ఈ పాత్ర కోసం చాలా నేర్చుకున్నా – `రాహుల్ విజయ్`
ఈ పాత్ర కోసం చాలా నేర్చుకున్నా – `రాహుల్ విజయ్`
రాహుల్ విజయ్ ఓ టెక్నీషియన్ కొడుకు. ఇండస్ట్రీలో పుట్టిపెరిగిన కుర్రాడు. 24 శాఖల్లోని వారి కష్టాన్ని ప్రతిబింబించే ఆర్టిస్ట్ అంటే అతనికి గౌరవం. ఆ విషయాన్నే తండ్రితో చెప్పాడు. తండ్రీ అనుమతించారు. సొంత నిర్మాణ సంస్థలో ఓ సినిమా పూర్తయింది. ఇప్పుడు రెండో సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఆ సినిమా పేరే `సూర్యకాంతం`. రాహుల్ విజయ్, నీహారిక కొణిదెల నటించిన `సూర్యకాంతం` శుక్రవారం విడుదల కానుంది. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. వరుణ్ తేజ్ సమర్పిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా గురించి రాహుల్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..
ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
నా తొలి సినిమా విడుదల కాకముందే సంతకం చేసిన చిత్రమిది. వరుణ్ అన్న చెబితే కథ విన్నా. నచ్చి చేశా.
తొలి సినిమా డిసప్పాయింట్ చేసిందని అనుకుంటున్నారా?
లేదండి. నా తొలిసినిమా ఎంత ఆడిందనే విషయాన్ని పక్కన పెడితే నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. `కుర్రాడు బాగా చేశాడు` అనే అందరూ అన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, నా పాత్రకు నేను న్యామం చేసినప్పుడు నేను భాదపడను.
`సూర్యకాంతం` ఎలా ఉంటుంది?
చాలా ఫన్నీగా ఉంటుంది. సినిమాలో అప్స్ అండ్ డౌన్స్ చాలానే ఉంటాయి. స్క్రీన్ ప్లే , స్క్రిప్ట్ చాలా బావుంటాయి. ఎమోషన్ అనేది యూనివర్శల్ థింగ్. స్టోరీని మనం ఎలా చూశామన్నది ఉంటుంది.
మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఇందులో నేను అభి అనే పాత్ర చేశాను. కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉండే పాత్ర. నా నిజ జీవితానికి , ఈ క్యారెక్టర్ కి అసలు ఎక్కడా సంబంధం ఉండదు. అందుకే ఈ పాత్ర కోసం చాలా నేర్చుకున్న. చాలా అబ్జర్వ్ చేశాను. పూజా, కాంతం. ఈ రెండు పాత్రల మధ్య నలిగిపోయే ఇన్నొసెంట్ పాత్ర. ఎవరినీ నొప్పించని తత్వం ఉన్న పాత్ర చేశా. ఇందులో ప్రతి పాత్రకూ ప్రత్యేకత ఉంటుంది. థియేటర్లో కూర్చున్న ఆడియెన్స్ ఎవరిని ఎక్కువ ఫాలో అవుతారో చూడాలి.
దర్శకుడి గురించి చెప్పండి?
ఈ సినిమా తర్వాత ప్రణీత్ తప్పకుండా చాలా హైట్స్ రీచ్ అవుతాడు. మామూలుగా మనం ఒతురుల్ని చూసేటప్పుడు
బ్లాక్ అండ్ వైట్ గురించి మాట్లాడుతూ. అయితే చెడూ, లేకుంటే మంచీ అన్నట్టే ఉంటుంది. కానీ నిజ జీవితంలో అలా ఉండదు. బ్లాక్ అండ్ వైట్ కి మధ్యలో ఓ గ్రే షేడ్ ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి గ్రే గురించి ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి. దాన్ని చాలా బేలన్స్ గా చెప్పాడు ప్రణీత్.
నిహారికతో పనిచేయడం ఎలా ఉంది?
తను చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్. ఎవరితో ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు. అలా లేకుంటే అడ్వాంటేజ్ తీసుకునేవారు చాలా మంది ఉంటారు. అలాంటి అంశాలకు తనెక్కడా స్కోప్ ఇవ్వదు.
తొలి సినిమాలో సోలో హీరో , వెంటనే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కేరక్టర్ చేయడం ఎలా అనిపించింది?
పెర్ఫార్మెన్స్ చేయడం నాకు ఇష్టమే. ఇప్పటికిప్పుడు యాక్షన్ హీరో అయిపోవాలనేం లేదు. 30 ఏళ్ల లోపు వీలైనన్ని ప్రయోగాలు కూడా చేయాలని ఉంది. నటుడిగా నా వంతు కృషి నేను తప్పకుండా చేయాలి. అందుకే ఈ సినిమా చేశా. ఇందులో తొలి సగం మొత్తం ఫన్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి.
ఈ సినిమా నిర్మాతల గురించి చెప్పండి?
చాలా మంచి ప్రొడక్షన్ టీమ్ అండీ. సెట్లో ఎప్పుడూ చిల్ గా ఉండేది. ఎక్కడా క్రియేటివ్ ఇన్ ఫ్లుయన్స చేయాలని చూడలేదు. దర్శకుడికి ఏం కావాలో అవన్ని సమకూర్చారు. చాలా ఆనందంగా అనిపించింది.
నాన్నగారు మీ స్క్రిప్ట్ విషయాల్లో ఎంత వరకు జోక్యం చేసుకుంటారు?
లేదండీ. ఆయన వింటారు. సలహాలిస్తారు. కానీ ఫైనల్ గా నేనేం చెబితే దానికి ఓకే చేస్తారు.
మీ నెక్స్ట్ మూవీస్ గురించి చెప్పండి?
నెక్ట్స్ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాను. కన్నడలో సూపర్ హిట్ అయినా సినిమాను తెలుగు , తమిళంలో రీమేక్ చేస్తున్నాం. ఏప్రిల్ మూడవ వారంలో ఈ చిత్రం స్టార్ట్ కానుంది.