‘మిస్ ఇండియా’ .. ఓ అమ్మాయి ఛాలెంజింగ్ జర్నీ: కీర్తిసురేశ్
‘మిస్ ఇండియా’ .. ఓ అమ్మాయి ఛాలెంజింగ్ జర్నీ: కీర్తిసురేశ్
‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్. ఈమె టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందిన ‘మిస్ ఇండియా’ నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్ 4న ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా వెబినార్‌లో కీర్తిసురేశ్ మాట్లాడుతూ …
* ‘మిస్ ఇండియా’.. ఓటీటీలో విడుదలవుతున్న నా రెండో చిత్రమిది. ప్రస్తుతం సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను ప్రేక్షకులకు చేర్చడమెలా అనేది ముఖ్యం. ఆ కోణంలో చూస్తే ఓటీటీలో ‘మిస్ ఇండియా’ విడుదల కావడం నాకు సంతోషాన్నిచ్చే విషయమే.
* ‘మహానటి’ తర్వాత నేను కమర్షియల్ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్న సమయంలో నాకు ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయమని అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలోనే నచ్చిన సినిమాలు ఓకే చేశాను.
* విదేశాల్లో ఎక్కువగా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి దేశంలో మన దేశం నుండి వెళ్లిన ఓ అమ్మాయి టీ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తుంది. బిజినెస్ రంగంలో రాణించాలని ఆ మధ్య తరగతి అమ్మాయి చాలా కలలు కంటుంది. టీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆమెకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఆమె ఎలా అధిగమించి సక్సెస్ అయ్యిందనేదే ‘మిస్ ఇండియా’ సినిమా. ఓ అమ్మాయి ఛాలెంజింగ్ జర్నీనే ఈ సినిమా. నిజానికి ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైనప్పుడు సినిమా అందానికి సంబంధించిన సినిమా అయ్యుంటుందేమోనని అందరూ ఆనుకున్నారు. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది.
* నరేంద్రనాథ్‌కి డైరెక్టర్‌గా తొలి సినిమా. అయితే నేను ఆ విషయాన్ని పెద్దగా ఆలోచించలేదు. స్క్రిప్ట్ ఎలా ఉందని చూశాను. సినిమాపై తనకున్న ఆసక్తి, విజన్ నచ్చింది. తన నెరేషన్ నచ్చింది. నరేంద్ర ప్రతి విషయంలో చాలా డిటెయిల్డ్గా ఉన్నాడు. అందుకనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.
* ‘మహానటి’ రిలీజ్ తర్వాత వర్కవుట్ చేయడం మొదలు పెట్టాను. అయితే ఇంత స్లిమ్‌గా కావడానికి ‘మిస్ ఇండియా’ కూడా ఓ కారణమని చెప్పొచ్చు. సినిమాలో సన్నగా ఉండాలి, ఏ డ్రెస్ వేసినా బావుండాలని డైరెక్టర్ చెప్పడంతో బరువు తగ్గాను.
* నిర్మాత మహేశ్ కోనేరు.. ‘మహానటి’ తర్వాత నేనైతేనే ‘మిస్ ఇండియా’కు న్యాయం చేస్తానని నన్ను సంప్రందించారు. డైరెక్టర్ చెప్పిన కథ కూడా నచ్చింది. కథానుగుణంగా మహేశ్ కొనేరుగారు సినిమాను చాలా రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో నిర్మించారు.
* ‘మహానటి’ తర్వాత నటిగా నా బాధ్యత మరింత పెరిగింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చినప్పుడు మరింత పర్ఫెక్షన్తో సినిమా చేయాలని తపన ఎక్కువైంది. నటిగా నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలనే ఆలోచిస్తాను. ఆ క్రమంలో వెబ్ సిరీస్‌లు చేయడానికి అయినా నేను సిద్ధమే. అయితే మంచి కాన్సెప్ట్ ఉండాలి. డేట్స్ అడ్జస్ట్ చేసే సమయంలో సమస్యలు రాకపోతే వెబ్ సిరీస్‌ల్లో నటించడానికి అభ్యంతరం లేదు.
* మహేశ్‌తో తొలిసారి ‘సర్కారువారిపాట’లో నటిస్తున్నాను. జనవరి నుండి షూటింగ్లో పాల్గొనే అవకాశాలున్నాయి.
* ఈ నవంబర్ 4న ‘మిస్ ఇండియా’ విడుదలవుతుంది. దీని తర్వాత గుడ్‌లక్ సఖి విడుదలకు సిద్ధంగా ఉంది. ‘సర్కారు వారి పాట’, ‘అణ్ణాత్తే’ సినిమాల్లో నటిస్తున్నాను. వీటితో పాటో ఓ తమిళ చిత్రం, రెండు తెలుగు చిత్రాలు డిస్కషన్స్‌లో ఉన్నాయి.