్‌నంది,
ద‌ర్శ‌క‌త్వం: అశోక్ తేజ‌.

 
Vasishta Simha’s Look As Tirupati From ‘Odela Railwaystation’ Is Out
 
Different crime thriller titled ‘Odela RailwayStation’ which is Presented by Smt Lakshmi Radhamohan and bankrolled by Hit films producer KK RadhaMohan in Sri Sathya Sai Arts banner. Popular Director Sampath Nandi is providing Story, Screenplay, and Dialogues for this film. Ashok Teja is debuting as a Director with this film.

Vasishta Simha who played as a Hero in Superhit Kannada films Dayavittu Gamanisi, 8 MM Bullet, India vs England, Mayabazar 2016, and acted in 25 Kannada films is getting introduced as a Hero in Telugu with ‘Odela RailwayStation’. Heroine Hebah Patel is seen in a different role as a rural girl ‘Radha’. Her recently released look garners a superb response. This film is a different crime thriller which is based on incidents that happened in a village named ‘Odela’. ‘Odela RailwayStation’ is being made with a realistic approach without any makeup, different costumes, dream sequences, and songs. Hero Vasishta Simha’s look in the role of ‘Tirupati’ is unveiled today by the makers. He will be seen as a simple man with a soft soul and helping hands.  On this occasion…

Producer K.K. RadhaMohan said, ” We unveiled the look of Hero Vasishta Simha from ‘Odela Railwaystation’ today. He will be seen in the role of ‘Tirupati’, a soft guy with helping nature in the film. The entire shooting part has been completed. The film is currently undergoing its post-production works.”

Sampath Nandi said, ” First look of Hero Vasishta Simha as Tirupati from ‘Odela Railwaystation’ is released. I hope you will love ‘Tirupati’ as much as I did. Vasishta won millions of hearts in Kannada. Wishing him a great kickstart in Telugu with ‘Odela Railwaystation’. All the best to him.” 

Hero Vasishta Simha said, ” I am very glad of getting introduced in Telugu with a special film like ‘Odela Railwaystation’ in RadhaMohan gari banner, created by Sampath Nandi garu Directed by Ashok Teja. I will be seen as a village guy ‘Tirupati’ in the film. This film will become a very good turning point for my career. ‘Odela Railwaystation’ which is made with a realistic approach will surely become a big hit.”

Principal Cast involves Vasishta Simha, Hebah Patel, Sai Ronak, Pujita Ponnada, Naga Mahesh (Rangasthalam fame), Bhupal, Sri Gagan, Divya Cyrus, Surender Reddy, Priya Hegde, and Others.

Cinematography: S Soundar Rajan
Music: Anup Rubens
Editing: Tammi Raju
Fights: Real Sathish
Presented By: Smt Lakshmi Radhamohan
Producer: KK RadhaMohan
Story, Screenplay, Dialogues: Sampath Nandi
Direction: Ashok Teja