అనుష్క మూగ బాసలు!!
అనుష్క మూగ బాసలు!!
మూగ , చెవిటి పాత్రలో త్వరలో అనుష్కన సిల్వర్ స్ర్కీన్ పై చూడబోతున్నాం. అవును… అనుష్క ప్రజంట్ `సైలెన్స్` అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె మూగతో పాటు చెవుడు ఉన్న పాత్రలో నటిస్తోందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏదో ఒక లోపంతో ఉన్న పాత్రను తీసుకుని దానికి ఎమోషన్స్ జోడించి సందేశాత్మక, వినోదాత్మక చిత్రంగా మలుస్తున్నారు. ఆ తరహాలోనే `సైలెన్స్` చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క చెవుడు, మూగ భాషకు సంబంధించిన శిక్షణ అమెరికాలో తీసుకుంటుందట. కేవలం సైగలతో, ముఖ కవళికలతోనే తన పాత్రను పండించాలి అనుష్క. అందుకే ఆ పాత్రకు సంబంధించిన కసరత్తులు చేస్తోందట. `భాగమతి `చిత్రం తర్వాత బరువు తగ్గడానికి చాలా అవస్థలు పడ్దది ఈ అమ్మడు. విదేశాలకు వెళ్లి అక్కడ నిపుణుల సమక్షంలో బరువు తగ్గింది. ఇప్పుడు సన్నగా నాజూకుగా తయారైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో `సైలెన్స్ ` సినిమా రూపొందుతోంది. ఇందులో రానా గెస్ట్ పాత్రలో నటించనున్నాడట.