మనం ఫెయిల్ అయితే మనల్ని హర్ట్ చేసేవాళ్లే ఎక్కువ -`సునీల్`
మనం ఫెయిల్ అయితే మనల్ని హర్ట్ చేసేవాళ్లే ఎక్కువ -`సునీల్`
సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శని , నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `చిత్రలహరి`. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ , సి.వి.యం (మోహన్) నిర్మాతలు. కిషోర్ తిరుమల దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో కమెడియన్ సునీల్ నటించాడు. తన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు…
తను మంచి టీచర్….
నాకు మంచి జరిగినా, చెడు జరిగినా చెప్పుకోవాలని పించే వ్యక్తి త్రివిక్రమ్. తను బేసిక్ గా మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు. తన లో మంచి టీచర్ కూడా ఉన్నాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే తను ధైర్యం చెబుతాడు. మేం అందరం రూమ్ లో ఉంటున్నప్పుడు ఏదైనా కష్టం వచ్చి రూమ్ కెళితే మాలో తను కాన్ఫిడెన్స్ పెంచేవాడు.
ప్రతి విషయం నుండి నేర్చుకోవాలి..
మనం ఫెయిల్ అయితే మనల్ని హర్ట్ చేసే వాళ్లే ఎక్కువ. సక్సెస్ అయితే పొగిడే వాళ్లు ఎక్కువ అవుతారు. మనల్లని మనం పవర్ పుల్ అనుకోకపోతే బ్రతకలేం. కానీ ఎప్పటికీ మన చుట్టూ ఉన్న సిట్యువేషనే పవర్ ఫుల్. అదే మన అవసరాలను నిర్ణయిస్తుంది. ఒకప్పడున్న ప్రయారిటీ ఇప్పుడు మారిపోతుంటుంది. హర్ట్ కాకుండా పోవడం అనేది ఉండదు. ప్రతి విషయం నుండి నేర్చుకుంటూ ముందకు పోతూ ఉండాలి.
గెలుపు, ఓటమి అనే దాన్ని దేవుడు నిర్ణయించలేదు..
గెలుపు, ఓటమి అనే దాన్ని దేవుడు నిర్ణయించలేదు. మనం పెట్టుకున్న గేమ్ ఇది. ఉదాహరణకు 100మీ. పరుగు పందెం పెట్టుకున్నప్పుడు అందరూ ఎవరు నెగ్గితే వాళ్లు గొప్పోళ్లు. ఇలా ఎవరికి ఒకరు ఓ ప్రొఫషన్ను ఎంచుకుని ముందుకెళుతుంటాం. నెగ్గిన వాడిని ఎవరూ ఎంకరేజ్ చేయకపోయినా పరావాలేదు. కానీ పడిపోయిన వాడిని లాగేయకూడదు. ఇండస్ట్రీలో కమెడియన్ నుండి హీరో అయ్యాను. ఫెయిల్యూర్స్ వచ్చాయి. అయితే నాకు దక్కిన అదృష్టం ఏంటంటే.. నాకు ఇక్కడ అందరితోనూ అనుబంధం బావుంది. ఏదో రకంగా నాకు అందరూ హెల్ప్ చేశారు.
నేను ఎక్కడా కమెడియన్‌గా చేయలేనని చెప్పలేదు..
హీరోగా ఓ జోల్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఉదాహరణకు జాకీచాన్ ఉన్నాడు. ఆయన కామెడీ హీరో. మన ఇండియాలో తండ్రి పాత్రలకు పొట్టలుంటాయి. చైనాలో ఫాదర్ క్యారెక్టర్స్ కూడా సిక్స్ ప్యాక్ ఉంటుంది. మన పరిస్థితులను బట్టి ఇక్కడి పాత్రలుంటాయి. నేను హీరోగా మారిన తర్వాత మీరు ఎలాంటి హీరో కావాలనుకుంటున్నారని ఒకరు అడిగారు. ఆయన మళ్లీ యాక్షన్ కామెడీ చేయమని చెప్పారు. నేను సిన్సియర్‌గానే ట్రై చేశాను. సినిమాల్లో నేను కొన్ని నేను ఒప్పుకున్నవి ఉంటే. కొన్ని నాకు నచ్చినవి దర్శక నిర్మాతలకు నచ్చక. వాళ్లకి నచ్చిన సినిమాలు చేసినవి ఉన్నాయి. అందాల రాముడు సక్సెస్ తర్వాత కమెడియన్‌గానే సినిమాలు చేసుకుంటూ ఉంటాం. మనకు సూట్ అయ్యే క్యారెక్టర్ వచ్చినప్పుడు సినిమా చేద్దామని అనుకున్నాను. కానీ నెమ్మదిగా దర్శక నిర్మాతలు కమెడియన్ పాత్రలకు నన్ను అప్రోచ్ కావడం తగ్గించేశారు. అంతే కానీ
నేను ఎక్కడా కమెడియన్‌గా చేయలేనని చెప్పలేదు.
సోషల్ మీడియాలో మీ పార్టిసిపేషన్ చాలా తక్కువ..
సోషల్ మీడియా ఎక్కువైంది. మా ఇంట్లో నేను సైకిల్ కొన్నది కూడా మీ అందరి బ్రెయిన్స్ లో న్యూస్ అయిపోతే, మీ బ్రెయిన్ ను నేను ఎంగేజ్ చేస్తున్నట్లేగా. చెత్త ఇన్ ఫర్మేషన్ తో మీ బుర్రలో ఆలోచనలను నేను ఎక్కడా ఆపేస్తున్నట్లేగా.
సోషల్ మీడియాలో నా పార్టిసిపేషన్ చాలా తక్కవ.
తేజుతో వర్క్ చేయడం ఎలా ఉంది..
తేజు సినిమాల్లోకి రాక ముందు నుండే పరిచయం. తనంటే నాకు బాగా ఇష్టం. మంచి విష్ణు, మనోజ్ వాళ్లకి తేజు మంచి స్నేహితుడు. నేను సినిమాల్లో చేస్తున్నప్పుడు తను నన్ను కలిస్తుండేవాడు. అప్పుడు తనతో తమ్ముడు . నేను ఎప్పటికైనా నిన్ను హీరోగా పెట్టి సినిమ చేసేస్తాను అని అంటుండేవాడిని. ఇన్నాళ్లకు తేజుతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది.
నెక్స్ట్ మీ మూవీస్ గురించి ..
తదుపరి బన్ని, త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాను. మరో రెండు పెద్ద సినిమాలు డిస్కషన్లో ఉన్నాయి. మరో పెద్ద స్టార్ సినిమాలో కూడా నటించబోతున్నాను.