2Hours Love Hero interview
సుకుమార్ గారికి నేను ఏకలవ్య శిష్యుణ్నిః హీరో డైరక్టర్ః
ఇదే నా ఫస్ట్ ఫిలిం. సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. యాక్షన్ మూవీస్ చాలా ఇష్టపడే వాణ్ని. అలాగే హీరోయిజంతో కూడిన మూవీస్ కూడా చాలా ఇష్టపడేవాణ్ని. సుకుమార్ గారి డైరక్షన్ లో వచ్చిన ఆర్య సినిమా నన్ను చాలా ఇన్ స్పైర్ చేసింది. ఆ తర్వాత సుకుమార్ గారి `ఆర్య-2` సినిమా తో ప్లే రాయడం నేర్చుకున్నా. ఒక రకంగా సుకుమార్ గారే నేను డైరక్టర్ కావడానికి ఇనిస్పిరేషన్ అని చెప్పాలి. ఆ సమయంలోనే విడుదలైన `కిక్` సినిమా నా పర్సనల్ లైఫ్ పై ఎఫెక్ట్ చూపించింది. అలా బతకాలి అనిపించింది. నేను క్లైమాక్స్ అనుకుని స్టోరి రాస్తాను.
మీరు డైరక్షన్ లో ఎవరి దగ్గర శిష్యరికం చేయకపోవడానికి రీజన్??
ఐటీ ఎంప్లాయ్ ని. చెన్నై లో కొంత కాలం జాబ్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా చేశాను. మా ఇంట్లో నేను పెద్ద కొడుకును కావడంతో నాకు ఫ్యామిలీ రెస్పాన్స్ బులిటీస్ ఎక్కువ కాబట్టి డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో చేయలేకపోయాను. కానీ మూవీస్ చూస్తూ చాలా నేర్చుకున్నాను. నేను ఎక్కువగా స్క్రీన్ ప్లే పై దృష్టి పెడతాను. ఎందుకంటే మంచి ప్లే ఉంటేనే సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది.
ఈ కథ మీరే హీరోగా ఊహించుకుని రాశారా?
లేదండీ. `పెళ్లి చూపులు` సినిమా రిలీజ్ అయ్యాక ఈ స్టోరి విజయ్ దేవరకొండతో చేద్దాం అనుకున్నాను. కానీ ఆ తర్వాత `అర్జున్ రెడ్డి ` రిలీజ్ అయ్యాక ఆయన రేంజ్ మారిపోయింది. ఆయన చేసే స్టోరి ఇది కాదనిపించింది. అందులో ఆయన్ను రీచ్ అవడం కూడా కష్టమనిపించింది. ఇక కొత్త వారితో చేద్దామనుకుంటున్న తరుణంలో మా టీమ్ అంతా మీరే హీరోగా చేయవచ్చు కదా అనడంతో నేనే చేశాను.
`టు అవర్స్ లవ్` స్టోరి గురించి వివరిస్తారా??
రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కేవలం రెండు గంటలు మాత్రమే ప్రేమించుకుంటారు …అదే ఈ సినిమా కాన్సెప్ట్ . ఇదొక రామ్ కామ్ ఫిలిం. కామెడీ కూడా స్క్రిప్ట్ లో భాగంగా వస్తుంది. ఫస్టా ఫ్ అంతా లైట్ వెయిట్ లో వెళ్తుంది. సెకండాఫ్ లో ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి. ప్రేక్షకులు కొత్త ఫీల్ ను అనుభవిస్తారు. ఇందులో ట్రూ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని పొందుపరిచాము.
ఆడియో రెస్పాన్స్ ఎలా ఉంది?
ఇటీవల ఆడియో లాంచ్ చేశాం. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
తొలిసారి డైరక్షన్, హీరోగా రెండూ బాధ్యతలు నిర్వహించడం కష్టమనిపించలేదా?
నిజంగా చాలా డిఫికల్ట్ టాస్క్. చెప్పినంత ఈజీ కాదు. యాక్టర్ అంటే డైరక్టర్ చెప్పింది చేసి క్యారవాన్ లో కూర్చోవచ్చు కానీ, డైరక్టర్ , హీరో రెండూ ఒకరే అయినప్పుడు ..షాట్ చెప్పే దగ్గర , షాట్ లో రెండు చోట్ల ఉండాలి కాబట్టి కొంచెం కష్టంతో కూడుకున్నదే.
మిగతా క్యారక్టర్స్ గురించి చెప్పండి??
తణికెళ్ల భరణి గారు, అశోక్ వర్థన్ ఇలా కొంత మంది ఉన్నారు. మేజర్ గా హీరో , హీరోయిన్స్ మధ్యే ఉంటుంది. మా సినిమాలో హీరోయిన్ గా చేసిన కృతి అద్భుతంగా నటించింది. ఆమెకు మా సినిమా విడుదలయ్యాక వండ్రఫుల్ ఫ్యూచర్ ఉంటుంది.
యాక్టింగ్ కోర్స్ ఏమైనా చేశారా?
లేదండీ.. నేను యాక్టింగ్ నేర్చుకోలేదు. నేర్చుకుంటే వస్తుందని కూడా అనుకోను. అది ఇన్వాల్వ్ మెంట్, , ఇంట్రస్ట్ , ఎక్సీ పీరియన్స్ తో వస్తుందని నమ్ముతాను.
లిప్ కిస్సెస్ ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయండీ. కథలో భాగంగా వచ్చే వే తప్ప వాంటెడ్ గా పెట్టినవి కాదు. నేను కిస్స్ ను కూడా ఒక ఎమోషన్ గా చూస్తా తప్ప వేరే విధంగా కాదు. అదేమీ చూడరానిదేమీ కాదు. వే ఆఫ్ ఎక్స్ ప్రెషన్ మారింది. దాన్ని బట్టే సినిమా తీసాను తప్ప ,..ఎక్కడా హీరోయిన్ ని అసభ్య కరంగా చూపించలేదు. ఇక ఫ్యామిలీ వారు కనెక్ట్ అవుతారో లేదు కానీ యూత్ ఎమోషన్ తో సినిమా తీశాను.
సుకుమార్ సినిమాలు ఇన్ స్పైర్ చేశాయన్నారు కదా, ఆయన ఫ్లేవర్ ఏమైనా ఉంటుందా?
ఇంగ్లీష్ లో టైటిల్ పెట్టడంతో పాటు ఇంగ్లీష్ లోనే రాశారు, అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అవుతుందంటారా?
అవన్నీ ఏం ఆలోచించలేదండీ. `2 అవర్స్ లవ్ ` యాప్ట్ అవుతుందని పెట్టాం. టైటిల్ తో పాటు ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి?
`ఆంధ్ర పోరి`, ఇటీవల విడుదలైన వజ్రకవచధర గోవింద` సినిమాలకు పని చేసిన ప్రవీణ్ వనమాలి గారు సినిమాటోగ్రాఫర్ గా మా సినిమాకు పని చేశారు. ఆయన పనితనం తో సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. మా టీమ్ అందరూ సొంత సినిమాలా భావించి చేయడంతో అనుకున్న విధంగా సినిమా చేయగలిగాను. ఇక ఈ సినిమాకు మా ఫ్యామిలీ , ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు. యాక్టర్ ని ,డైరక్టర్ ని నేను కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశాను. అందు వల్ల బడ్జెట్ అనుకున్న దానికన్నా పెరిగింది.
ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు?
ఆగస్ట్ ప్రథమార్థంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం.
మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ?
కథ అయితే రెడీ గా ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక ఆ సినిమా వివరాలు వెల్లడిస్తాను.