` కల్కి` మూవీ రివ్యూ!!
నటీనటులుః
యాంగ్రీమ్యాన్ రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్
సాంకేతిక నిపుణులుః
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.
రిలీజ్ డేట్ః జూన్ 28
రేటింగ్ః 2.75
వరుస ఫ్లాపులతో డీలా పడిపోవడంతో…ఇక రాజశేఖర్ పని అయిపోయిందనుకుంటోన్న తరుణంలో ప్రవీణ్ సత్తార్ `పియస్ వీ గరుడవేగ` తో మళ్లీ ను ఫామ్ లోకి తీసుకొచ్చాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మళ్లీ గరుడవేగంతో `కల్కి` సినిమా ప్రారంభించాడు రాజశేఖర్, అ! లాంటి విభిన్నమైన సినిమాతో సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. టైటిల్ తో అందరిలో క్యూరియాసిటీ ఏర్పరిచి టీజర్, ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెంచేసారు దర్శక నిర్మాతలు. మరి ఈ రోజు విడుదలైన కల్కి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కథ
కొల్లాపూర్ లో నర్సప్ప (అశుతోష్ రాణా) అనే నర రూప రాక్షసుడు ఉంటాడు. అతడంటే అందరికీ హడల్. అతనికి శేఖర్ బాబు (సిద్ధు) అనే తమ్ముడు ఉంటాడు. అతనికి ఆ ఊరిలో చాలా మంచి పేరుంటుంది. ఈ క్రమంలో ఆ ఊళ్లో జాతర జరుగుతండగా శేఖర్ బాబుని ఎవరో చంపేస్తారు. దీంతో నర్సప్ప తన బద్ద శతృవైన పెరు మాళ్లు ( శతృ) తన తమ్ముడిని చంపింటాడని అతని అనుచరులను చంపిస్తాడు. ఈ క్రమంలో పెరుమాళ్లు తప్పించుకుంటాడు. ఈ మర్డర్ మిస్తరీని చేధించడానికి కల్కి ( రాజశేఖర్) వస్తాడు. అసలు శేఖర్ బాబుని చంపిందెవరు? తమ్ముడు తనను మించి ఎదిగి పోతున్నాడని అన్న నర్సప్పే చంపేసాడా? లేదా వారికి ఆపోజిట్ గా ఉండే పెరుమాళ్లు చంపేస్తాడా? అసలు ఎవరు? చంపారు? ఆ కేసును ఇన్విస్టిగేషన్ చేయడానికి కల్కినే ఎందుకు వచ్చాడు అన్నది ఆసక్తికరమైన అంశం. అది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటలు పనితీరుః
ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రాజశేఖర్ నటించాడు. వయసు పై బడిని ఛాయలు కొంచెం ఎక్కువగా కనిపించినా కూడా తనలో మాత్రం ఆ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటి లాగే తన పాత్రకు వంద శాతం న్యాయం చేసాడు యాంగ్రీమ్యాన్ రాజశేఖర్. ఇక ఈ సినిమాలో ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ పాత్ర సినిమాకు కీలకం అని చెప్పాలి. భయపడే జర్నలిస్ట్ గా నటిస్తూ ఆడియన్స్ ని నవ్వించాడు. శేఖర్ బాబు లవర్ గా నటించిన అషీమా ( నందితా శ్వేత) పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుంది. ముస్లిమ్ యువతి పాత్రలో పర్ఫెక్ట్ గా యాప్ట్ అవడమే కాకుండా తన పాత్రకు న్యాయం చేసింది. అతి కిరాతకమైన పాత్రలో అశుతోష్ రాణా రాణించగా, శత్రు , నాజర్, చరణ్ దీప్ వారి పాత్రలకు ఎప్పటిలాగే ప్రాణం పోసారు. ఇక ఇప్పటి వరకు హీరోగా నటించిన సిద్ధు ఇందులో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించాడు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోవాలి. అవును దాశరథీ శివేంద్ర సినిమాటోగ్రఫీ కథ మూడ్ కి తగ్గట్టుగా అద్భుతంగా కుదిరింది. అలాగే శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో తన ఆర్ ఆర్ హాంటింగ్ చేసేలా ఉంటుంది. ఇక దర్శకుడు తన ఫస్ట్ సినిమాలా ఆడియన్స్ ను కన్య్ఫూజ్ లేకుండా క్లారిటీగా తెరకెక్కించాడు. కానీ కథ పరంగా కొత్తగా ఏమీ లేదు. టేకింగ్ పరంగా చాలా చోట్ల దర్శకుడు క్రియేటివిటీ , బ్రిలియన్స్ కనిపించింది.
ప్లస్ పాయింట్స్ః
రాజశేఖర్ నటన
సినిమాటోగ్రఫీ
సంగీతం
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరి
ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే
అక్కడక్కడ విసుగు తెప్పిచే రాహుల్ కామెడీ
ఫస్టాప్ లో కొంత ల్యాగ్
విశ్లేషణః
ఇదొక ఇన్విస్టెగేటివ్ స్టోరి. ఒక ఇన్విస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్, ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ చేధించే మర్డస్ మిస్టరీ. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో 1980 లో జరిగే కథ. 1980 బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలా క్రియేట్ చేయడానికి కొంచెం కష్టపడ్డారు. ప్రతి పాత్రకు విగ్గులు తొడిగేసి సహజత్వాన్ని తగ్గించారు. ఇక ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి. రాజమహల్ లోని సభ్యులందర్నీ చంపేసి ఆ రాజమహల్ ని ఆక్రమించుకోని ఆ ఊళ్లో పెత్తనం చలాయించడం, ఆ రాజమహల్ నుంచి ఎవరో ఒకరు తప్పించుకుని తిరిగి రివేంజ్ తీర్చుకోవడం చాలా సినిమాల్లో చూసాం. కానీ, వాటికి, దీనికి తేడా ఏమిటంటే… ఆ సినిమాలు రివేంజ్ పేరుతో తెరకెక్కితే ..ఈ సినిమా కర్మ సిద్ధాంతం అంటూ కొత్తగా ఓ పేరు తగిలిండంతో వాటి జాబితాలోంచి తప్పించుకోలిగింది. ఇక శేఖర్ బాబు ను ఎవరు ? చంపారు అనే ఇన్విస్టిగేషన్ చాలా స్లోగా సాగడం ఎక్కడ ఉత్కంఠ అనేది కలిగించలేదు. చాలా చిన్న కథకు చాలా ట్టిస్ట్ లు జోడించారు. ఒక్కో ట్విస్ట్ ని రివీల్ చేస్తూ వెళ్లడం బాగా నే ఉన్నప్పటికీ అవన్నీ కూడా చాలా వరకు ఊహించదగే విధంగా ఉండడం తో మైనస్ అయింది. దర్శకుడు హీరో రాజశేఖర్ ను చాలా స్టైలిష్ గా చూపించాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏంటి ? అంటే చివరకు స్మగ్లింగ్ కోసం అని సింపుల్ గా తేల్చేసారు. ఇక శేఖర్ బాబు ను ఎవరైతే చంపారని అనుకుంటున్నారో వారే ప్రీ క్లైమాక్స్ లో ఒకరినొకరు షూట్ చేసుకోవడంతో …మళ్లీ ఆడియన్స్ లో హంతకుడు ఎవరన్నది మొదలవుతుంది. దీంతో అసలు ఏం జరింగింది అనేది నందిత శ్వేత రివీల్ చేయడం, ఆ ఫ్లా ష్ బ్యాక్ ఎపిసోడ్ మళ్లీ సినిమాను అలా లేపింది. ఎవరైతే శేఖర్ బాబు ని చంపారో , అతడే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రావడం, ఈ క్రమంలో ఆ ఊరిలోని రాక్షసులను ఏరివేయడం అనే అంశం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఇక అదాశర్మ పాత్ర గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాసేపు స్టోరీని పక్కన పెట్టి రాజశేఖర్ స్టైలిష్ యాక్షన్ సినిమాటోగ్రఫీ, సంగీతం , క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కోసం సినిమా చూడవచ్చు.