Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapathi Babu and Bollywood director Nagesh Kukunoor

కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు కాంబినేషన్‌లో బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి చిత్రం
`హైదరాబాద్ బ్లూస్`, `ఇక్బాల్` చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా.. ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ.శివప్రకాశ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
సినిమా నిర్మాణ రంగంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన నిర్మాతలు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమాను నిర్మిస్తుండటం విశేషం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తను వెడ్స్ మను ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇలా క్వాలీటీ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ కావడం లేదు.
ప్రస్తుతం వికారాబాద్, పూణేల్లో షూటింగ్ జరుగుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ఇప్పటికే నాలుగో భాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2019లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
కీర్తిసురేష్
ఆది పినిశెట్టి
జగపతిబాబు
రాహుల్ రామకృష్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు
దర్శకత్వం: నగేష్ కుకునూర్
బ్యానర్: వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత: సుధీర్ చంద్ర
కో ప్రొడ్యూసర్: శ్రావ్య వర్మ
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: చిరంతన్ దాస్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్